ఓటీటీలో రామ్ పోతినేని రికార్డు.. అన్ని కోట్లతో తొలి చిత్రంగా డబుల్ ఇస్మార్ట్
టాలీవుడ్‌లో సుదీర్ఘ కాలంగా తనదైన చిత్రాలతో సందడి చేస్తూ.. ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను గణనీయంగా పెంచుకుంటూ వెళ్తోన్న హీరోనే ఉస్తాద్ రామ్ పోతినేని. ఆరంభంలో హిట్లు కొట్టి.. మధ్యలో ఇబ్బందుడు పడి.. ఇస్మార్ట్ శంకర్ తర్వాత జోష్ పెంచిన అతడు.. ఇప్పుడు భారీ సక్సెస్ కోసం చూస్తున్నాడు. ఇందుకోసం ప్రస్తుతం రామ్ 'డబుల్ ఇస్మార్ట్' మూవీ చేస్తున్నాడు.
డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ - రామ్ పోతినేని కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రమే 'డబుల్ ఇస్మార్ట్'. ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన సూపర్ హిట్ అయిన 'ఇస్మార్ట్ శంకర్' మూవీకి ఇది సీక్వెల్‌గా వస్తోంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు.

'డబుల్ ఇస్మార్ట్' మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ గత ఏడాదిలోనే ప్రారంభం అయింది. అంతేకాదు, చిత్రీకరణ కూడా శరవేగంగానే సాగుతోంది. ఇందులో హీరో రామ్‌తో పాటు కీలక పాత్రను చేస్తున్న పలువురు నటీనటులపై షూటింగ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా పలు షెడ్యూళ్లను ప్లాన్ చేసి వీలైనంత త్వరగా దీన్ని విడుదల చేయాలని చూస్తున్నారు.
ఫుల్ లెంగ్త్ యాక్షన్‌తో రూపొందుతోన్న 'డబుల్ ఇస్మార్ట్' మూవీ నుంచి ఇప్పటి వరకూ పెద్దగా అప్‌డేట్లు రాలేదు. అయినప్పటికీ ఈ క్రేజీ చిత్రంపై ఉన్న అంచనాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో చిత్ర యూనిట్ బిజినెస్ కార్యక్రమాలను మొదలు పెట్టేసి కొన్ని రైట్స్ కూడా అమ్మేసింది. దీనిపై తాజాగా మరో న్యూస్ బయటకు వచ్చింది.

రామ్ హీరోగా చేస్తున్న 'డబుల్ ఇస్మార్ట్' మూవీకి సంబంధించిన డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకున్నట్లు తాజాగా తెలిసింది. ఇందుకోసం ఆ సంస్థ ఏకంగా రూ. 40 కోట్లు చెల్లించినట్లు టాక్ వినిపిస్తోంది. ఇది రామ్ కెరీర్‌లోనే టాప్ ఓటీటీ డీల్ అని సమాచారం. ఇప్పుడు ఈ వార్త టాలీవుడ్ ప్రముఖులను సైతం షాక్‌కు గురి చేస్తుందని చెప్పొచ్చు.
ఇదిలా ఉండగా.. 'డబుల్ ఇస్మార్ట్' మూవీని పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో సంజయ్ దత్ కీలకమైన పాత్రను చేస్తున్నాడు. అలాగే, ఎంతో మంది ప్రముఖులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి మణి శర్మ సంగీతం ఇస్తున్నారు. ఈ మూవీ అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


Click it and Unblock the Notifications











