The Odyssey: రిలీజ్‌కు ముందే ఓటీటీలో ది ఒడిస్సీ .. భారీ హైప్‌తో క్రిస్టఫర్ నోలన్ ట్విస్ట్!

ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకులు ఎదురు చూస్తున్న చిత్రం ది ఒడిస్సీ. దిగ్గజ దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రిలీజ్‌కు ముందే సంచలనాలు క్రియేట్ చేస్తున్నది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌కు అనూహ్యమైన స్పందన కనిపిస్తున్నది. దాంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా కథ, కథనాలు, సన్నివేశాల చిత్రీకరణపై భారీగా చర్చ జరుగుతున్నది. అయితే ఇలాంటి క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని చిత్ర నిర్మాత, దర్శకులు ఈ సినిమా నిర్మాణంలో జరిగిన సంఘటనలు, ఈ సినిమా షూటింగ్ వివరాలను మేకింగ్ ఫిల్మ్ రూపంలో ఓటీటీలోకి తీసుకు రానున్నారు. ఈ వార్తను ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటన చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

మాట్ డామన్, టామ్ హాలెండ్ నటించిన ఈ సినిమా వరల్డ్ ప్రీమియర్ ముంబైలో ఇటీవల ప్రదర్శించారు. ఈ సినిమా ప్రీమియర్స్ తర్వాత సినీ క్రిటిక్స్ వెల్లడించిన అంశాలు ఈ మూవీపై మరింత క్యూరియాసిటీని పెంచాయి. ఈ సినిమా కోసం ఉపయోగించిన సాంకేతిక అంశాలు, కొన్ని సన్నివేశాలు అద్బుతంగా ఉన్నాయంటూ కామెంట్స్ చేసి నోలన్ మేకింగ్‌పై ప్రశంసలు గుప్పిస్తున్నారు.

The Odyssey making Film to steam on Jio Hotstar

ఇక సాధారణ ఆడియెన్స్ ఈ సినిమాపై ఉన్న ఆసక్తిని దృష్టిలో పెట్టుకొని ది ఒడిస్సీ సినిమా మేకింగ్ ప్రాసెస్‌ను జూలై 14వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నామని జియో హాట్ స్టార్ ప్రకటించింది. అలాగే ఈ మేకింగ్ ఫిల్మ్‌ను పికాక్ ఓటీటీలో కూడా వీక్షించవచ్చని తెలిపింది. దాంతో నోలన్ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తున్నారు. ఈ సినిమా మేకింగ్, గ్రాండియర్ విజువల్స్‌ను ఎలా షూట్ చేశారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల కష్టం, అంకిత భావం ఎలా ఉందనే విషయాన్ని ఈ సినిమా రిలీజ్‌కు ముందే చూడటానికి ఆయన అభిమానులు రెడీ అయిపోయారు.

Also Read
The Odyssey First Review: ది ఒడిస్సీ మూవీ ఫస్ట్ రివ్యూ
The Odyssey First Review: ది ఒడిస్సీ మూవీ ఫస్ట్ రివ్యూ

ఈతాకా గ్రీక్ సమ్రాజ్యాధినేత ఒడిస్సీ జీవితంలో జరిగిన కీలక సన్నివేశాలను ఆధారంగా చేసుకొని ట్రోజాన్ వార్ తర్వాత చోటు చేసుకొన్న సంఘటలన నేపథ్యంగా ఈ సినిమాను రూపొందించారు. ఒడిస్సీగా మాట్ డామన్, ఆయన భార్య పెనెలోప్ పాత్రలో అన్నె హత్‌వే నటించారు. ఈ చిత్రంలో టామ్ హాలెండ్, రాబర్ట్ పాటిన్‌సన్, సమంత మార్టన్, జెండ్యా, చార్లీజ్ థెరాన్ నటించారు. ఈ సినిమాను ఎమ్మా థామస్, క్రిస్టఫర్ నోలన్ నిర్మించారు.

Recommended For You
The Odyssey Critics Review: ది ఒడిస్సీ మూవీ క్రిటిక్స్ రివ్యూ
The Odyssey Critics Review: ది ఒడిస్సీ మూవీ క్రిటిక్స్ రివ్యూ

ఈ మూవీ సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి: హోయతే వాన్ హోయ్‌తేమ, ఎడిటర్: జెన్నిఫర్ లామే, మ్యూజిక్: లడ్‌విగ్ గోరాన్సన్ తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. యూనివర్సల్ పిక్చర్స్ , సింకోపి బ్యానర్లపై రూపొందించిన ఈ చిత్రం ఇండియాలో, ఇతర దేశాల్లో జూలై 17వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది.

Read more about: The Odyssey christopher nolan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X