OTTలోకి వచ్చేసిన బ్లాక్ బస్టర్ మిస్టరీ థ్రిల్లర్.. ప్రతిక్షణం ట్విస్టులే ట్విస్టులు!
ఓటీటీలోకి మరో సూపర్ హిట్ డార్క్ ఫాంటసీ థ్రిల్లర్ వచ్చేసింది. మళయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన భ్రమయుగం ఓటీటీలో తెలుగు వర్షన్ సైతం స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లో బ్లక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేసింది. అసలు ఈ సినిమా కథేంటి.. ఎందులో స్ట్రీమింగ్ అవుతుందనే వివరాలు ఈ స్టోరీలో చూసేద్దాం.
మలయాళ మెగా స్టార్ మమ్ముట్టి నటించిన తాజా చిత్రం భ్రమయుగం. ఇక ఈ సినిమా థియేటర్లలో ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఏ సినిమా తీసినా అందులో పాత్రకు తగ్గట్లు ఒదిగిపోతారు. పాత్రకు తగ్గట్లు మారిపోతారు కానీ... ఆయనకు తగ్గట్లు పాత్రలు ఉండవు. ఏ పాత్రలోనే ఇట్టే ఒదిగిపోతారు. అలా ఇటీవల డార్క్ ఫాంటసీ చిత్రం భ్రమయుగంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అయ్యాడు మమ్ముట్టి.

ఇక భ్రమయుగం సినిమా విషయానికి వస్తే... గత సినిమాలతో పోల్చుకుంటే ఈ మూవీ డిఫరెంట్. దాని వల్లే రిలీజ్ కు ముందు నుంచే ఎక్కువ క్రేజ్ వచ్చింది. ఈ సినిమాలో కేవలం మూడే పాత్రలు ఉండటం... సినిమా మొత్తం బ్లాక్ అండ్ వైట్ లో ఉండటం. ఇటీవల కాలంలోనూ బ్లాక్ అండ్ వైట్ కలర్ సినిమా తీసి సక్సెస్ కొట్టడం అనేది పెద్ద సాహసమే అని చెప్పాలి. సాహసం చేసి సక్సెస్ అయ్యారు భ్రమయుగం మేకర్స్.
మమ్ముట్టి నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 17న థియేటర్లలో విడుదలైంది. మొదటి షో నుంచే ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. ఆ తర్వాత వారానికే అంటే ఫిబ్రవరి 23న తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో భ్రమయుగం సినిమాను రిలీజ్ చేశారు మేకర్స్. మలయాళంలో అంత కాకపోయినా ఇక్కడ కూడా మమ్ముట్టి సినిమాకు మంచి వసూళ్లు లభించాయి. ఇలా థియేటర్లలో హిట్ గా నిలిచిన భ్రమయుగం సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సోనీ లివ్ మమ్ముట్టి నటించిన ఈ భ్రమయుగం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసింది. ఇక ఈ క్రమంలోనే మార్చి 15వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు గతంలోనే ప్రకటించింది. ఇక ఈ రోజు మార్చి 15న అర్థరాత్రి నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో మొత్తం 6 భాషల్లో సోనీలీవ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుంది.

ఇక ఈ సినిమా విషయానికి వస్తే... రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించగా.. భ్రమయుగం సినిమాలో అర్జున్ అశోకన్ , సిద్ధార్థ్ భరతన్, అమల్దా లిజ్ వంటి నటీనటులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాను నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వైనాట్ స్టూడియోస్ బ్యానర్స్ పై చక్రవర్తి రామచంద్ర, ఎస్. శశికాంత్ సంయుక్తంగా రూపొందించారు.
ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. 17వ శతాబ్దంలో మలబారు తీరం ఉండేది. ఓ రాజ్యంలో రాజు దగ్గర గాయకుడిగా పనిచేసే దేవన్(అర్జున్ అశోకన్) అడవిలో తప్పిపోతాడు. ఇక అక్కడే ఉంటున్న కుముదన్ పొట్టి (మమ్ముట్టి) ఉంటున్న ఇంటికి వెళ్లగా... అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. ఎన్నిసార్లు తప్పించుకోవాలని చూసినా సరే దేవన్ అక్కడి నుంచి తప్పించుకోలేకపోతాడు. అయితే చివరకు ఏం జరిగిందనే ఈ భ్రమయుగం కథ. మరి ఈ వీకెండ్ కు మీరు మంచి మిస్టరీ థ్రిల్లర్ చూడాలనుకుంటే ఈ సినిమా మీకు మంచి ఛాయిస్ అవుతుంది.


Click it and Unblock the Notifications











