»   » జోడీ సూపర్బ్: కాబోయే భర్తతో చిరు కుమార్తె శ్రీజ (ఫోటోలు)

జోడీ సూపర్బ్: కాబోయే భర్తతో చిరు కుమార్తె శ్రీజ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గత చేదు జ్ఞాపకాల నుండి బయట పడి రెండో వివాహానికి సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ మెగా ఫ్యామిలీలో శ్రీజ పెళ్లికి సంబంధించిన హడావుడి మొదలైంది. పెళ్లి డేట్ ఫిక్సయినట్లు వార్తలు వినిపిస్తునప్నాయి. మార్చి 28న వివాహం జరుగబోతున్నట్లు సమాచారం. ఈ పెళ్లిని పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమంగా నిర్వహిస్తున్నారు. పెళ్లికి సంబంధించిన ఏ విషయం కూడా అఫీషియల్ గా బయటకు చెప్పడం లేదు మెగా ఫ్యామిలీ.

అయితే శ్రీజ పెళ్లికి సంబంధించి విషయాలు ఎప్పటికప్పుడు బయటకు లీకవుతూనే ఉన్నాయి. తాజాగా శ్రీజ తనకు కాబోయే భర్త కళ్యాణ్ తో దిగిన ఫోటో ఒకటి బయటకు వచ్చింది. కళ్యాణ్ చిత్తూరు జిల్లాకు చెందిన వ్యాపారవేత్త కిషన్ కుమారుడు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే....శ్రీజ, కళ్యాణ్ క్లాస్‌మేట్స్ కూడా. తన గురించి అన్ని తెలిసిన కళ్యాణ్‌ను పెళ్లాడేందుకు శ్రీజ సముఖంగా ఉండటంతో ఇరు కుటుంబాల వారు పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇన్నాళ్లు తన కూతురు భవిష్యత్తుపై చిరంజీవి కాస్త బెంగగా ఉండే వారు. ఇపుడు ఆమె రెండో పెళ్లి ద్వారా కొత్త జీవితం ప్రారంభిస్తుండటంపై ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీగా ఉన్నారని అంటున్నారు. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు శర వేగంగా సాగుతున్నాయి.

శ్రీజ ప్రేమ పెళ్లి వ్యవహరం గురించి అందరికీ తెలిసిందే. శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి, పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్న శ్రీజ....కొంత కాలం అతనితో కాపురం చేసి ఓ బిడ్డకు తల్లయింది. ఆ తర్వాత శిరీష్ భరద్వాజ్ అసలు రూపం తెలుసుకుని అతనికి దూరమైంది. శ్రీజ మొదటి పెళ్లి వ్యవహారం మెగా ఫ్యామిలీకి ఓ పీడకలలా ముగిసిందని చెప్పొచ్చు.

శ్రీజకు కాబోయే భర్త కళ్యాణ్ గురించి మరిన్ని వివరాలు స్లైడ్ షోలో...

కళ్యాణ్-శ్రీజ

కళ్యాణ్-శ్రీజ

శ్రీజ పెళ్లాడబోయే కళ్యాణ్ ఇతడే. ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇద్దరి జోడీ సూపర్బ్ గా ఉందంటున్నారు మెగా ఫ్యాన్స్. దుబాయ్ లో బిట్స్ పిలానీ చేసాడు. స్కూల్ డేస్ నుండి ఇద్దరూ ఫ్రెండ్స్.

మార్చిలో వివాహం..

మార్చిలో వివాహం..

మార్చిలో శ్రీజ వివాహం జరుగబోతోంది. ఈ నేపథ్యంలో శ్రీజ కజిన్ వరుణ్ తేజ్ మిస్ యూ అంటూ ఈ ఫోటో పోస్టు చేసారు.

వివాహం

వివాహం

చిరంజీవి అండ్ ఫ్యామిలీ ఈ పెళ్లి వేడుకను ప్రైవేట్ ఫంక్షన్ గా నిర్వహిస్తున్నారు. అందుకే ఏ విషయాన్ని మీడియాతో పంచుకోవడం లేదు.

అంతా హ్యాపీ..

అంతా హ్యాపీ..

శ్రీజ మళ్లీ కొత్త జీవితం ప్రారంభించబోతుండటంపై అంతా హ్యాపీగా ఉన్నారు.

English summary
Megastar Chiranjeevi's youngest daughter Srija and her husband-to-be Kanuganti Kalyan, posing cheerfully to the shutterbugs.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu