Dhurandhar OTT: ఓటీటీ లో ‘ధురంధర్' సునామీ.. 3 రోజుల్లోనే పుష్ప 2, యానిమల్ రికార్డులకు బ్రేక్!
Dhurandhar OTT: ధురంధర్ ఇదోక సంచలనం.. బాలీవుడ్ బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా. రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో, దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్. ఈ సినిమా థియేటర్లలో సంచలన విజయం సాధించింది. ఎవరూ ఊహించిన విధంగా బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ క్రమంలో రూ.1000 కోట్లు దాటిన తొలి బాలీవుడ్ చిత్రంగా కూడా చరిత్ర సృష్టించింది. ఇక ఇప్పుడు ఓటీటీలోనూ రికార్డుల మోత మోగిస్తోంది. జనవరి 30న నెట్ ఫిక్స్ లోడిజిటల్ ప్రీమియర్ అయిన ఈ సినిమా, విడుదలైన తొలి వీకెండ్‌లోనే ఇండియన్ ఓటీటీ హిస్టరీలో కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది.
తాజా అధికారిక గణాంకాల ప్రకారం ధురంధర్ కేవలం మూడు రోజుల్లోనే 7.6 మిలియన్ వ్యూస్ నమోదు చేసింది. పోస్ట్-థియేట్రికల్ డిజిటల్ రిలీజ్‌లలో తొలిసారి 7 మిలియన్ మార్క్‌ను దాటిన ఇండియన్ మూవీగా ఇది రికార్డు క్రియేట్ చేసింది. దీంతో ఈ సినిమా యానిమల్ (6.2 మిలియన్), ఫైటర్ (5.9 మిలియన్), అలాగే పుష్ప 2 (Pushpa 2: The Rule) (5.8 మిలియన్)వంటి రికార్డులను బ్రేక్ చేసి, తొలి వీకెండ్ లోనే అత్యధిక వ్యూస్ అందకున్న మూవీగా టాప్‌లో నిలిచింది.

అలాగే.. నెట్‌ఫ్లిక్స్ టుడుమ్ డేటా ప్రకారం ఈ సినిమాఏడు దేశాల్లో నాన్-ఇంగ్లీష్ సినిమాల గ్లోబల్ టాప్-10 జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. థియేటర్ రిలీజ్‌పై నిషేధం ఉన్న పాకిస్థాన్‌లో కూడా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో నంబర్ వన్‌గా ట్రెండ్ కావడం విశేషం. మొత్తంగా 26.1 మిలియన్ వాచ్ అవర్స్ నమోదు కావడంతో ధురంధర్ 'థియేటర్ బ్లాక్‌బస్టర్ నుంచి ఓటీటీ సెన్సేషన్'గా మారిన అరుదైన సినిమాల్లో ఒకటిగా నిలుస్తోంది.
ధురంధర్ కథ పరంగా చూస్తే... ఈ సినిమాలో రణ్ వీర్ సింగ్ భారత గూఢచారిగా నటించాడు. దేశాన్ని టార్గెట్ చేసిన ఉగ్రవాద నెట్‌వర్క్‌ను కూల్చివేయడానికి శత్రు దేశంలోకి చొరబడే ఏజెంట్ పాత్రలో అతని నటనకు విశేష స్పందన లభించింది.ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా, అర్జున్ రామ్, సంజయ్ దత్, ఆర్,మాధవన్ కీలక పాత్రల్లో నటించారు.
బాక్సాఫీస్ వద్ద సునామీని క్రియేట్ చేసిన ఈ మూవీకి సీక్వెల్ గా ధురంధర్ ది రివెంజ్ (Dhurandhar: The Revenge) రాబోతుంది. ఈ సీక్వెల్ మూవీ మార్చి 19 న థియేటర్లలో విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఎవరూ ఊహించిన విధంగా రికార్డు వ్యూస్ ను అందుకుని, యూట్యూబ్ ట్రెండింగ్ గా మారింది.
Varanasi OTT: దిమ్మతిరిగే రేంజ్‌లో 'వారణాసి' మూవీ ఓటీటీ డీల్.. అన్ని వందల కోట్లా?
ఈ టీజర్ లో ముఖ్యంగా రణ్‌వీర్ యాక్షన్ సీన్స్ మాత్రం అదుర్స్.. 'ఇది కొత్త భారతదేశం.. సరిహద్దులను దాటి చొచ్చుకువచ్చి దెబ్బకొట్టి తీరుతుంది'అనే హీరో రివెంజ్ డైలాగ్, బ్యాక్ డ్రాప్ మ్యూజిక్ ఆకట్టుకునేలా ఉంది. ధురందర్ పార్ట్ 1 కేవలం హిందీలో మాత్రమే విడుదలకాగా ఈసారి ఈ సినిమాని హిందీతోపాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే. థియేటర్ సంచలన విజయాన్ని అందుకున్న ధురంధర్ ఓటీటీలోనూ కొనసాగిస్తూ, ఇండియన్ డిజిటల్ స్పేస్‌లో కొత్త రికార్డులతో దూసుకుపోతోంది. రాబోయే రోజుల్లో ఈ వ్యూస్ ఇంకా ఎంత దూరం చేరతాయో చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











