OTTలో దుమ్ములేపుతున్న బ్లాక్ బస్టర్ మూవీ... ఇండియాలో నంబర్ 1 స్థానంలో ట్రెండ్

సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన తాజా చిత్రం జైలర్. ఇక ఈ చిత్రంతో రజినీకాంత్ మరోసారి తన సత్తా ఏంటో చూపించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా దాదాపు 650కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇక ఈ సినిమా ఆగస్టు 10న థియేటర్లోకి వచ్చింది. నెలకాకముందే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చి స్ట్రీమింగ్ వచ్చేసింది. అయితే ఈ మూవీ ఓటీటీలోనూ అదరగొడుతోంది. ఆ వివరాల్లోకి వెళితే....

తలైవా, సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన జైలర్ చిత్రం ఓటీటీలోనూ అదరగొడుతుంది. ఈ సినిమా ఆగస్టు 10న థియేటర్లో తెలుగు,తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా బాక్సా ఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ఈ మూవీ దాదాపు రూ.650 కోట్లు వసూలు చేసి.. రికార్డు క్రియేట్ చేసింది.

OTT

బీస్ట్ సినిమా తర్వాత ఎన్నో విమర్శలు అందుకున్న డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్... జైలర్ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఇక ఈ మూవీలో రమ్యకృష్ణ.. రజినీ సరసన నటించింది. హీరోయిన్ గా తమన్నా కనిపించగా... కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్.. అథితి పాత్రలో మెరిశారు.

ఇక జైలర్ మూవీ సెప్టెంబర్ 7 వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. అంతే కాదు సన్ నెక్స్ట్ ఓటీటీలోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఇక రెండు ఓటీటీల్లో ఈ సినిమా దుమ్ము లేపుతోంది. ఈ సినిమా ఓటీటీల్లో టాప్​ ట్రెండింగ్​ సినిమాగా దూసుకెళ్తోంది.

అయితే జైలర్ సినిమా థియేటర్లలోకి వచ్చి నెలకూడా గడవకముందే ఓటీటీలోకి వచ్చి రికార్డు క్రియేట్ చేయడం కూడా రజినీ సత్తా అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కు ముందే తమిళ హెచ్ డి ప్రింట్ ఆన్ లైన్ లో లీక్ అయింది. దీనితో కాస్త ఓటీటీ వారికి ఇదే దెబ్బ అనే చెప్పవచ్చు. అయినా.. ఓటీటీలోనూ ఈ మూవీ అదరగొడుతుంది.

OTT
Mission Raniganj: గవర్నమెంటు కంటే ముందే జాగ్రత్తపడ్డ అక్షయ్ కుమార్.. దెబ్బకి టైటిల్ మార్చాడుగా?

ఓటీటీలో నేషనల్ వైడ్ గా నంబర్ వన్ స్థానాన్ని జైలర్ సాధించుంది. ఇక ఈ మూవీని ప్రముఖ నిర్మాత కళానిధి మారన్ సన్ పిక్చర్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఇక ఈ సినిమాకు అనుకున్నదానికంటే లాభాలు ఎక్కువ రావడంతో.. ఈ చిత్ర నిర్మాత.. హీరో రజినీ కాంత్, డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ కు పోర్చో కారును గిఫ్ట్ ఇచ్చారు. ఇక దానితో పాటు.. ఓ చెక్ కూడా ఇచ్చారు.

యాక్షన్ జోనర్‌లో వచ్చిన 'జైలర్' సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు. ఇందులో రమ్యకృష్ణ, మిర్నా మీనన్, వినాయకన్, వసంత్ రవి ప్రధాన పాత్రలను చేయగా.. తమన్నా, సునీల్, జాకీ ష్రాఫ్, యోగి బాబులు కీలక పాత్రల్లో కనిపించారు. దీనికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని సమకూర్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X