OTTలోకి వచ్చేసిన తెలుగు హీస్ట్ డ్రామా... ఎందులో చూడాలంటే?
ఓటీటీలోకి కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ప్రతి వారం ప్రేక్షకులను అలరించడానికి ఓటీటీ సంస్థలు కొత్త కొత్త కంటెంట్ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తుంది. ఇక ఈ క్రమంలోనే ఓటీటీలోకి ఈ వారం కొత్త సినిమాలు అందుబాటులోకి వచ్చాయి. అందులో ఓ తెలుగు హీస్ట్ డ్రామా ఆకట్టుకుంటుంది. ఫాంటసీ థ్రిల్లర్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన సురాపానం... ఫన్ అండ్ కిక్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఆ సినిమా కథేంటి.. ఎందులో చూడాలి అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
చిన్న చిత్రాలు అయినా.. కంటెంట్ బాగుంటే మన తెలుగు ప్రేక్షకులు భాష ఏంటి అనేది కూడా చూడరు. ఆ సినిమాను ఆదరిస్తారు. అయితే కొన్ని సినిమాలు థియేటర్లలో ఆడకపోయినా ఓటీటీలో మాత్రం మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటాయి. అలాంటి కోవలోకే వస్తుంది ఈ సురాపానం సినిమా. థియేటర్లలో రిలీజ్ అయి... మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అంతే కాదు ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

చిన్నసినిమాల్లో కంటెంట్ బాగున్నా... ప్రమోషన్ లేకపోడవంతో అది ప్రేక్షకులకు చేరలేకపోతున్నాయి. అలాంటి సినిమాలకు ఓటీటీ మంచి వేదిక అవుతుంది. సురాపానం సినిమా థియేటర్లలో రిలీజ్ అయి.. ఆడలేకపోయింది. దానికి చిత్రబృందం సరియైన ప్రమోషన్ చేయలేకపోయింది. ఇప్పుడు ఓటీటీలోకి ఈ సినిమా వచ్చేసింది. సురాపానం.. కిక్ అండ్ ఫన్ అనేది దాని ట్యాగ్ లైన్. ఇక ఈ సినిమాను సంపత్ దర్శకత్వం వహించాడు. అంతే కాదు ఆయనే హీరో.
సంపత్ సరసన హీరోయిన్ ప్రగ్యా నయన్ నటించింది. ఇక ఈ సినిమాలో అజయ్ ఘోష్, సూర్య, ఫిష్ వెంకట్, మీసాల లక్ష్మణ్, చమ్మక్ చంద్ర, విద్యాసాగర్, అంజి బాబు, మాస్టర్ అఖిల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతం అందించారు. ఇక సురపానం సినిమా జూన్ 10వ తేదీన థియేటర్లలోకి వచ్చింది. కాకపోతే విడుదలైన మొదటి రోజే మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది.
అందులోనూ చిన్న సినిమా కావడంతో.. ఎవరు సురాపానం సినిమాను పట్టించుకోలేదు. ఇక ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. సరికొత్త కాన్సెప్ట్, కంటెంట్ ఉన్నా ఈ మూవీ పెద్దగా జనాల్లోకి వెళ్లలేదనే చెప్పాలి. అయితే సురాపానం సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఇక ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ఈ ఫాంటసీ థ్రిల్లర్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్ అందుబాటులోకి వచ్చేసింది.
Leo లియో సినిమాకు షాక్.. స్క్రీన్ చించేసిన విజయ్ ఫ్యాన్స్!
ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. తెలంగాణలోని ఓ పల్లెటూరిలో హీరో చిల్లర దొంగతనాలు చేస్తుంటాడు. అయితే అనుకోకుండా అతనికి ఓ శివుడి ప్రతిమ బాక్స్ దొరుకుతుంది. అందులో చిన్న సీసాలో పానీయం కూడా ఉంటుంది. అది తాగిన తర్వాత శివుడి ప్రతిమ కనిపించకుండా పోతుంది. మరి సీసాలోని ద్రవాన్ని తాగిన శివకు ఏమైంది? శివుడి ప్రతిమ ఏమైందో తెలుసుకోవాలంటే సురాపానం సినిమా చూడాల్సిందే. మీరు మంచి హీస్ట్ డ్రామా చూడాలి అనుకుంటే ఇంట్లోనే కూర్చొని ఓటీటీలో ఈ సినిమాను చూసేయండి.


Click it and Unblock the Notifications











