OTT Releases This Week: ఈ వారం ఓటీటీల్లోకి క్రేజీ సినిమాలు.. ఆ మూవీస్ అస్సలు మిస్‌ కాకండి..

OTT Telugu Movies This week: ఒకప్పుడు వీకెండ్ వచ్చిందంటే థియేటర్లలో ఏ కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయా అని సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూసేవారు. కానీ కాలం మారింది.. ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రేక్షకుల చూపు స్మాల్ స్క్రీన్‌పైనే పడుతోంది.ఇప్పుడు వారాంతం దగ్గరపడుతుందంటే చాలు, ఈసారి ఏ ప్లాట్‌ఫామ్‌లో ఏ సినిమా, ఏ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్‌కు వస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. కుటుంబంతో కలిసి ఇంట్లోనే ఎంటర్‌టైన్‌మెంట్ ఆస్వాదించేందుకు ఓటీటీలు మొదటి ఎంపికగా మారాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ వారం కూడా పలు ఆసక్తికరమైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. మరి ఈ వీకెండ్ మిస్ కాకూడని ఆ కొత్త కంటెంట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

చెక్కుచెదరని సమంత స్థానం.. టాప్ 10 హీరోయిన్స్ వీరే!
ప్రతిఛాయ
ఈ వారం ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్న సినిమాల్లో ప్రతిఛాయ (Prathichaya) సినిమా ఒకటి. 'మీరందరూ నా విజయ గాథ గురించి వినాలనుకుంటున్నారు. కానీ నేను విజయం సాధించానా?'' అంటూ ఇటీవలే థియేటర్లలోకి వచ్చింది. 'మలయాళ స్టార్ నివిన్‌ పౌలీ (Nivin Pauly) ప్రధాన పాత్రలో నటించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ ఇటీవల థియేటర్లలో విడుదలై మంచి స్పందన అందుకుంది. కేరళ రాజకీయాల నేపథ్యంలో సాగే ఈ కథలో అధికార పోరు, ప్రతిష్ట, కుట్రల చుట్టూ కథ నడుస్తుంది. బి. ఉన్నికృష్ణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం నుంచి జియో హాట్ స్టార్ (JioHotstar)లో స్ట్రీమింగ్ కానుంది. థ్రిల్లర్ ప్రేమికులకు ఇది మంచి ఎంపికగా చెప్పుకోవచ్చు.

OTT Telugu Movies This Week Band Melam Prathichaya Lechindi Mahila Lokam amp amp More

లేచింది మహిళా లోకం
తెలుగు ప్రేక్షకుల కోసం మరో ప్రత్యేక విడుదలగా లేచింది మహిళా లోకం (Lechindi Mahila Lokam) వస్తోంది. మంచు లక్ష్మి, అనన్య నాగళ్ల, శ్రద్ధా దాస్, హరితేజ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా భార్యాభర్తల సంబంధాలు, కోర్టు కేసులు, మహిళా భావజాలం నేపథ్యంలో రూపొందింది. కార్తిక్‌-అర్జున్‌ దర్శకత్వం వహించారు. ఇందులో ''భర్తకు ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం.. జీవితంలోని ముఖ్యమైన తేదీల్ని గుర్తుపెట్టుకోవడం'' లాంటి కామెడీ సంభాషణలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నా.. థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆడకపోయింది. డిజిటల్‌లో మంచి ఆదరణ పొందుతుందనే నమ్మకంతో చిత్రబృందం ఉంది. ఈ సినిమా ఏప్రిల్ 22 నుంచి Sun NXT లో అందుబాటులోకి రానుంది.

