Netflix: మొన్న చరణ్, నిన్న ఎన్టీఆర్.. నేడు మహేశ్.. నెట్ ఫ్లిక్స్ మావా ఏం ప్లాన్ చేశావ్?
టాలీవుడ్ హీరోలపై ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ కన్నేసింది. మొన్న రామ్ చరణ్, నిన్న ఎన్టీఆర్.. నేడు మహేశ్... ఇలా వరుసగా వారి ఫ్యామిలీస్ తో నెట్ ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరాండొస్ భేటీ అయ్యి మంతనాలు జరుపుతున్నారు. ఇప్పటి వరకు బాలీవుడ్ లోనే ఇలాంటి మంతనాలు సాగించిన నెట్ ఫ్లిక్స్.. సడెన్ గా టాలీవుడ్ పై ఎందుకు కన్నేసింది.. టాలీవుడ్ స్టార్ హీరోలతో ఎందుకు మంతనాలు సాగిస్తుంది.. అసలు ఏం చేయాలనుకుంటుంది.. ఈ విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సినిమా లవర్స్ అందరికీ ఈ యాప్ సుపరిచితమే. ఒకప్పుడు ఇందులో హాలీవుడ్, బాలీవుడ్ మూవీస్, కంటెంట్ మాత్రమే ఉంటుందని అనుకునేవారు. ఇక ఈ మధ్యకాలంలో రీజినల్ లాంగ్వేజస్ పై దృష్టి సారించి.. వరుసగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల కంటెంట్ కొనుగోలు చేసి.. స్ట్రీమింగ్ చేస్తుంది. ఇక ఏదైనా సిరీస్ రిలీజ్ చేసినా.. అన్ని లాంగ్వేజస్ లో స్ట్రీమింగ్ చేస్తుంది.

ఇదిలా ఉంటే.. నెట్ ఫ్లిక్స్ మన టాలీవుడ్ పై కన్నేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు బాలీవుడ్ లో మంతనాలు జరిపే నెట్ ఫ్లిక్స్ ... ఇప్పుడు సడెన్ గా టాలీవుడ్ కు షిఫ్ట్ అయింది. మొన్న రామ్ చరణ్ ఫ్యామిలీతో ముచ్చట్లు జరిపిన నెట్ ఫ్లిక్స్ కో సీఈవో టెడ్ సరాండొస్.. నిన్న జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లో ప్రత్యక్ష్య మయ్యాడు. ఇక రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫ్యామీలతో నెట్ ఫ్లిక్స్ బృందం మంతనాలు జరిపి... ఫోటోలు దిగారు.
ఇప్పుడు తాజాగా నెట్ ఫ్లిక్స్ బృందం సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇంట్లో ప్రత్యేక్షం అయింది. నెట్ ఫ్లిక్స్ కో సీఈవో టెడ్ సరాండొస్.. అతని బృందం మహేశ్ బాబు, త్రివిక్రమ్ లతో కలిసి మంతనాలు జరిపారు. ఈ ఫోటోను మహేశ్ బాబు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేస్తూ.. ఈ విషయాన్ని వెల్లడించారు. ఫ్యూచర్ గురించి కొన్ని ఆసక్తికర సంభాషణాలు జరిగినట్లు.. కాఫి విత్ చిల్ అంటూ పోస్ట్ చేశారు. మహేశ్ చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Brahmamudi December 9th: అనామిక పేరెంట్స్ కన్నింగ్ ప్లాన్... మొక్కను బతికించిందెవరు?
టాలీవుడ్ ఇండస్ట్రీని నెట్ ఫ్లిక్స్ ఏం చేయాలనుకుంటుందని కొంతమంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొన్న రామ్ చరణ్ ఫ్యామిలీ.. నిన్న ఎన్టీఆర్ ఫ్యామిలీ... నేడు మహేశ్ బాబు.. అసలు నెట్ ఫ్లిక్స్ ఏం ప్లాన్ చేసింది.. అంటూ ప్రశ్నిస్తున్నారు. మా హీరోస్ ఏదైనా ప్లాన్ చేస్తున్నావా నెట్ ఫ్లిక్స్ మావా అంటూ ట్రోల్ చేస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలతో కలిసి ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ ప్లాన్ చేసిందా ఏంటి.. అంటూ ఆశ్చర్యపోతున్నారు.
ఇదిలా ఉంటే.. టాలీవుడ్ రేంజ్ రోజు రోజుకు పెరిగిపోతుంది. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్, రామ్ చరణ్ గ్లోబర్ స్టార్ హీరోస్ అయిపోయారు. మరోవైపు మహేశ్ రాజమౌళి ప్రాజెక్ట్ మొదలు కాకముందే హైప్స్ మామూలుగా లేవు. ఈ నేపథ్యంలోనే నెట్ ఫ్లిక్స్ మన తెలుగుహీరోలను మచ్చిక చేసుకుంటుందని టాక్ వినిపిస్తుంది. సినిమాల గురించి, ఓటిటీలా గురించి వీరు చర్చించినట్లు సమాచారం. రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేశ్ బాబు ఫ్యామిలీలతో టెడ్ సరండోస్ భేటీ అవ్వడం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఎందుకు నెట్ ఫ్లిక్స్ సీఈఓ.. ఇలా టాలీవుడ్ స్టార్స్ ఫ్యామిలీస్ ను మీట్ అవుతున్నారనేది తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











