సుకుమార్, విజయ్ దేవరకొండ మూవీపై అనుమానం.. ఘాటైన కౌంటర్ ఇచ్చారుగా.. ఇదే అసలు నిజం!

టాలీవుడ్ ఇండస్ట్రీలో రానున్న రోజుల్లో నెవర్ బిఫోర్ అనేలా కాంబినేషన్స్ సెట్టయ్యేలా ఉన్నట్లు టాక్ వస్తోంది. ఇప్పటికే ఆడియెన్స్ కిక్కిచ్చే డైరెక్టర్ హీరోల కాంబోలు చాలానే సెట్టయ్యాయి. గతంలో ఎప్పుడు లేని విదంగా హై వోల్టేజ్ కాంబినేషన్స్ సెట్టవుతున్నాయి. అయితే గతంలో ఫిక్స్ అయిన సినిమాలు ఇప్పుడు మళ్ళీ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వస్తోంది. విజయ్ దేవరకొండ సినిమాలపై కూడా గాసిప్స్ ఎక్కువగానే వస్తున్నాయి. ఇక వారితో సినిమాను నిర్మించబోయే ప్రొడక్షన్ ఒక క్లారిటీ ఇచ్చేసింది.

చివరగా ఆ సినిమాలో..

చివరగా ఆ సినిమాలో..

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఎలాంటి సినిమా చేసినా కూడా విభిన్నంగా ఉంటుందని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఎంత మంది ఉన్నా కూడా ఈ యువ హీరోకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ కొంత డిఫరెంట్ గా ఉంటుందనే చెప్పాలి. విజయ్ చివరగా జాతిరత్నాలు సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించిన విషయం తెలిసిందే.

రిజల్ట్ తో సంబంధం లేకుండా..

రిజల్ట్ తో సంబంధం లేకుండా..

కథల ఎంపిక విషయాల్లో విజయ్ ఎంత వినూత్నంగా ఆలోచిస్తాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా వెండితెరపై కొత్త తరహాలో కనిపించాలని ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక విజయ్ చివరగా చేసిన డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాకు బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో క్లిక్కవ్వలేదు. కానీ అందులో విజయ్ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి.

పవర్ఫుల్ గా రెడీ అవుతున్నాడు

పవర్ఫుల్ గా రెడీ అవుతున్నాడు

ఇక ఫెయిల్యూర్స్ ఈ హీరోకు కొత్తేమి కాదు. సక్సెస్ ట్రాక్ లోకి రావడానికి ప్రస్తుతం లైగర్ సినిమాతో పవర్ఫుల్ గా రెడీ అవుతున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైగర్ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోంది. ఆ సినిమాలో విజయ్ ఫిట్నెస్ లో భారీ మార్పులు చేశాడు కూడా.

Recommended Video

Prabhudeva Biography.. ఇన్స్పిరేషన్ మెగాస్టార్ !
సుకుమార్ ప్రాజెక్ట్ ఆగిపోలేదు

సుకుమార్ ప్రాజెక్ట్ ఆగిపోలేదు

ఇక లైగర్ అనంతరం సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్లు టాక్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఆ సినిమా ఆగిపోయినట్లు టాక్ వచ్చింది. సుకుమార్ మధ్యలో రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నట్లు కథనాలు వెలువడ్డాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదని వారితో సినిమాని నిర్మించబోయే ఫాల్కన్ క్రియేషన్స్ సంస్థ అధికారికంగా వివరణ ఇచ్చింది. ఈ క్లారిటీతో పుష్ప అనంతరమే సుకుమార్, విజయ్ కాంబో ఒకటి కానున్నట్లు అభిమానులకు ఒక క్లారిటీ వచ్చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X