బ్యాండ్ మేళం (Band Melam)
వైవిధ్యమైన కంటెంట్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న ప్రముఖ ఓటీటీ వేదిక ZEE5 లో త్వరలో బ్యాండ్ మేళం (Band Melam) సినిమా స్ట్రీమింగ్ కానున్నది. హర్ష్ రోషన్, శ్రీదేవి అపల్లా జంటగా ఈ చిత్రంలో సతీష్ జవ్వాజీ తెరకెక్కించారు. ప్రముఖ నిర్మాత కోన వెంకట్ నిర్మించిన ఈ సినిమాలో హర్ష, శ్రీదేవి జంటగా నటించారు. థియేటర్లలో పెద్దగా మెప్పించలేకపోయిన ఈ సినిమా ఏప్రిల్ 24 నుంచి ZEE5 లో స్ట్రీమింగ్ కానుంది. డిజిటల్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో చిన్ననాటి స్నేహితులు గిరి, రాజి ప్రేమలో పడతారు. అనుకోని పరిస్థితుల్లో గిరి లోకల్ మ్యూజిక్ బ్యాండ్ ప్రారంభిస్తాడు. ప్రేమ, సంగీతం, పల్లె సంస్కృతి, భావోద్వేగాలతో ఈ సినిమా రూపొందించబడింది. మట్టివాసనతో కూడిన కథ, హార్ట్ టచ్ చేసే సన్నివేశాలతో ఈ చిత్రం జీ5 తెలుగు ప్రీమియర్లలో మరో మంచి సినిమాగా నిలవనుంది.

షార్ట్ ఫిలిమ్స్‌ను ఇష్టపడేవారికి వేడుక ( Veduka) బెస్ట్ ఛాయిస్.. కథాసుధ సిరీస్‌లో భాగంగా రూపొందిన ఈ చిత్రంలో అర్జున్ జబ్నవీస్, నందిని ప్రధాన పాత్రల్లో నటించారు. సాయికృష్ణ దర్శకత్వం వహించిన ఈ షార్ట్ ఫిలిం ప్రస్తుతం ETV Win లో స్ట్రీమింగ్ అవుతోంది. కథలో వైవిధ్యం ఉన్నప్పటికీ ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఇక హాలీవుడ్ వెబ్‌సిరీస్ అభిమానులకు ఈ వారం పెద్ద ట్రీట్ సిద్ధంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ సంపాదించిన ' ది బాయ్స్ '(The Boys) సీజన్ 5 కొనసాగుతోంది. ఇందులో నాలుగో ఎపిసోడ్ ఏప్రిల్ 22న అమెజాన్ ఫ్రైమ్ వీడియోలో విడుదల కానుంది. ముఖ్యంగా తెలుగు డబ్బింగ్ వెర్షన్ అందుబాటులో ఉండటం తెలుగు ప్రేక్షకులకు మరింత ప్లస్ పాయింట్.

అలాగే స్ట్రేంజర్ థింగ్స్ అభిమానులకు మరో సర్‌ప్రైజ్ సిద్ధమైంది. 'Stranger Things: ales From 85' పేరుతో యానిమేటెడ్ స్పిన్-ఆఫ్ సిరీస్ ఏప్రిల్ 23 నుంచి Netflix లో స్ట్రీమింగ్ ఏజెన్సీ. 10 ఎపిసోడ్లతో రాబోతున్న ఈ సిరీస్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగు వెర్షన్‌పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. బాలీవుడ్ అభిమానుల కోసం 24 సిరీస్ మరోసారి వస్తోంది. అనిల్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ దేశానికి ముప్పుగా మారిన ఉగ్రవాద శక్తులను అడ్డుకునే కథతో రూపొందించారు. ఏప్రిల్ 24 నుండి JioHotstar లో అందుబాటులోకి రానుంది.

ఓటీటీ మూవీస్ / వెబ్ సిరీస్‌ల జాబితా చూస్తే..

