»   » పీక్ స్టేజ్‌లో పవన్ కళ్యాణ్ క్రేజ్... వెడ్డింగ్ కార్డుపై కూడా!

పీక్ స్టేజ్‌లో పవన్ కళ్యాణ్ క్రేజ్... వెడ్డింగ్ కార్డుపై కూడా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... టాలీవుడ్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సినీ స్టార్. సాధారణంగా అంద‌రి హీరోల‌కు ఫ్యాన్స్ ఉంటారు కానీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి మాత్రం ఫాన్స్ కాదు భ‌క్తులుంటారు అని అంటుంటారు. ఇప్పుడు ఆ మాట‌కు అర్థాన్ని చూపిస్తున్నారు ఆయ‌న ఫ్యాన్స్.

సాధారణంగా వెడ్డింగ్ కార్డులపై ఏ దేవుడి బొమ్మో వేసుకుంటారు. కానీ ఆయన అభిమానులు మాత్రం ఏఖంగా పవన్ కళ్యాణ్ ఫోటో వేసుకుంటున్నారు. తాజాగా అలాంటి వెడ్డింగ్ కార్డు ఒకటి ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. సదరు ఫ్యాన్..కాదు కాదు భక్తుడు ఏపీ రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన వ్యక్తిగా ఈ వెడ్డింగ్ కార్డు చూస్తే స్పష్టమవుతోంది.

Wedding card printed with Pawan Kalyan pic

జోడీ సూపర్బ్: కాబోయే భర్తతో చిరు కుమార్తె శ్రీజ (ఫోటోలు)
ఈ వివాహానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మరియు మా శ్రేయోభిలాషులు తప్పక విచ్చేసి మమ్ములను ఆశీర్వదించ ప్రార్థన అని ఉండటం గమనార్హం. వెడ్డింగ్ కార్డుపై పవన్ కళ్యాణ్ ఫోటోతో పాటు జనసేన పార్టీ లోగో కూడా వేసారు. ఇపుడు ఈ వెడ్డింగ్ కార్డు అంశం సర్వత్రా చర్చనీయాంశం అయింది.

పవన్ కళ్యాణ్ నిర్మాత డిమాండ్ చాలా ఓవర్‌!

పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆయన ‘సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రం షూటింగులో బిజీగా ఉన్నారు. సర్దార్ గబ్బర్ సింగ్ టాకీ పార్టు చివరి దశకు చేరుకోవడంతో....ప్రస్తుతం పాటల చిత్రీకరణ మొదలు పెట్టారు. కొన్ని పాటలు ఇక్కడే చిత్రీకరించనున్నారు. రెండు పాటలు మాత్రం యూరఫ్ లో ప్లాన్ చేస్తున్నారు. మార్చి చివరి వారంలో యూరఫ్ లో సాంగ్ చిత్రీకరణ జరుగబోతోంది. యూరఫ్ షెడ్యూలే సినిమాకు సంబంధించిన చివరి షెడ్యూల్ కాబోతోంది. ఈ లోగా బ్యాలెన్స్ సాంగ్స్, మరికొన్ని మిగిలిపోయిన సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.

‘సర్దార్ గబ్బర్ సింగ్' ఆడియో ఫంక్షన్ ఫంక్షన్ అమరావతిలో జరిపేందుకు ప్లాన్ చేస్తున్నాట్లు సమాచారం. అమరావతి పరిసర ప్రాంతాల్లో భారీ వేడుకకు తగిన ప్రాంతం కోసం అన్వేషణ సాగిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అన్నీ అనుకూలిస్తే మార్చ్ 12న పెద్ద ఎత్తున ఆడియో వేడుక నిర్వహిస్తారని టాక్.

English summary
Pawan Kalyan pic sin Wedding card. A wedding card printed with Pawan Kalyan and Jana Sena Party logo inviting the Fans and well wishers to attend wedding ceremony.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu