టెన్షన్‌లో పూరి జగన్నాథ్.. విజయ్ దేవరకొండ సినిమా కోసం!
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మొదటిసారి డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో కలిసి ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై మాస్ ఆడియెన్స్ లో అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే దర్శకుడు పూరి సినిమాను ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు తేవాలని ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. కానీ ఊహించని విధంగా ప్లాన్స్ మొత్తం చేంజ్ అయ్యాయి.
అసలే సినిమా కాస్త ఆలస్యంగా స్టార్ట్ అయ్యిందని బాధపడిన పూరి జగన్నాథ్ కి లాక్ డౌన్ కూడా మరొక దెబ్బ కొట్టింది. ఫైటర్ అనే టైటిల్ సెట్ చేసినట్లు టాక్ వచ్చినప్పటికీ ఇంకా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ అయితే రాలేదు. అయితే ముంబైలో లాక్ డౌన్ కంటే ముందు 40 శాతం షూటింగ్ పూర్తి చేసిన దర్శకుడు ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా కొన్ని సీన్స్ ని మార్చబోతున్నాడట.

ఎందుకంటే.. సినిమా షూటింగ్ కోసం చాలా మంది విదేశీ ఆర్టిస్టుల అవసరం పడిందట. కొన్ని సీన్లలో విదేశీ జనాలను ఎక్కువగా చూపించాలని అనుకున్న పూరి జగన్నాథ్ కి ఈ పరిస్థితులలో విదేశీ ఆర్టిస్టులు దొరకడం అంటే చాలా కష్టం. అందుకే సినిమా కథలో మార్పులు చేసి.. ముందు పూర్తి చేసిన మరికొన్ని సీన్లను కూడా రీ షూట్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవతకు నిజమో తెలియాలి అంటే మరికోన్నీ రోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











