సోషల్ మీడియాలో మరో రికార్డును అందుకున్న విజయ్ దేవరకొండ.. నెంబర్ వన్!
టాలీవుడ్ రౌడి స్టార్ విజయ్ దేవరకొండకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఒక సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి పాన్ ఇండియా హీరో వరకు కూడా ఎంతో కష్టపడి వచ్చాడు. అగ్ర దర్శకులు కూడా ఇప్పుడు విజయ్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ఈ స్టార్ హీరోకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎలాంటి పోస్ట్ చేసిన కూడా సోషల్ మీడియాలో ఈజీగా వైరల్ అవుతుంది.
ఇక ఇటీవల సోషల్ మీడియాలో దేవరకొండ మరో న్యూ రికార్డ్ ను అందుకున్నాడు. సౌత్ ఇండియాలోనే అత్యధిక ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్న హీరోగా విజయ్ రికార్డు సృష్టించాడు. విజయ్ ఫాలోవర్స్ సంఖ్య ఈ మధ్య కాలంలోనే చాలా ఎక్కువగా పెరిగింది. గత ఏడాది ఈ సమయానికి 7 మిలియన్ ఫాలోవర్స్ కూడా లేరు. ఇక ఏడాది గ్యాప్ లోనే ఆ సంఖ్య డబుల్ అవ్వడం విశేషం.

పైగా ఇటీవల విజయ్ కు సంబంధించిన సినిమాలు కూడా రాలేవు. ఇక రీసెంట్ గా విజయ్ ఇన్స్టాగ్రామ్ లో 11 మిలియన్ల ఫాలోవర్స్ ను అందుకున్నాడు. అతి తక్కువ సమయంలోనే ఈ రేంజ్ లో ఫాలోవర్స్ అందుకున్న విజయ్ రానున్న రోజుల్లో తన స్టార్ డమ్ ను మరింత పెంచుకుంటాడని చెప్పవచ్చు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్న రౌడీ స్టార్ అనంతరం సుకుమార్ దర్శకత్వంలో ఒక వార్ సినిమా చేయనున్నాడు.


Click it and Unblock the Notifications











