అజ్ఞాతంలోకి విజయ్ దేవరకొండ.. అందుకే కనిపించడం లేదా?

By Manoj Kumar P

విజయ్ దేవరకొండ.. తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాక.. ఇరు రాష్ట్రాల్లో ఈ పేరు ఒక సంచలనం. అంతలా ప్రభావం చూపిస్తున్నాడీ క్రేజీ హీరో. చిన్న చిన్న పాత్రలతో సినీ కెరీర్‌ను ఆరంభించిన విజయ్.. హీరోగా తొలి సినిమా (పెళ్లిచూపులు)తోనే హిట్ కొట్టాడు. ఇక, ఆ తర్వాత వచ్చిన 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' వంటి సినిమాలతో స్టార్ హీరో అయిపోయాడు. ఈ క్రమంలోనే వరుసగా సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. అయితే, కొద్ది రోజులుగా విజయ్ దేవరకొండ అజ్ఞాతంలోకి వెళ్లి పోయాడు. ఈ నేపథ్యంలో అతడి గురించి ఓ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. ఆ వివరాలు మీకోసం.!

వరుస షాక్‌లతో విజయ్ ఉక్కిరిబిక్కిరి

వరుస షాక్‌లతో విజయ్ ఉక్కిరిబిక్కిరి

క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ కెరీర్ ఆరంభంలో కొన్ని సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్న ఈ యంగ్ హీరో.. ఈ మధ్య వరుస ఫ్లాప్‌లతో మూటగట్టుకొన్నాడు. అతడు నటించిన ద్విభాషా చిత్రం ‘నోటా'తో పాటు ‘డియర్ కామ్రేడ్', ‘వరల్డ్ ఫేమస్ లవర్' అంతగా ఆకట్టుకోలేకపోయాయి.

డైనమిక్ డైరెక్టర్‌తో విజయ్ దేవరకొండ

డైనమిక్ డైరెక్టర్‌తో విజయ్ దేవరకొండ

సరైన హిట్ లేక కష్టాలను ఎదుర్కొంటున్నాడు విజయ్. ఈ నేపథ్యంలోనే అతడు.. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో సినిమా చేస్తున్నాడు. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాను పూరీ స్వయంగా నిర్మిస్తున్నాడు. సీనియర్ హీరోయిన్ చార్మీ సహా నిర్మాతగా వ్యవహరిస్తోంది. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఇందులో హీరోయిన్‌గా చేస్తోంది.

ఆయన ఎంట్రీ... మారిపోయిన రేంజ్

ఆయన ఎంట్రీ... మారిపోయిన రేంజ్

ఈ సినిమాను మొదట తెలుగులో మాత్రమే తెరకెక్కించాలని చిత్ర యూనిట్ భావించింది. అయితే, ఈ స్క్రిప్ట్ గురించి తెలుసుకున్న బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్.. దీన్ని పాన్ ఇండియా మూవీగా రూపొందించాలని పూరీ జగన్నాథ్‌తో చెప్పాడు. అంతేకాదు, దీనికి నిర్మాణ భాగస్వామిగా కూడా ఉంటానని వెల్లడించారు. దీంతో ఈ మూవీ రేంజ్ మారిపోయింది.

అక్కడ విజయ్ హల్‌చల్.. హాట్ టాపిక్

అక్కడ విజయ్ హల్‌చల్.. హాట్ టాపిక్

విజయ్ దేవరకొండ ఈ సినిమా మొదలు కాకముందే ముంబైలో హల్‌చల్ చేశాడు. ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయినప్పటి నుంచి అక్కడే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లోని హీరోలు, హీరోయిన్లను కలుస్తున్నాడు. అంతేకాదు, అక్కడ జరిగే నైట్ పార్టీలకు సైతం హాజరవుతున్నాడు. దీంతో విజయ్ దేవరకొండ బీటౌన్‌లో హాట్ టాపిక్ అయిపోయాడు.

క్లిష్ట సమయంలో అజ్ఞాతంలోకి విజయ్

క్లిష్ట సమయంలో అజ్ఞాతంలోకి విజయ్

కరోనా వైరస్ ప్రభావంతో సినిమా షూటింగులకు బ్రేక్ పడిపోయింది. దీంతో చిత్ర పరిశ్రమతో అనుబంధం ఉన్న కార్మికులను ఆదుకునేందుకు తెలుగు నటులంతా కలిసి ‘కరోనా క్రైసెస్ చారిటీ'ని స్థాపించారు. దీనికి చాలా మంది హీరోలు, హీరోయిన్లు, టెక్నీషియన్లు విరాళాలు ఇస్తున్నారు. అయినప్పటికీ విజయ్ మాత్రం ఇప్పటి వరకు స్పందించకపోవడం చర్చనీయాంశం అవుతోంది.

క్రేజీ హీరో అందుకే కనిపించడం లేదా.?

క్రేజీ హీరో అందుకే కనిపించడం లేదా.?

వాస్తవానికి విజయ్ కొద్ది రోజుల క్రితం కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఓ వీడియోను విడుదల చేశాడు. కానీ, ఇప్పటి వరకు విరాళం ప్రకటించకపోవడంతో అందరూ దీని గురించే చర్చించుకుంటున్నారు. తాజా సమాచారం ప్రకారం.. కరోనా బాధితులను ఆదుకునేందుకు అతడు భారీ ప్లాన్ రెడీ చేశాడని, ఆ వివరాలు ఈ రెండు రోజుల్లోనే వెల్లడించబోతున్నాడని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X