This Week OTT Release: ఈ వారం ఓటీటీలో మెగా సందడి.. అలరించే కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..
This Week OTT Movies: మరో వారం వచ్చేసింది. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకునే సినిమాలు లేకపోయినా.. ఓటీటీ ప్రేమికులకు మాత్రం ఇది ఫుల్ ఫీస్ట్ వీక్ అనే చెప్పాలి. ముఖ్యంగా గత నెల సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సినిమాలన్నీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ కావడం ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని పెంచింది. గత వారం ఓటీటీలో పెద్దగా క్రేజీ కంటెంట్ లేకపోవడంతో, ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాలు, సిరీస్‌లపై ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వారం ఓటీటీలోకి దాదాపు 17కి పైగా సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్‌లో సందడి చేయనున్నాయి.
మన శంకర వరప్రసాద్ గారు
మెగాస్టార్ చిరంజీవి నటించిన సంక్రాంతి బ్లాక్‌బస్టర్ మన శంకర వర ప్రసాద్ గారు ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ కామెడీలో నయనతార కథానాయికగా నటించగా, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో మెరిశారు. థియేటర్లలో రూ.375 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్‌తో మరోసారి సందడి చేయనుంది. ఈ మూవీ జీ 5 లో ఫిబ్రవరి 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు మాత్రమే కాదు... తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ, బెంగాలీ, మరాఠీ భాషల్లోనూ చూడవచ్చు.

అనగనగా ఒక రాజు
నవీన్ పోలిశెట్టి మార్క్ కామెడీతో తెరకెక్కిన అనగనగా ఒక రాజు థియేటర్లలో మంచి వసూళ్లను రాబట్టింది. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించిన ఈ రూరల్ కామెడీ డ్రామా ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. నవీన్ టైమింగ్, డైలాగ్స్ ప్రేక్షకులను మరోసారి నవ్వించనున్నాయి. ఈ మూవీ నెట్ ఫిక్స్ లో ఫిబ్రవరి 11 నుంచి స్ట్రీమింగ్ కానున్నది. తెలుగు సహా ఇతర భాషల్లోనూ అందుబాటులో ఉండనుంది.
'అలా చేస్తానంటే 100 ఎకరాలు అమ్మేస్తా!' అనిల్ రావిపూడిపై శివాజీ పందెం
సాంప్రదాయిని సుప్పిణి సుద్దపూసని
ఈటీవీ విన్ ఒరిజినల్ వెబ్ సిరీస్ 90s: A Middle Class Biopic ద్వారా ఓటీటీలోకి రీ ఎంట్రీ ఇచ్చిన శివాజీ, ఇప్పుడు నేరుగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించి, నిర్మించిన సినిమా సాంప్రదాయిని సుప్పిణి సుద్దపూసని. ఈ సినిమాకు టైటిల్‌గా మారిన పాట అప్పట్లో బాగా వైరల్ కావడం తెలిసిందే. ఇప్పుడు అదే పేరుతో తెరకెక్కిన ఈ గ్రామీణ నేపథ్య చిత్రం ఫిబ్రవరి 12 నుంచి ETV Win లో ప్రీమియర్ కానుంది. శివాజీకి జోడీగా లయ నటించడం మరో ప్రత్యేక ఆకర్షణ. చాలా కాలం తర్వాత ఈ హిట్ పెయిర్ మళ్లీ తెరపై కనిపించనుండటంతో ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి అంచనాలున్నాయి. గ్రామీణ జీవనం, సంప్రదాయ విలువలు, భావోద్వేగాలను మేళవిస్తూ రూపొందిన ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వబోతోందని టాక్.
బేబీ గర్ల్
మలయాళ స్టార్ నివిన్ పౌలీ కీలక పాత్రలో నటించిన మెడికో థ్రిల్లర్ బేబీ గర్ల్. ఈ మూవీ ఫిబ్రవరి 12 నుంచి Sony LIV లో స్ట్రీమింగ్‌కు రాబోతోంది. ఆసుపత్రిలో పసికందు మాయమయ్యే ఘటన చుట్టూ తిరిగే ఈ కథ సస్పెన్స్‌తో పాటు భావోద్వేగాలను కూడా మేళవించి తెరకెక్కించారు. సంగీత ప్రతాప్, లిజి మోల్ జోస్, రుద్ర కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగు వెర్షన్‌లో కూడా అందుబాటులో ఉండనుంది. ఇప్పటికే నివిన్ పౌలీ నటించిన మరో చిత్రం ఓటీటీలో ట్రెండ్ అవుతుండటంతో, 'బేబీ గర్ల్'పై కూడా మంచి బజ్ కనిపిస్తోంది.
మలయాళ మూవీ - 'పాతి రాత్రి'
'మంజుమ్మల్ బాయ్స్'తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ నటుడు సౌబిన్ షాహిర్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ పాతి రాత్రి. ఈ మూవీ ఫిబ్రవరి 13 నుంచి SonyLIVలో స్ట్రీమింగ్ కానుంది. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లోనూ విడుదలయ్యే అవకాశాలున్నాయి. మలయాళ థ్రిల్లర్స్‌కు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉండటంతో, ఈ మూవీ కూడా ఓటీటీలో మంచి వ్యూస్ రాబట్టే ఛాన్స్ కనిపిస్తోంది.
'కోహ్రా సీజన్ 2'
మొదటి సీజన్‌తో సంచలనం సృష్టించిన హిందీ క్రైమ్ థ్రిల్లర్ 'కోహ్రా'ఇప్పుడు రెండో సీజన్‌తో రాబోతోంది. బరున్ సోబ్తి, మోనా సింగ్ కీలక పాత్రల్లో నటించిన ఈ సిరీస్ తెలుగు ఆడియోలో కూడా అందుబాటులో ఉండనుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ నెట్ ఫిక్స్ లో ఫిబ్రవరి 11 నుంచి స్ట్రీమింగ్ కానున్నది. అలాగే ది కాంజ్యూరింగ్: లాస్ట్ రైట్స్ (The Conjuring: Last Rites) ఫిబ్రవరి 13 నుంచి జియో హాట్ స్టార్ లో, ప్రెడేటర్: బ్యాడ్‌ల్యాండ్స్ (Predator: Badlands) ఫిబ్రవరి 12 నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానున్నది.
ప్రభాస్ హీరోగా నటించిన ఫాంటసీ హారర్ కామెడీ ది రాజా సాబ్ (The Raja Saab) ఇప్పటికే Jio Hotstar లో స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే శర్వానంద్ నటించిన నారీ నారీ నడుమ మురారి (Nari Nari Naduma Murari) అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఇలా ఈ వారం ఓటీటీ లవర్స్‌కు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాక్. సంక్రాంతి బ్లాక్‌బస్టర్ల నుంచి కొత్త థ్రిల్లర్స్, హాలీవుడ్ హారర్ మూవీస్ వరకు అన్ని జానర్లు అందుబాటులో ఉన్నాయి. థియేటర్‌కు వెళ్లలేకపోయినవారికి ఇది బెస్ట్ ఛాన్స్. మరి ఈ వారం మీరు ఏ సినిమా/సిరీస్‌తో మొదలు పెడతారు?


Click it and Unblock the Notifications











