రౌడీకి షాక్: విజయ్ దేవరకొండ సినిమా యాక్షన్ సీక్వెన్స్ లీక్.. బైకు మీదే హీరోయిన్‌తో రొమాన్స్.!
ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల్లో విజయ్ దేవరకొండకు ప్రత్యేకమైన శైలి ఉంది. తక్కువ కాలంలోనే స్టార్‌డమ్‌ను సంపాదించుకున్న ఈ కుర్రాడు.. సరికొత్త స్టైల్స్‌ను పరిచయం చేస్తున్నాడు. అలాగే, డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్‌ను మెయింటైన్ చేస్తున్నాడు. అలాంటి హీరో.. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో సినిమా చేస్తున్నాడు. వీళ్లిద్దరి కాంబినేషన్ అంటే ఎన్ని అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ లీక్ అయ్యాయి. ఆ సంగతులేంటో చూద్దాం పదండి.!

రౌడీ స్టార్‌కు ఊహించని ఎదురుదెబ్బలు
కెరీర్ ఆరంభంలో వరుస విజయాలతో దూసుకుపోయాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. దీంతో అతడికి ఫాలోయింగ్‌తో పాటు మార్కెట్ కూడా గణనీయంగా పెరిగిపోయింది. అయితే, ఈ మధ్య అతడు చేసిన చిత్రాలు పరాజయం పాలవుతున్నాయి. గత ఏడాది వచ్చిన ‘డియర్ కామ్రేడ్'తో పాటు ఇటీవల విడుదలైన ‘వరల్డ్ ఫేమస్ లవర్' బాక్సాఫీస్ ముందు బోల్తా పడ్డాయి.

ఆశలన్నీ డైనమిక్ డైరెక్టర్ సినిమాపైనే
ఎన్నో అంచనాలతో విడుదలైన రెండు సినిమాలు దారుణంగా విఫలం అవడంతో విజయ్ దేవరకొండ ఆశలన్నీ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తోన్న ‘లైగర్' పైనే ఉన్నాయి. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో అతడు ఫైటర్‌గా కనిపించనున్నాడు. క్రేజీ కాంబినేషన్ కావడంతో సినీ ప్రియుల కళ్లన్నీ ఈ మూవీపైనే ఉన్నాయి. దీంతో దీనిపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి.

ఆయన ఎంట్రీ సినిమా రేంజ్ పెరిగిపోయింది
ఈ సినిమాను మొదట తెలుగులో మాత్రమే రూపొందించాలని చిత్ర యూనిట్ భావించింది. అందుకు పూరీ జగన్నాథ్‌తో కలిసి ఛార్మీ స్వయంగా నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. అయితే, ఈ స్క్రిప్ట్ గురించి తెలిసిన తర్వాత బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్.. దీన్ని హిందీ సహా పలు భాషల్లో తెరకెక్కించాలని భావించారు. ఇందుకోసం ఆయన నిర్మాణ భాగస్వామి అయ్యారు.

అసలైన పని కూడా పూర్తయిపోయింది
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నటించే హీరోయిన్ గురించి ఎన్నో వార్తలు ప్రచారం అయ్యాయి. ఈ క్రమంలోనే ఇందులో జాన్వీ కపూర్, ఆలియా భట్, కియారా అద్వాణీ సహా ఎంతో మంది నటీమణుల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ, ఈ సినిమాకు యంగ్ బ్యూటీ అనన్య పాండేను ఫైనల్ చేసింది చిత్ర యూనిట్.

విజయ్ సినిమా యాక్షన్ సీక్వెన్స్ లీక్
ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ సీక్వెన్ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో విజయ్ దేవరకొండ బైక్‌ను నడుపుతుండగా... హీరోయిన్ అనన్య పాండే దాని ట్యాంక్ మీద కూర్చుని ఉంది. ఇవి చేజింగ్ సీన్‌కు సంబంధించిన ఫొటోలు అని ప్రచారం జరుగుతోంది.

బైకు మీదే హీరోయిన్‌తో రొమాన్స్.!
తాజాగా లీక్ అయిన ఫొటోల్లో పూరీ జగన్నాథ్ మార్క్ రొమాన్స్ కనిపిస్తోంది. యాక్షన్ సీక్వెన్స్‌లోనూ విజయ్ దేవరకొండ.. అనన్య పాండేతో బైకు మీదే రొమాన్స్ చేస్తున్నట్లు ఆ ఫొటోలు చూస్తే అర్థం అవుతోంది. దీంతో ఈ సీన్ సినిమాకే హైలైట్ అవబోతుందన్న టాక్ వినిపిస్తోంది. ఈ ఫొటోలు లీక్ అవడంతో విజయ్ సినిమా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది.


Click it and Unblock the Notifications











