Liger First Glimpse: ఛాంపియన్‌షిప్‌కు ఛాయ్‌వాలా.. పిచ్చెక్కించిన విజయ్.. కథ మొత్తం చెప్పేశారుగా!

'పెళ్లి చూపులు' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోగా పరిచయం అయ్యాడు క్రేజీ గాయ్ విజయ్ దేవరకొండ. మొదటి చిత్రంలోనే అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న అతడు.. దీని ద్వారా భారీ హిట్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. ఆ వెంటనే 'అర్జున్ రెడ్డి' మూవీ మరో భారీ సక్సెస్‌ను అందుకున్నాడు. అంతేకాదు, ఈ చిత్రంతో విజయ్ టాలీవుడ్ స్టార్‌గా ఎదిగిపోయాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏకంగా 'లైగర్' అనే పాన్ ఇండియా సినిమాను చేస్తున్నాడు. తాజాగా దీనికి సంబంధించిన ఫస్ట్ గ్లిమ్స్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇంకెందుకు ఆలస్యం? దానిపై మీరూ ఓ లుక్కేయండి మరి!

పూరీతో కలిసి బాలీవుడ్ ఎంట్రీ

పూరీతో కలిసి బాలీవుడ్ ఎంట్రీ

చాలా కాలంగా హిట్ కోసం ఎదురు చూస్తోన్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో కలిసి 'లైగర్' అనే సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ఈ సినిమాను ఛార్మీ, పూరీతో పాటు కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

హాలీవుడ్ రేంజ్ మూవీతో రెడీగా

హాలీవుడ్ రేంజ్ మూవీతో రెడీగా

బాక్సింగ్ నేపథ్యంతో రూపొందుతోన్న 'లైగర్'లో విజయ్ దేవరకొండ బాక్సర్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం ఎంతో మంది ప్రముఖులు పని చేస్తున్నారు. అలాగే, హాలీవుడ్ స్టంట్ మాస్టర్లు ఇందులో భాగం అయ్యారు. అలాగే, అమెరికన్ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఆయనకు సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది.

న్యూ ఇయర్ గిఫ్టుగా గ్లిమ్స్ రిలీజ్

న్యూ ఇయర్ గిఫ్టుగా గ్లిమ్స్ రిలీజ్

పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రాబోతున్న 'లైగర్' మూవీ నుంచి అంతగా అప్‌డేట్లు రావడం లేదు. దీంతో క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ అభిమానులు తీవ్ర నిరాశగా ఉన్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా నూతన సంవత్సర కానుకగా ఒకరోజు ముందే ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లిమ్స్ వీడియోను విడుదల చేశారు.

ఛాంపియన్‌షిప్‌కు ఛాయ్‌వాలా

ఛాంపియన్‌షిప్‌కు ఛాయ్‌వాలా

తాజాగా 'లైగర్' మూవీ నుంచి గ్లిమ్స్ వీడియోను విడుదల చేశారు. ఇందులో బాక్సింగ్ రింగ్‌ ఫినాలేకు ఇండియా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న లైగర్‌ను పరిచయం చేస్తున్నట్లు చూపించారు. 'ముంబైకు చెందిన స్లమ్‌డాగ్.. నగరంలో ఛాయ్ అమ్ముకునే ఛాయ్‌వాలా.. ఛాంపియన్‌షిప్‌ బరిలో దిగుతున్నాడు' అంటూ హీరో పాత్రకు సంబంధించిన సీన్‌ను హైలైట్ చేసి చూపించారు.

పూనకాలు తెప్పించే విజువల్స్

పూనకాలు తెప్పించే విజువల్స్

విజయ్ దేవరకొండ 'లైగర్' మూవీ గ్లిమ్స్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. యాక్షన్ సీక్వెన్స్‌లు, విజయ్ మేనరిజం ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే, 'వీ ఆర్ ఇండియన్స్' అంటూ దేశభక్తిని పెంపొందించేలా తన గొంతును వినిపించాడు విజయ్. అంతేకాదు, ఆఖర్లో 'ఆగ్ లగా దేంగే' అంటూ డైలాగ్ విసిరి ప్రత్యర్థులకు వార్నింగ్ కూడా ఇచ్చాడీ రౌడీ బాయ్.

లైగర్ కథ మొత్తం చెప్పేశారుగా

తాజాగా విడుదలైన గ్లిమ్స్ వీడియోలో చూపించిన దాని ప్రకారం.. ఇందులో తన తల్లి (రమ్యకృష్ణ)తో కలిసి ముంబైలో ఛాయ్ అమ్ముకునే హీరో (విజయ్ దేవరకొండ) కిక్ బాక్సింగ్ నేర్చుకుంటాడు. ఆ తర్వాత అతడు వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఫినాలేకు చేరుకుంటాడు. ఈ క్రమంలోనే హీరోకు ఎదురైన సవాళ్లు ఏంటి అనేది ఈ సినిమా కథ అని తెలుస్తోంది. ఈ వీడియో ఆకట్టుకుంటోంది.

ఐదు భాషల్లో అప్పుడే రిలీజ్

ఐదు భాషల్లో అప్పుడే రిలీజ్


ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'లైగర్' మూవీని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. దీన్ని 2022, ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. దీంతో ఈ సినిమాపై అన్ని ఇండస్ట్రీలూ ఫోకస్ చేశాయి. ఇందులో బాలీవుడ్ నిర్మాతలు భాగమవడంతో అంచనాలు పెరిగిపోయాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X