OTT : సడెన్‌గా ఓటీటీలోకి డబుల్ ఇస్మార్ట్.. షెడ్యూల్ కంటే ముందే, ట్విస్ట్ మామూలుగా లేదుగా
రామ్ పోతినేని హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా మూవీ డబుల్ ఇస్మార్ట్. గతంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. తొలి రోజు నుంచే డివైడ్ టాక్ కారణంగా ప్రేక్షకుడిని ఏ మాత్రం మెప్పించలేక డిజాస్టర్‌గా నిలిచింది. పూరి కనెక్ట్ బ్యానర్‌పై చార్మీ కౌర్, పూరీ జగన్నాథ్ నిర్మించిన ఈ సినిమా భారీ నష్టాలతో తన బిజినెస్ క్లోజ్ చేసింది. థియేటర్‌లో చాప చుట్టేసిన ఈ మూవీ ఇప్పటికే ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. కానీ సడెన్‌గా ఓటీటీలో ప్రత్యక్షమైంది. దీని వివరాలు చూస్తే :
విదేశాల్లో చీకటి సామ్రాజ్యాన్ని నడిపే సంజయ్ దత్ (బిగ్‌బుల్) .. ఇండియాను ముక్కలు చేయాలనే కుట్ర పన్నుతాడు. ఇతని ప్లాన్ తెలిసి రా ఏజెంట్లు సంజయ్ దత్ కోసం వెతుకుతుంటారు. మెడికల్ టెస్టుల్లో తన మెదడులో కణితి ఉందని తెలుసుకున్న బిగ్‌బుల్.. తాను చనిపోకూడదని నిర్ణయించుకుంటాడు. ఆ క్రమంలో ఇస్మార్ట్ శంకర్ గురించి తెలుసుకుని బిగ్‌బుల్ తన ప్లాన్‌లు, జ్ఞాపకాలను కాపీ చేసి ఇస్మార్ట్ శంకర్ మైండ్‌లోని చిప్‌లో పెడతారు. ఆ తర్వాత ఏం జరిగింది..? ఇండియాను ముక్కలు చేయాలనే బిగ్‌బుల్ కల నెలవేరిందా..? అన్నదే కథ.

డబుల్ ఇస్మార్ట్‌ను దాదాపు 90 కోట్ల వ్యయంతో ఛార్మీ, పూరీలు నిర్మించారు. ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ కావడం, ట్రైలర్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ రావడం పైగా సంజయ్ దత్ లాంటి స్టార్ ఉండటంతో డబుల్ ఇస్మార్ట్‌పై భారీ అంచనాలు నెలకొని.. ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగింది. వరల్డ్ వైడ్‌గా రూ.60 కోట్ల మేర వ్యాపారం చేసింది. హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్‌ని ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుని రిలీజ్ చేశారు.
ఆంధ్ర, నైజాంలో రూ.43 కోట్ల మేర, ఓవర్సీస్‌లో రూ.5 కోట్లు, ఇతర రాష్ట్రాల్లో 6 కోట్ల మేర మొత్ంగా రూ.54 కోట్ల మేర థియేట్రికల్ రైట్స్ బిజినెస్ జరిగింది. ఫస్ట్ డే ఓపెనింగ్స్ పరంగా రూ.7 కోట్లను రాబట్టింది డబుల్ ఇస్మార్ట్. అయితే మ్యాట్నీ నాటికి సినిమా పొజిషన్ అర్ధం కావడంతో బుకింగ్స్ తగ్గాయి. వీకెండ్ నాటికి కలెక్షన్స్ మరింత డల్ అయ్యాయి. థియేటర్‌లో బిజినెస్ క్లోజ్ చేసే నాటికి డబుల్ ఇస్మార్ట్ రూ.13.5 కోట్లు వసూలు చేసి భారీ నష్టాలను మిగిల్చింది.
డబుల్ ఇస్మార్ట్‌ను సెప్టెంబర్ 27 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని నిర్ణయించారు. అమెజాన్ ప్రైమ్ డబుల్ ఇస్మార్ట్ ఓటీటీ రైట్స్‌ను రూ.33 కోట్లు పెట్టి దక్కించుకున్న సంగతి తెలిసిందే. కానీ ఓటీటీ రిలీజ్‌కు ఇంకా 20 రోజుల పైనే సమయం ఉన్నప్పటికీ .. ఎలాంటి అఫిషియల్ ఇన్ఫర్మేషన్ లేకుండానే అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చేసింది డబుల్ ఇస్మార్ట్. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. దక్షిణాది భాషల వరకు ఓకే కానీ డబుల్ ఇస్మార్ట్ ఓటీటీ రిలీజ్‌పై ఇంకా క్లారిటీ రాలేదు. డబుల్ ఇస్మార్ట్ హిందీ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్ లేదా జీ5లో కానీ రిలీజ్ కావొచ్చు. ఏం జరగనున్నది కొద్దిరోజుల్లోనే తెలియనుంది. మరి డబుల్ ఇస్మార్ట్‌ను థియేటర్‌లో మిస్ అయిన ఆడియన్స్ ఓటీటీలో చూసేయండి మరి.


Click it and Unblock the Notifications











