OTTలోకి కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ... స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ అంటే?
ఓటీటీలో ప్రతివారం కొత్త కంటెంట్ వస్తునే ఉంటుంది. అయితే ఓటీటీ సంస్థలు రొటిన్ మూవీల కంటే.. డిఫరెంటు కంటెంట్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో ఆసక్తి చూపిస్తున్నాయి. అలా ఇప్పుడో ఆహా ఓటీటీలోకి మరో కొత్త మూవీ రాబోతుంది. కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా దోచేవారెవరురా తెరకెక్కింది. ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ కానుంది. అసలు ఈ సినిమా కథేంటి.. ఎప్పుడు స్ట్రీమింగ్ కు రానుంది అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
వినోదాత్మక చిత్రాల దర్శకుడిగా శివ నాగేశ్వరరావుకు ప్రత్యేకపైన గుర్తింపు ఉంది. ఆయన తెరకెక్కించిన మనీ, సిసింద్రి వంటి పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయి. అయితే తాజాగా శివ నాగేశ్వరరావు 'దోచేవారెవరురా' పేరుతో ఓ మూవీ తెరకెక్కించారు. ఇటీవల థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేక పోయింది.

ఇక దోచేవారెవరురా సినిమాకు డైరెక్షన్ తో పాటు కథన, స్క్రీన్ ప్లై శివ నాగేశ్వరరావు అందించారు. ఐక్యూ క్రియేషన్స్ బ్యానర్ పై బొడ్డు కోటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో అజయ్ ఘోష్, చక్రి (చైల్డ్ ఆర్టిస్ట్), బిత్తిరి సత్తి, ప్రణవ చంద్ర, మాళవిక సతీషన్, బెనర్జీ, తనికెళ్ళ భరణి, కోట శ్రీనివాస రావు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సంగీతం రోహిత్ వర్ధన్, కార్తిక్ అందించారు.
ప్రముఖ గీత రచయిత చైతన్య ప్రసాద్ తనయుడు ప్రణవ చంద్ర ఈ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేసిన వాడు కావడంతో కెమెరా ఫియర్ లేకుండా చక్కగా నటించారని ప్రశంసలు వచ్చాయి. మలయాళీ బొద్దుగుమ్మ మాళవిక సతీశన్ కూడా బాగా నటించింది. 'రంగస్థలం', 'పుష్ప' వంటి చిత్రాలలో తన నట విశ్వరూపం చూపించిన అజయ్ ఘోష్ ఇందులో అన్నదమ్ములుగా ద్విపాత్రాభినయం చేసి మెప్పించారు. బిత్తిరి సత్తి కిరాయి హంతకుడి పాత్ర పోషించాడు.
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే... ప్రతి మనిషి వేరొక మనిషి చేతిలో ఏదో ఒక రకంగా దోపిడీకి గురవుతూనే ఉంటారు. కొందరు డబ్బుల్ని దోచుకుంటే... మరికొందరు మాన ప్రాణాలను దోచుకుంటారు. ఇంకొందరు మనసుల్ని దోచుకుంటారు. రాజకీయ నాయకులైతే సమాజాన్నే దోచుకుంటారు. అయితే... ఇందులో అలా రకరకాలుగా దోచుకునే పాత్రలు మనకి కనిపిస్తాయి. ఓ అనాధ పిల్లాడికి మేలైన వైద్యం చేయించడం కోసం హీరో దొంగగా మారి డబ్బులు దోచుకుంటాడు. ఇలాంటి చిత్ర విచిత్రమైన పాత్రలతో సాగే కథే 'దోచేవారెవరురా'!

ఇక ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయింది. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోని ఈ చిత్రం ఇప్పుడు ఆహా ఓటీటీలో విడుదల కానుంది. సెప్టెంబర్ 29వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కు రానుంది. ఇక మీరు కామెడీ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ ను ఇష్టపడితే ఈ మూవీని ఇంట్లోనే ఎంచాక్క చూసేయండి.


Click it and Unblock the Notifications











