OTTలోకి మోస్ట్ డేంజరస్ హౌస్ వైఫ్ వచ్చేస్తుంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

సీనియర్ నటి ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన డార్క్‌ క్రైమ్‌ కామెడీ థ్రిల్లర్‌ 'భామాకలాపం'. అభిమన్యు డైరెక్ట్ చేసిన ఈ చిత్రం గతేడాది 'ఆహా' వేదికగా రిలీజై మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడిదే చిత్రానికి సీక్వెల్‌గా 'భామాకలాపం 2' రాబోతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్​ ఈ చిత్ర టీజర్​ను రిలీజ్​ చేశారు. అలాగే ప్రీమియర్స్​ స్ట్రీమింగ్ డేట్​ను కూడా అనౌన్స్​ చేశారు. వివరాల్లోకి వెళితే..

నూరుశాతం తెలుగు ఓటీటీ ప్లాట్​ఫామ్​గా పేరొందిన ఆహా గురించి ప్రత్యేక చెప్పనక్కర్లేదు. తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు సరికొత్త ఎంటర్​టైన్​మెంట్ ఫన్​ను అందిస్తూనే ఉంటుంది. సినిమా, సిరీస్​లను విడుదల చేస్తూ ఆడియెన్స్​ను ఎంటర్​టైన్​ చేస్తుంది. అందులో భాగంగానే విలక్షణ నటి ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన 'భామా కలాపం ' చిత్రాన్ని అందించింది. 2022లో విడుదలైన ఈ చిత్రం సూపర్ సక్సెస్ అవ్వడంతో పాటు ప్రియామణికి నటనా పరంగా మంచి క్రేజ్ దక్కింది. నాలుగు మిలియన్స్‌కు పైగా వ్యూస్​ను సాధించి రికార్డ్ కూడా క్రియేట్ చేసింది.

Actress Priyamani Bhama Kalapam 2 Streaming on AHA OTT From Feb 16th Full Details Here

దీంతో ఆహా ఇప్పుడు రెండో భాగాన్ని కూడా అందించేందుకు రెడీ అయింది. ఈ చిత్రాన్ని బాపినీడు, సుధీర్‌ ఈదర సంయుక్తంగా నిర్మించారు. సీరత్‌ కపూర్‌, రఘు ముఖర్జీ, బ్రహ్మాజీ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్​ను కూడా బాగా ఆకట్టుకుంది. ప్రియమణి, శరణ్య సస్పెన్స్ డైలాగ్స్‌తో ప్రేక్షకుల్లో భామాకలాపం 2పై మరింత ఆసక్తిని పెంచారు మేకర్స్.

Actress Priyamani Bhama Kalapam 2 Streaming on AHA OTT From Feb 16th Full Details Here
Chiranjeevi: ప్రభాస్ దర్శకుడితో చిరంజీవి నెక్ట్స్ సినిమా... టెన్షన్ పడుతున్న ఫ్యాన్స్!

అయితే ఇప్పుడు మేకర్స్​.. ప్రీమియర్స్​ స్ట్రీమింగ్ డేట్​ను అనౌన్స్​ చేశారు. ఫిబ్రవరి 16 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపారు. అలాగే టీజర్​ను కూడా విడుదల చేశారు. 'అను మనం వదిలి వెళ్తుంది మన పాత ఇంటినే కాదు నీ తప్పుల్ని కూడా' అనే చెప్పే డైలాగ్​తో ఈ టీజర్ ప్రారంభమైంది. ఆ తర్వాత 'అనుపమ అనే నేను పక్కన వాళ్ల విషయంలో తలదూర్చనని, నా పని నేను చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటానని మాట ఇస్తున్నాను' అంటూ ప్రియమణి చెప్పడం కానీ ఆ తర్వాత ఏదో మర్డర్​ మిస్టరీలోకి ఇరుక్కోవడం వంటి చూపించారు.

Actress Priyamani Bhama Kalapam 2 Streaming on AHA OTT From Feb 16th Full Details Here
కాసేపు టీజర్​ను కామెడీతో పాటు ఇంటెన్స్​ మోడ్​లో తీసుకెళ్లారు. చివరికి శర్యణ్య - ప్రియమణి ఏదో శవాన్ని పూడ్చిపెట్టడంతో ముగించారు. ఆ సమయంలో శరణ్య.. 'అక్క నీకు శవాలకు మధ్య బాగా డీప్​ కనెక్షన్​ ఉందనుకుంటా' అంటూ చెప్పడం ఆసక్తికరంగా ఉంది. మొత్తంగా ఈ సినిమా కూడా ఓ మర్డర్​ మిస్టరీ థ్రిల్లర్​గా రూపొందిందని అర్థమైంది. బ్యాక్​ గ్రౌండ్​ మ్యూజిక్​ కూడా బాగుంది.

ఇకపోతే ఈ మధ్య కాలంలో ప్రియమణి ఎక్కువగా ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీసుల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ది ఫ్యామిలీ మ్యాన్ ఫ్రాంచైజీ, సర్వం శక్తిమయం వంటి సిరీసులు చేసి బాగా గుర్తింపు తెచ్చుకుంది. అలాగే రీసెంట్​గా జవాన్‌లోనూ కీలక పాత్ర పోషించి ఆకట్టుకుంది. ఇక దేవర చిత్రంలోనూ జాన్వీకపూర్​కు అమ్మగా కనిపించనుందని టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X