ఏప్రిల్ 20:

కో కామిలాన్ లేన్ వెబ్ సిరీస్ సీజన్ 7 (నెట్ ఫ్లిక్స్)

కిల్ టోనీ మేనియా (ఇంగ్లీష్ మూవీ - నెట్ ఫ్లిక్స్)

ఫ్రమ్ 4 (వెబ్ సిరీస్ - ప్రైమ్ వీడియో)

కెవిన్ (వెబ్ సిరీస్ - ప్రైమ్ వీడియో)

రెసిల్ మేనియా (స్పోర్ట్ సిరీస్ - నెట్ ఫ్లిక్స్)

ఏప్రిల్ 21:

అన్ చూసెన్ (నెట్ ఫ్లిక్స్)

అన్ టోల్డ్ : ది షూటింగ్ ఎట్ హాత్రోన్ హిల్ (నెట్ ఫ్లిక్స్)

రీబోర్న్ (జపనీస్ సిరీస్ - నెట్ ఫ్లిక్స్), జాంట్ (అమెజాన్ ప్రైమ్ వీడియో)

కెన్నెల్డ్ (అమెజాన్ ప్రైమ్ వీడియో)

లేట్ షిఫ్ట్ (అమెజాన్ ప్రైమ్ వీడియో)

ప్రొటక్టర్ (అమెజాన్ ప్రైమ్ వీడియో)

మేబల్ (అమెజాన్ ప్రైమ్ వీడియో)

ది సర్పెంట్ స్కిన్ (అమెజాన్ ప్రైమ్ వీడియో)

టో (అమెజాన్ ప్రైమ్ వీడియో).

ఏప్రిల్ 22:

లేచింది మహిళా లోకం (తెలుగు మూవీ - సన్ నెక్స్ట్)

కిల్లింగ్ గ్రౌండ్స్ (ఇంగ్లిష్ సిరీస్ - ప్రైమ్ వీడియో)

హల్క్ హోగన్ (వెబ్ సిరీస్ - నెట్ ఫ్లిక్స్)

సంతిత (నెట్ ఫ్లిక్స్), సోల్డ్ అవుట్ ఆన్ యు (కొరియన్ సిరీస్ - నెట్ ఫ్లిక్స్)

దిస్ ఈజ్ ఏ గార్డినింగ్ షో (నెట్ ఫ్లిక్స్), ది లాస్ట్ షూట్ (నెట్ ఫ్లిక్స్)

లెయినీ విల్సన్ (నెట్ ఫ్లిక్స్)

ఒరంగుటన్ (జియో హాట్ స్టార్)

ఏప్రిల్ 23:

స్ట్రేంజర్ థింగ్స్ (వెబ్ సిరీస్ - నెట్ ఫ్లిక్స్)

ఫ్లంక్డ్ (నెట్ ఫ్లిక్స్), యియా మురానో (నెట్ ఫ్లిక్స్)

ఆన్ యువర్ ల్యాప్ (నెట్ ఫ్లిక్స్)

రన్నింగ్ పాయింట్ (సీజన్ 2 - నెట్ ఫ్లిక్స్)

ఏప్రిల్ 24 :

హ్యాపీ రాజ్ (ప్రైమ్ వీడియో)

బ్యాండ్ మేళం (ZEE5)

ప్రతి చాయ (జియో హాట్ స్టార్)

అపెక్స్ (నెట్ ఫ్లిక్స్)

ఇఫ్ విషెష్ కుడ్ కిల్ (కొరియన్ సిరీస్ - నెట్ ఫ్లిక్స్)

సోనిక్ 3 (నెట్ ఫ్లిక్స్)

ఇమ్మోర్టల్ కంబ్యాట్ (ప్రైమ్ వీడియో)

మార్టి సుప్రీమ్ (HBO Max)

నో అదర్ ఛాయిస్ (HULU)

సెకండ్ ఆఫ్ ఫాలింగ్ (MUBI)

నాటీ బిజినెస్ (వెబ్ సిరీస్ - అమెజాన్ ప్రైమ్ వీడియో)

24 (హిందీ సిరీస్ - జియో హాట్ స్టార్)

నాటీ బిజినెస్ (వెబ్ సిరీస్ - అమెజాన్ ప్రైమ్ వీడియో)

ఏప్రిల్ 25 - మై డ్రెస్సప్ డార్లింగ్ (నెట్ ఫ్లిక్స్)

ఏప్రిల్ 26 - 28 ఇయర్స్ లేటర్ (నెట్ ఫ్లిక్స్).

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X