OTT Release This Week: సమ్మర్ ఎంటర్టైన్మెంట్.. ఈ వారం ఓటీటీ సినిమాలు ఇవే..

This Week OTT Movies: ప్రతి వారం లాగే ఈ వారం కూడా మూవీ లవర్స్ ను ఎంటర్మైంట్ అందించడానికి ఇటు థియేటర్లు, అటు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లు సిద్ధమయ్యాయి. గత వారం బాక్సాఫీస్ వద్ద వచ్చిన సినిమాలు మంచి టాక్‌తో కొనసాగుతుండగా, ఈ వారం కొత్త కంటెంట్ మరింత ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ థియేటర్లలో విడుదల అవుతుండగా, ఓటీటీలో ఏకంగా 14కి పైగా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉండటం విశేషం. ఈ వివరాలు మీ కోసం..

డెకాయిట్ (Dacoit Movie)
ఈ వారం థియేటర్లలోకి వస్తున్న సినిమాల్లో ప్రధానంగా అడివి శేష్ నటించిన 'డెకాయిట్' మూవీ.. సెంట్రర్ ఆఫ్ ఆట్రాక్షన్ గా మారింది. చాలా కాలం తర్వాత.. అడివి శేష్ ఆయన పూర్తి స్థాయి యాక్షన్-లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలను పెరిగాయి. దర్శకుడు షానియల్ డియో తెరకెక్కించిన ఈ సినిమా కేవలం ప్రేమకథ మాత్రమే కాదు. యాక్షన్ థ్రిల్‌తో మేళవించిన ఒక కొత్త తరహా లవ్ స్టోరీగా దీన్ని రూపొందించారు. హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్ నటించడం సినిమాకు అదనపు ఆకర్షణ. అలాగే అనురాగ్ కశ్యప్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనుండటం ఆసక్తిని మరింత పెంచుతోంది.

This Week OTT amp amp Theatre Releases Dacoit LIK Pallichattambi amp amp Web Series List

లైక్ (Love Insurance Kompany)
ఇక కోలీవుడ్ నుంచి వస్తున్న ప్రదీప్ రంగనాథన్ 'LIK - లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ విఘ్నేష్ శివన్ తెరకెక్కించగా, కృతి శెట్టి హీరోయిన్‌గా నటించారు. ప్రస్తుత కాలంలోనే మనం రిలేషన్షిప్స్ కోసం టెక్నాలజీపై ఎంతగా ఆధారపడుతున్నామో చూపిస్తూ, రానున్న రోజుల్లో మనపై ఎలాంటి ప్రభావం చూపుతోందో అనే అంశంగా తెరకెక్కించారు. ప్రేమ కూడా ఒక ఇన్సూరెన్స్ పాలసీలా మారిపోతే? అనే ఆసక్తికర కాన్సెప్ట్ ఈ సినిమాలో ప్రధాన హైలైట్. యూత్‌కు ఈ మూవీ బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది.

పల్లి చట్టంబి (Pallichattambi)
మరోవైపు మలయాళం నుంచి టోవినో థామస్ నటించిన 'పల్లి చట్టంబి' కూడా మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. దర్శకుడు డిజో జోస్ ఆంటోని ఈ పిరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందించారు. 1950-60ల కాలం సాగే కథ ఇది. ఈ సినిమాలోగ్రామీణ జీవితం, రాజకీయ పరిస్థితులు, మాస్ ఎలిమెంట్స్-అన్నీ కలిపి ఒక స్ట్రాంగ్ కంటెంట్‌ను అందించబోతున్నాయి. పాన్ ఇండియా లెవెల్‌లో ఈ మూవీ రిలీజ్ కావడం దీని రీచ్‌ను పెంచుతోంది.

ఇక ఓటీటీ విషయానికి వస్తే.. ఈ వారం నిజంగా మూవీ లవర్స్‌ కు ఫెస్టివల్ అని చెప్పాలి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, సోనీ LIV, జీ 5, సన్ NXT, యాపిల్ టీవీ+,లయన్స్‌గేట్ ప్లే వంటి ప్రధాన ప్లాట్‌ఫార్మ్‌లన్నీ కొత్త కంటెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి.

ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్‌లో 'బీఫ్ సీజన్ 2', 'బిగ్ మిస్టేక్స్', 'తు యా మెయిన్', 'ట్రాష్' వంటి వెబ్‌సిరీస్‌లు, సినిమాలు రాబోతున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'ది బాయ్స్ సీజన్ 5' (తెలుగు డబ్బింగ్‌తో) రావడం సూపర్ హీరో సిరీస్ అభిమానులకు గుడ్ న్యూస్. అలాగే 'క్యాండీ అండ్ ది పిజ్జా గర్ల్' కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంది. జియో హాట్‌స్టార్‌లో 'థాయ్ కిజావి' అనే డబ్బింగ్ మూవీ,సోనీ LIV లో మరాఠీ చిత్రం 'టు ది అని ఫుజి', Zee5లో 'ఖాకీ సర్కస్' స్ట్రీమింగ్ కానున్నాయి.

ఇక సన్ నెక్స్ (Sun NXT)లో మలయాళ సినిమాలు'హల్', 'కణిమంగళం కోవిలకం' రిలీజ్ అవుతుండగా,
Apple TV+లో 'అవుట్‌కమ్', లయన్స్‌గేట్ ప్లేలో 'వైల్డ్‌క్యాట్' ఇంగ్లీష్, డబ్బింగ్ కంటెంట్ కూడా అందుబాటులోకి రానుంది. ఇలా అన్ని ప్లాట్‌ఫార్మ్‌లలో విభిన్న జానర్స్ కంటెంట్ ఒకేసారి స్ట్రీమింగ్ కానున్నాయి. ఇక ఈ వారం ట్రెండ్‌ను గమనిస్తే.. మూవీ లవర్స్ ఈ వారం పండుగే అని చెప్పవచ్చు.

ఓటీటీ మూవీస్ / వెబ్ సిరీస్ లిస్ట్
అమెజాన్ ప్రైమ్ వీడియో-

క్యాండీ అండ్ ది పిజ్జా గర్ల్ (హిందీ మూవీ - ఏప్రిల్ 10), బాయ్స్ సీజన్ 5 (తెలుగు డబ్బింగ్ సిరీస్ - ఏప్రిల్ 8)

నెట్ ఫ్లిక్స్ -

బీఫ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్ - ఏప్రిల్ 8), బిగ్ మిస్టేక్స్ (ఇంగ్లీష్ సిరీస్ - ఏప్రిల్ 9), 18th రోజ్ (మూవీ - ఏప్రిల్ 9), తు యా మై (హిందీ మూవీ - ఏప్రిల్ 10), త్రాష్ (ఇంగ్లీష్ మూవీ - ఏప్రిల్ 10)

సన్ నెక్స్ట్ -

హాళ్ (మలయాళ మూవీ - ఏప్రిల్ 10), కనిమంగంళం కొవిలకమ్ (మలయాళ మూవీ - ఏప్రిల్ 10)
జీ5 -

ఖాకీ సర్కస్ (తమిళ సిరీస్ - ఏప్రిల్ 10)

Dhurandhar 2 Day 18 Collections: ఆ రికార్డుకు ఒక్క అడుగు దూరంలో.. ధురంధర్ 2 కలెక్షన్లు ఎన్ని కోట్లంటే?
జియో హాట్ స్టార్ -

తాయి కిళవి (తమిళ మూవీ - ఏప్రిల్ 10)
సోనీ లీవ్ -

తో తీ అని ఫుజీ (మరాఠీ మూవీ - ఏప్రిల్ 10)

యాపిల్ టీవీ ప్లస్ -

ఔట్ కమ్ (ఇంగ్లీష్ మూవీ - ఏప్రిల్ 10)

లయన్స్ గేట్ ప్లే -

వైల్డ్ క్యాట్ (తెలుగు డబ్బింగ్ మూవీ - ఏప్రిల్ 10)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X