Official: విజయ్ దేవరకొండ 'లైగర్' రిలీజ్ డేట్ ఫిక్స్.. రౌడి స్టార్ హై వోల్టేజ్ లుక్ వైరల్

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ - డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ పై అంచనాలు మామూలుగా లేవు. హై వోల్టేజ్ తో తెరకెక్కుతున్న మొదటి మూవీ లైగర్. ఈ సినిమా సెట్స్ పైకి వచ్చిన ఏడాది తరువాత అసలు షూటింగ్ పనులు మొదలయ్యాయి. దర్శకుడు పూరి జగన్నాథ్ ఇక మొదలు పెడితే ఆగకూడదు అనేలా షూటింగ్ ను పూర్తి చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఫైనల్ గా సినిమా రిలీజ్ డేట్ పై కూడా క్లారిటీ ఇచ్చేశారు. ఒక పవర్ఫుల్ పోస్టర్ ను కూడా వదిలారు.

మొదటిసారి పాన్ ఇండియా..

మొదటిసారి పాన్ ఇండియా..

డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ 20ఏళ్ల సినిమా కెరీర్ లో దాదాపు అగ్ర హిరోలందరితో వర్క్ చేశాడు. అయితే గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ దర్శకుడు పాన్ ఇండియా సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో లైగర్ అనే సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు. గత వారం లైగర్ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే.

న్యూ పోస్టర్ తో రిలీజ్ డేట్..

న్యూ పోస్టర్ తో రిలీజ్ డేట్..

ఇక ఫైనల్ గా సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఎనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 9న గ్రాండ్ గా విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. నిన్నటి నుంచి జూన్ లేదా జూలైలో సినిమా విడుదల కావచ్చని టాక్ వచ్చింది కానీ ఇప్పుడు చిత్ర యూనిట్ సరికొత్త డేట్ ను ఎనౌన్స్ చేసి అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది. ఇక విజయ్ న్యూ పోస్టర్ లో హై వోల్టేజ్ లుక్కుతో దర్శనమిచ్చాడు.

లిమిట్స్ దాటేస్తున్నారు..

లిమిట్స్ దాటేస్తున్నారు..

అయితే సినిమా బడ్జెట్ విషయంలో కూడా అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. విజయ్ కూడా ఇంతవరకు బడ్జెట్ విషయంలో లిమిట్స్ అయితే దాటలేదు. మొదటిసారి చేస్తున్న పాన్ ఇండియా సినిమా కాబట్టి అంచనాలకు తగ్గట్లుగానే సినిమాను రెడీ చేస్తున్నారు. సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే టార్గెట్ పెట్టుకోవడం వల్ల బడ్జెట్ నెంబర్లు కూడా పేరిగినట్లు టాక్

మొత్తం బడ్జెట్ ఎంతంటే..

మొత్తం బడ్జెట్ ఎంతంటే..

ఇక సినిమాని హిందీలో కరణ్ జోహార్ భారీ స్థాయిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. అన్ని భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. మరి అనుకున్న సమయానికి పూరి సినిమాను రెడీ చేస్తాడో లేదో చూడాలి. ఇక లైగర్ సినిమా కోసం మొత్తం రూ.110కోట్ల వరకు ఖర్చు చేయనున్నారట. కేవలం ఇది ఒక అంచనా మాత్రమేనని తెలుస్తోంది. అవసరం అయితే మరికొంత పెరిగే ఛాన్స్ ఉందట. కేవలం పూరి కెరీర్ లోనే కాకుండా విజయ్ కెరీర్ లో కూడా ఇదే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X