OTTలోకి డైరెక్టుగా మరో కొత్త దెయ్యం సినిమా... చూడాలంటే డేర్ ఉండాల్సిందే!
ఓటీటీలోకి మరో కొత్త దెయ్యం రాబోతుంది. ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ లో కూర్చొబెట్టేందుకు మరో సినిమా వచ్చేస్తోంది. శ్రీరామ్, రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం వళరి. ఈ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది. ట్రైలర్ తోనే ప్రేక్షకులను భయపెట్టిన ఈ సినిమా.. ఓటీటీలో డైరెక్టుగా రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అయింది. అసలు ఈ సినిమా కథేంటి.. ఎందులో స్ట్రీమింగ్ అవుతుందనే పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూసేయండి.
గురు ఫేమ్ రితికా సింగ్ ప్రధాన పాత్రలో నటించిన హారర్ చిత్రం వళరి. తమిళ చిత్రం గురుతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రితికా సింగ్.. ఆ తర్వాత తెలుగులోనూ వెంకటేషన్ తో అదే గురు చిత్రంతో ఆకట్టుకుంది. స్వతహాగా బాక్సార్ కావడంతో గురు సినిమాలో నటించే అవకాశం కొట్టేసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు వళరి అనే హారర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయిపోయింది.

ఇక ఈ సినిమాలో హీరోగా శ్రీరామ్ నటిస్తుండగా.. ఎం మృతిక సంతోషిణి దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా యూనిక్ హారర్ మూవీగా తెరకెక్కింది. శ్రీరామ్ ఇటీవల పిండం వంటి హారర్ సిినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు మరో హారర్ చిత్రంతో రాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ వళరి చిత్రానికి కె సత్య సాయిబాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉన్నారు.
ఈ సరికొత్త హారర్ సినిమా ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఈటీవీ విన్‌లో డైరెక్టుగా స్ట్రీమింగ్ కానుంది. మార్చి 6వ తేదీ నుంచి ఈ చిత్రం ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే ఈ సినిమా ట్రైలర్ ను గ్రాండ్ గా రిలీజ్ చేశారు మేకర్స్. ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ ముఖ్య అతిధిగా రాగా ఆయన చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. . ఆద్యంతం ఉత్కంఠతో సాగిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను భయపెట్టి ఆకట్టుకుంటుంది.

ఇక ట్రైలర్ ప్రారంభంలోనే... 'వెంకటాపురం బంగ్లా డీటెయిల్స్ కావాలి'.. 'ఆ బంగ్లా గురించి మీకు తెలుసా?' 'అది దెయ్యాల కొంప'.. ఇలా మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్ చెప్పే డైలాగ్స్ తో మొదలవుతుంది. ఇక వళరి ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ట్రైలర్ లో హారర్ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటుండగా.. ఇందులో రితికా సింగ్ టెర్రిఫిక్ నటనతో మెప్పించింది. శ్రీరామ్ పాత్ర కూడా కీలకంగా ఉందని తెలుస్తోంది. అతను నేవి ఆఫీసర్ కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.
Brahmamudi February 29th కల్యాణ్‍కు కొత్త ఆఫీస్ బాధ్యతలు.. అనామికపై స్వప్న ఫైర్ - పుట్టింటికి కావ్య!
దర్శకురాలు మృతిక సంతోషిణి చాలా ఈ సినిమాను చక్కగా ఎలివేట్ చేస్తూ.. రూపొందించారని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. కెమరాపనితనం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ప్రొడక్షన్ డిజైన్ ఆకట్టుకుంటున్నాయి. మొత్తానికి ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. మీరు హారర్ సినిమాలను ఇష్టపడితే.. ఇక ఈ సినిమాను మీరు ఇంట్లోనే చూసి ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











