వైరల్ వీడియో: కాలు జారిన విజయ్ దేవరకొండ.. ఎంత పని చేశావంటూ ఆ హీరోయిన్‌పై సెటైర్లు.!

By Manoj

విజయ్ దేవరకొండ.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఒక సంచలనం. సాదాసీదాగా కెరీర్‌ను ఆరంభించిన ఈ యంగ్‌స్టర్.. 'అర్జున్ రెడ్డి' అనే ఒకే ఒక్క సినిమాతో భారీ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు. దాని తర్వాత కూడా పలు విజయాలను అందుకుని స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమా కోసం కొద్ది రోజులుగా ముంబైలో ఉంటోన్న విజయ్.. తరచూ ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా అక్కడి వీధుల్లో నడుస్తూ కాలు జారాడు. దీంతో ఓ హీరోయిన్‌పై సెటైర్ల వర్షం కురుస్తోంది. ఆ వివరాలేంటో చూద్దాం.!

విజయ్ పరిస్థితి అప్పుడలా.. ఇప్పుడిలా

విజయ్ పరిస్థితి అప్పుడలా.. ఇప్పుడిలా

కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న పాత్రలు చేసిన విజయ్ దేవరకొండ.. ‘పెళ్లి చూపులు' అనే సినిమాతో హీరోగా మారాడు. ఆ తర్వాత ‘అర్జున్ రెడ్డి', ‘గీత గోవిందం', ‘ట్యాక్సీవాలా' వంటి సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, ఈ మధ్య అతడి పరిస్థితి దారుణంగా మారింది. విజయ్ నటించిన ‘నోటా', ‘డియర్ కామ్రేడ్', ‘వరల్డ్ ఫేమస్ లవర్' పరాజయం పాలయ్యాయి.

క్రేజీగా సెట్ అయింది.. బిజీగా సాగుతోంది

క్రేజీగా సెట్ అయింది.. బిజీగా సాగుతోంది

ప్రస్తుతం విజయ్ దేవరకొండ.. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో సినిమా చేస్తున్నాడు. పూరీ సొంత బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాకు ఛార్మీ సహా నిర్మాత. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఇందులో హీరోయిన్‌గా చేస్తోంది. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంతో సాగే ఈ సినిమాకు ‘లైగర్' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ముంబైలో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

ఆయన ఎంట్రీతో మొత్తం మారిపోయింది

ఆయన ఎంట్రీతో మొత్తం మారిపోయింది

విజయ్ - పూరీ జగన్నాథ్ కాంబినేషన్ అంటే ఎంత హైప్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ అంచనాలకు తగ్గట్లే ఈ మూవీని తెలుగులో తెరకెక్కించాలని భావించారు. అయితే, ఈ స్క్రిప్టు గురించి తెలిసిన తర్వాత బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్.. దీనికి నిర్మాణ భాగస్వామి అయ్యారు. దీంతో సినిమా పాన్ ఇండియా లెవెల్‌కు చేరుకుంది. ఫలితంగా పలు భాషల్లో రూపొందుతోంది.

అర్ధరాత్రి హీరోయిన్‌తో చక్కర్లు కొట్టాడు

అర్ధరాత్రి హీరోయిన్‌తో చక్కర్లు కొట్టాడు

ఈ సినిమా హిందీలో కూడా రూపొందుతోన్న విషయం తెలిసిందే. అందుకే ఈ సినిమా షూటింగ్ ముంబై పరిసర ప్రాంతాల్లోనే సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల విజయ్ దేవరకొండ, హీరోయిన్ అనన్య పాండేతో రొమాంటిక్ చేజింగ్ సీన్స్ చిత్రీకరించాడు పూరీ. అందులో హీరోయిన్‌ను బైక్ ట్యాంక్‌పై కూర్చోబెట్టుకుని రొమాన్స్ పండించాడు హీరో విజయ్ దేవరకొండ.

నాటీ హగ్.. దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్

ఇక, నాలుగు రోజుల క్రితం విజయ్ దేవరకొండ.. అనన్య పాండేతో చేసిన ఓ పని దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. సినిమా షూటింగ్ కోసం బోట్ ఎక్కిన ఈ ఇద్దరూ.. హగ్ చేసుకున్న తీరే ఇందుకు కారణం. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పాటు విజయ్‌ను నాటీ గాయ్ అని అందరూ పిలిచేలా చేసింది.

Recommended Video

Hilarious Meme On Vijay Devarakonda Ananya Panday Viral Pic | Filmibeat Telugu
కాలు జారిన విజయ్.. ఆమెపై సెటైర్లు

కాలు జారిన విజయ్.. ఆమెపై సెటైర్లు

తాజాగా విజయ్ దేవరకొండ ముంబై వీధుల్లో కాలి నడకన తిరుగుతూ కనిపించాడు. ఆ సమయంలో అతడు కాలి జారి కింద పడబోయాడు. దీంతో పక్కనే ఉన్న వాళ్లు అతడిని పట్టుకోవడంతో ప్రమాదం జరగలేదు. ఈ వీడియో బయటకు వచ్చిన వెంటనే.. నెటిజన్లు ‘నువ్వు పక్కనుంటే ఏమీ కాకపోయేది కదా ఎంత పని చేశావ్' అంటూ అనన్య పాండేను ఉద్దేశించి సెటైర్లు వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X