బాంబే బ్యూటీకి విజయ్ దేవరకొండ ఫిదా.. అద్భుతం అంటూ ప్రశంసల వర్షం
టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న సూపర్ పవర్ స్టార్ విజయ్ దేవరకొండ తన సహ నటి అనన్య పాండేపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో అనన్యతో కలిసి విజయ్ దేవరకొండ ఫైటర్ అనే చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా విజయ్ దేవరకొండ ఓ ఇంటర్వ్యూలో అనన్య పాండే ఫెర్ఫార్మెన్స్‌పై పొగడ్తల వర్షం కురిపించారు.
నటనలోనే కాదు.. వ్యక్తిగా మంచి హృదయం ఉన్న యాక్టర్. తెలుగు చిత్ర పరిశ్రమలోకి రావడం చాలా హ్యాపీగా ఉంది. ఫైటర్ సినిమాలో అద్భుతంగా నటించింది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 50శాతం పూర్తి అయ్యిది. సగభాగంలోనే అనన్య నటన చాలా బాగుంది. దక్షిణాదిలో అనన్య స్టార్ హీరోయిన్ కావడం గ్యారంటీ అని విజయ్ దేవరకొండ అన్నారు.

ఇక ఫైటర్ చిత్రంలోని పాత్ర నా నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది. ఆ పాత్రతో తానే కాదు ప్రతీ యువతి కనెక్ట్ అవుతుంది. తెలుగు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ప్రతీ రోజు ఎంతో కొంత తెలుగు పదాలు నేర్చుకొంటున్నాను. భవిష్యత్‌లో నేను నటించే అన్ని భాషలకు సంబంధించిన సినిమాలకు నేను డబ్బింగ్ చెప్పుకోవాలని అనుకొంటున్నాను అని అనన్య పాండే తెలిపారు.


Click it and Unblock the Notifications











