Don't Miss!
- Sports
IND vs NZ: వారెవ్వా సుందర్.. వాటే రిటర్న్ క్యాచ్.. నోరెళ్లబెట్టిన కివీస్ బ్యాటర్! వీడియో
- Lifestyle
మీ పార్ట్నర్తో బంధంలోని స్పార్క్ని మేల్కొలపండి, ఇలా బెడ్రూములో హీట్ పెంచండి
- News
girl: కాలేజ్ అమ్మాయి మీద జరదా బీడా ఉమ్మేశాడు. అమ్మాయి ముఖం మీద కత్తితో ?
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- Technology
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- Finance
Accenture: ఐటీ సంస్థలు మారాలంటున్న యాక్సెంచర్ ప్రతినిధి.. బంగారు భవిష్యత్తు కోసమే..
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
విజయ్ దేవరకొండ, అనన్యపాండే రొమాంటిక్‌గా.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్
లాక్‌డౌన్ తర్వా త లైగర్ టీమ్ షూటింగులో బిజీగా మారిపోయింది. ముంబైలో పూరీ జగన్నాథ్, ఛార్మీతోపాటు విజయ్ దేవరకొండ, రమ్యకృష్ణ షూటింగులో పాల్గొంటున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూట్ వివరాలను ఎప్పటికప్పుడు నిర్మాత ఛార్మి తన సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు. లైగర్ సినిమా షూటింగ్ వివరాల్లోకి వెళితే..

విజయ్ దేవరకొండ బాలీవుడ్ ఎంట్రీ
డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాల తర్వాత విజయ్ దేవరకొండ బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమయ్యారు. అనన్య పాండేతో కలిసి హిందీ, తెలుగులో రూపొందుతున్న లైగర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో రోనిత్ రాయ్, ఆలీ, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను నటిస్తున్నారు.

ప్యాకప్ అంటూ లైగర్ టీమ్ అల్లరి
లైగర్ షూటింగును శరవేగంగా పూర్తి చేసుకొనే పనిలో ఉన్నారు. ఇటీవల షూటింగును పూర్తి చేసుకొని అలసిపోయిన విజయ్ దేవరకొండ, చార్మి, రమ్యకృష్ణ, పూరీ తదితరులు ప్యాకప్ అంటూ గట్టిగా అరుస్తూ అల్లరి చేసిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది.

విజయ్ దేవరకొండతో అనన్య ఫోటోలు
ఆ తర్వాత విజయ్ దేవరకొండ, అనన్య పాండే సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. లైగర్ చిత్రం షూటింగు గుర్తు తెలియని ప్రదేశంలో జరుగుతండగా వారిద్దరూ కలిసిన ఫోటోలు ట్రెండింగ్ మారాయి. తాజా ఫోటోలో విజయ్, అనన్య ట్రెండీగా కనిపించారు.

అనన్య పాండే కౌగిలింతతో
విజయ్ దేవరకొండను అనన్య పాండే కౌగిలించుకొంటుండగా మీడియా ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాలో బంధించారు. ఆ తర్వాత మీడియాకు ఫోజులిస్తూ వారిద్దరూ కనిపించారు. దీంతో లైగర్ షూటింగ్ ఉల్లాసంగా.. ఉత్సాహంగా జరుగుతున్నదనే విషయం స్పష్టమైంది.