OTTలోకి వచ్చేసిన డిఫరెంట్ కాన్సెప్ట్ థ్రిల్లర్ మూవీ... ఎందులో చూడాలంటే?
ఓటీటీలోకి ప్రతి వారం కొత్త సినిమాలు, సిరీసులు వస్తూ ఉంటాయి. ఇక ఈ వారం కూడా ఓటీటీల్లోకి కొత్త సినిమాలు, సిరీసులు వచ్చి సందడి చేస్తున్నాయి. థియేటర్లలో డబ్బింగ్ చిత్రాల హవా నడుస్తుంది. ఫైటర్, కెప్టెన్ మిల్లర్ వంటి చిత్రాలు ఉండగా.. అందరి దృష్టి ఓటీటీపై ఉంది. ఇక ఓటీటీలోకి ఓ డిఫరెంట్ కాన్సెప్టు చిత్రం వచ్చింది. అది ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది.. కథ ఏంటి.. సినిమా నేపథ్యం ఏంటి అనే వివరాల్లోకి వెళితే....
ఓటీటీలోకి మరో కొత్త చిత్రం వచ్చేసింది. కంటెంట్ బాగుంటే మన ప్రేక్షకులు ఎలాంటి సినిమా అయిన పట్టం కడుతారు. భాషతో సంబంధం లేకుండా హిట్ చేసేస్తారు. అంతేనా హీరో, డైరెక్టర్ ఎవరు అనేది చూడరు. ఆ సినిమాను ఆదరిస్తారు. ఈ మధ్య కాలంలో డిఫరెంట్ కాన్సెప్టుతో వచ్చే సినిమాలన్నీ హిట్ గా నిలుస్తున్నాయి. వాటికి ఓటీటీల్లో మంచి ఆదరణ దక్కుతుంది. ఇప్పుడు అలాంటి చిత్రమే ఓటీటీలోకి వచ్చేసింది.

విధి.. మిస్టరీ థ్రిల్లర్ జోనర్ లో గత ఏడాది థియేటర్ల వద్దకు వచ్చింది. ఇక ఈ సినిమాను ఆడియెన్స్ ఆదరించారు. థియేటర్లో ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే లభించింది. నో ఐడియా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీదుగా రంజిత్. ఎస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీనాథ్ రంగనాథన్ కేవలం ఈ సినిమాకు రచన చేయడం మాత్రమే కాకుండా కెమెరామెన్ బాధ్యతలను చేపట్టాడు. ఇక ఈ సినిమాను శ్రీకాంత్ డెరెక్ట్ చేశాడు.
రోహిత్ నందా, ఆనంది హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసింది. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా కంటెంట్ బాగుంటే.. ఈ ఓటీటీ అన్ని సినిమాలను అందుబాటులోకి తీసుకువస్తుంది. ఆ తరహాలోనే ఈ చిత్రాన్ని ఓటీటీలోకి తీసుకువచ్చింది. ఈ విధి మిస్టరీ థ్రిల్లర్ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.

విధి మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో జనవరి 25 నుంచి స్ట్రీమింగ్ కు వచ్చేసింది. థియేటర్లో థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తెలుగులో అందుబాటులోకి వచ్చిన ఈ చిత్రం.. ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మిస్టరీ థ్రిల్లర్స్ చూసే వారు ఇలాంటి చిత్రాన్ని ఓసారి చూసేయొచ్చు.
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే... విధి చిత్రంలో పెన్ ఓ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది. ఆ పెన్ తో ఎవరు రాసినా కూడా చనిపోతుంటారు అసలు అలా ఎందుకు జరుగుతుంది? పెన్ నేపథ్యం ఏంటి? పెన్ చేతికి వచ్చిన హీరో ఏం చేశాడు? అన్న థ్రిల్లింగ్ పాయింట్తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఎన్నో యూత్ ఫుల్ సినిమాలకు సంగీతం అందించిన శ్రీచరణ్ పాకాల.. విధికి మంచి సంగీతాన్ని అందించారు. ఎంచక్కా ఇంట్లోనే ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











