OTT: డైరెక్టుగా తెలుగు ఓటీటీలోకి బోల్డ్ కంటెంట్ మూవీ... ఎప్పుడు స్ట్రీమింగ్ కానుందంటే?
ఇప్పుడు ప్రేక్షుకల టేస్టుకు అనుగుణంగా ఎన్నో ఓటీటీలు పుట్టుకువస్తున్నాయి. తెలుగులో ఈ మధ్య కాలంలో వచ్చిన ఓటీటీ సంస్థ ఆహా. ఇక అల్లు అరవింద్ స్థాపించిన ఈ ఓటీటీ.. తెలుగు సినిమాలతో పాటు.. పలు డబ్బింగ్ చిత్రాలు, ఒరిజినల్ కంటెంట్ ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. తొలిసారిగా ఈ ఓటీటీలోకి ఓ బోల్డ్ కంటెంట్ చిత్రాన్ని డైరెక్టుగా రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. ఆ చిత్రం ఏంటి... ఎప్పుడు స్ట్రీమింగ్ కానుందనే వివరాలు చూద్దాం.
Salaar: ప్రభాస్ సలార్ చిత్రంలో మీనాక్షి చౌదరి... మీరేమైనా గుర్తు పట్టారా?
ఓటీటీలోకి ప్రతివారం కొత్త సినిమాలు, కొత్త సిరీసులు రిలీజ్ అవుతుంటాయి. ఇక అందులో ఆకట్టుకునేవి మాత్రం కొన్ని మాత్రమే. ప్రతి వారం ఓటీటీ వేదికగా ఎన్నో సినిమాలు సిరీసులు ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాయి. కొన్ని థియేటర్లలో రిలీజ్ అయి.. ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రాలు కాగా.. మరికొన్ని డైరెక్టుగా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమా కూడా డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలకు సిద్ధంగా ఉంది.

ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో ఓ ఇంట్రస్టింగ్ సినిమాను స్ట్రీమింగ్ కానుంది. ఓ బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన సినిమాను ఆహాలో స్ట్రీమింగ్ చేసేందుకు రెడీ అయిపోయింది. అసలు విషయం ఏంటంటే... కన్నడ హీరోయిన్ అక్షర గౌడ హీరోయిన్ గా నటిస్తున్న బోల్డ్ చిత్రం మిక్సప్. ఈ సినిమాను ఆహా ఓటీటీలో డైరెక్ట్ గా రిలీజ్ చేయనున్నారు మేకర్స్. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్ర బృందం.
ఓ అమ్మాయి పెదవులను చూపిస్తూ.. హాట్ హాట్ పోస్టర్ ను విడుదల చేయగా.... ఇక ఆ పోస్టర్ ను ఆహా తన సోషల్ మీడియా అకౌంట్ లో పంచుతకుంది. షేర్ చేశారు. దానికి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అక్షర గౌడ్ తెలుగులో కింగ్ నాగార్జున నటించిన మన్మధుడు 2 సినిమాలో నటించింది. ఆ సినిమాతోనే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్బింది.
తమిళంలో అక్షర చిన్నది దళపతి విజయ్ తుపాకీ సినిమాలో కూడా నటించి మెప్పిచింది. అలాగే అజిత్ హీరోగా నటించిన ఆరంభం సినిమాలో కూడా ృ నటించింది. ఈ రెండు సినిమాలో అక్షరకు మంచి పాపులారిటినీ తీసుకువచ్చాయి. రామ్ పోతినేని ది వారియర్ మూవీలో నటించింది కానీ.. అంతంగా గుర్తింపు రాలేదు. ఇక ప్రస్తుతం తెలుగులో సుధీర్‌బాబు హీరోగా నటిస్తోన్న హరోంహరలో అక్షర గౌడ పోలీస్ పాత్రలోకనిపించనుందని సమాచారం. ఇక ఇప్పుడు ఇలా బోల్డ్ కంటెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా త్వరలోనే ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.


Click it and Unblock the Notifications











