Anuja OTT release: ఓటీటీలో ఆస్కార్ నామినేటెడ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Anuja OTT release:ఆస్కార్ అవార్డులు-2025లో (Oscars 2025) ఇండియన్ షార్ట్ ఫిల్మీం కు ప్రాతినిధ్యం దక్కింది. బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా నిర్మించిన అనూజ(Anuja) సినిమాకు బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో చోటు లభించింది. 97వ అకాడమీ అవార్డుల కోసం ఈ కేటగిరిలో దాదాపు 180 సినిమాలు పోటీ పడగా.. ఈ సినిమా నామినేషన్స్ లో నిలిచింది. ఈ అయితే.. సినిమాకు సంబంధించిన ఓటీటీ అప్డేట్ వచ్చేసింది.
ఆస్కార్ లోని బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో అనూజ నామినేషన్స్ నిలిచింది. ఈ షార్ట్ ఫిల్మ్‌ను ప్రియాంకా చోప్రా (Priyanka Chopra), గునీత్ మోంగా నిర్మించగా, ఆడమ్ జే గ్రావ్స్ దర్శకత్వం వహించారు. బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో అనూజ తో ఏలియన్, ఐ యామ్ నాట్ ఏ రోబో, ది లాస్ట్ రేంజర్ , ఏ మ్యాన్ హు వుడ్ నాట్ రిమైన్ సైలెంట్ వంటి సినిమాలు పోటీపడుతున్నాయి. ఈ 5 సినిమాల్లో ఏది ఆస్కార్ అవార్డ్ ను సొంతం చేసుకుంటుందో వేచి చూడాలి.

ఇటీవల ఉంటే.. గునీత్ మోంగా సినిమా .. మూడో ఆస్కార్ కు నామినేట్ అయ్యింది. గతంలో గునీత్ మోంగా నిర్మించిన 'ది ఎలిఫెంట్ విస్పర్స్, పీరియడ్: ఎండ్ ఆఫ్ సెంటెన్స్ వంటి సినిమాలు ఆస్కార్ అవార్డును అందుకున్నాయి. దీంతో ఈ సినిమాకు కూడా ఖచ్చితంగా ఆస్కార్ వచ్చి తీరుతుందని మూవీ లవర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆస్కార్ అందుకుంటుందా? లేదా? అనేది మార్చి 2 న లాస్ ఏంజెలెస్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగే ఆస్కార్ అవార్డుల వేడుక వరకు వేచి చూడాల్సిందే.
అనూజ కథేంటీ.. న్యూ ఢిల్లీలోని ఓ మురికి వాడలో అనుజా అనే తొమ్మిదేళ్ల బాలిక ఉంది. వారిది నిరుపేద కుటుంబం. చదువుకొనే స్థోమత లేక అనుజ తన అక్కతో కలిసి ఓ గార్మెంట్ లో పనిచేయడానికి వెళ్తుంది. కానీ, ఆ చిన్నారికి మాత్రం చదువుకోవాలని ఉంటుంది. ఈ క్రమంలోనే పాఠశాల, చదువు గురించి తన సోదరిని అడిగి తెలుసుకుంది. ఈ విషయాలు తెలుసుకున్నాక తరువాత స్కూలుకి వెళ్లాలన్న ఆసక్తి మరింత పెరుగుతుంది. ఈ క్రమంలోనే అనుకోకుండా అనుజాకు చదువుకునే అవకాశం వస్తుంది. ఇలా అక్కచెల్లెళ్ల మధ్య సరదాగా సాగే సన్నివేశాలను ఆసక్తిగా మలుస్తూ ఈ షార్ట్‌ఫిల్మ్‌ను తెరకెక్కించారు .
Thandel Trailer Review: నాగచైతన్య మాస్ అదుర్స్.. తండేల్ ట్రైలర్ గూస్ బంప్స్
ఈ షార్ట్‌ఫిల్మ్ కు దర్శకుడు ఆడమ్ జె గ్రేవ్స్ దర్శకత్వం వహించగా.. గునీత్ మోంగా, మిండీ కాలింగ్, సుచిత్రా మిత్తల్, ప్రియాంక చోప్రా నిర్మాతలుగా వ్యవహరించారు. 22 నిమిషాల నిడివి గల ఈ షార్ట్ ఫిల్మ్‌కు అనూజ పాత్రలో సజ్జా పఠాన్, తన అక్క పాలక్‌గా అనన్య షాన్ బాగ్, వర్మ పాత్రలో నగేష్ బోంస్లే నటించారు. ఈ షార్ట్ మూవీ ఫిబ్రవరి 5 నుంచి నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కాబోతోంది. ఈ మేరకు నెట్ ఫ్లిక్స్ అధికారిక ప్రకటన వెల్లడించింది.


Click it and Unblock the Notifications











