This Week OTT Movies: ఈ వారం ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..ఈ 4 బ్లాక్ బాస్టర్స్‌ను మిస్ కావద్దు..

This Week's OTT Releases: ఓటీటీలో ఈ రోజు సరికొత్త సినిమాలు స్ట్రీమింగ్ కి వచ్చాయి. డిసెంబర్ మొదటి వారంలో ప్రేక్షకులకు భారీ ఎంటర్టైన్‌మెంట్ ను అందించనున్నాయి. థియేటర్లలో మంచి రెస్పాన్స్ దక్కించుకున్న ఈ సినిమాలు, ఓటీటీలో అంతకు మించి ఆదరణను పొందుతున్నాయి. పెద్ద సినిమాలు థియేటర్స్ లో విడుదల కాగా.. పాపులర్ మూవీస్ ఓటీటీలో విడుదల కానున్నాయి. దీంతో ఈ వారం సినీ ప్రియులకు పండగ కానుంది. ఇంతకీ.. ఓటీటీల్లో ఈ వారం విడుదల కాబోతున్న మూవీస్ లిస్ట్ ఏంటో ఓ లూక్కేయండి.

బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో భారీ అంచనాలతో తెరకెక్కిన మూవీ 'అఖండ 2: తాండవం'. వాస్తవానికి ఈ మూవీ నేడు విడుదల కావాల్సింది. కానీ, అనూహ్యంగా వాయిదా పడింది. దీంతో సినీ ప్రేక్షకులకు తీవ్ర నిరాశ ఎదురైంది. విడుదలకు కొన్ని గంటల ముందే సినిమా స్క్రీనింగ్ నిలిపివేయడం వల్ల థియేటర్లలో ఖాళీగా మారాయి.

This Week s OTT Releases New Movies Hit Films Streaming

ఈ నేపథ్యంలో గత రెండు వారాల్లో వచ్చిన చిన్న సినిమాలు మాత్రం ఈ వారం స్క్రీన్లపై తమ ప్రభావాన్ని చూపడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక మరోవైపు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో మాత్రం ఎంటర్‌టైన్‌మెంట్ హంగామా మామూలు కాదు. మూడు బ్లాక్‌బస్టర్లు, ఒక డిజాస్టర్ ఫిల్మ్‌తో పాటు కొత్త సినిమాలు, సరికొత్త సిరీస్‌లు డిజిటల్ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి.

ది గర్ల్ ఫ్రెండ్ (The Girlfriend)
రష్మిక మందన్న కీలక పాత్రలో నటించిన 'ది గర్ల్‌ఫ్రెండ్‌', థియేటర్లలో విజయవంతమైన రన్ తర్వాత ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్-ఎమోషనల్ డ్రామా ఇంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన రావడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. నవంబర్ 7న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 30 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. నార్త్ అమెరికాలో 700K డాలర్లను రాబట్టి లాభాలు అందుకుంది. ఇప్పుడు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.

ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో (The Great Pre-Wedding Show)
తిరువీర్,టీనా శ్రావ్య ప్రధాన పాత్రల్లో రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిన్న సినిమా ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో. ఈ చిన్న సినిమాకు భారీ స్పందన వచ్చింది. మౌత్‌ టాక్ తో పెద్ద హిట్ గా నిలిచింది. పెద్దగా ప్రమోషన్స్ లేకుండానే థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ కామెడీ ఎంటర్టైనర్ ఇప్పుడు జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.

డియస్ ఈరే (Deus Era)
మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ హీరోగా నటించిన ఈ మిస్టీరియస్ హారర్ థ్రిల్లర్ డియస్ ఈరే. ఈమూవీ రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో రూపొందింది. అక్టోబర్‌లో విడుదలైన ఈ చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 80 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బంపర్ హిట్ అయింది. ఇప్పుడు ఇది డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో స్ట్రీమింగ్ అవుతోంది.

జటాధర (Jatadhara)

టాలీవుడ్ హీరో సుధీర్ బాబు, బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా, శిల్పా శిరోద్కర్ ముఖ్యపాత్రల్లో నటించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ ' జటాధర'. ఈ మూవీ థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మిశ్రమ స్పందనతో మొదలై బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది.

Bigg Boss 9 Telugu 13th Week Voting: ఓటింగ్‌లో అనూహ్య పరిణామం.. రీతూకు ఎదురుదెబ్బ.. ఈ వారం ఎలిమినేట్ ఎవరు?
థామా (Thama)
రష్మిక మందన్న-ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ హరర్-ఫ్యాంటసీ డ్రామా థామా(Thama).ఈ మూవీకి ఆదిత్య సర్పోదర్ దర్శకత్వం వహించాడు. దినేశ్ విజన్, అమర్ కౌశిక్ నిర్మాణంలో వచ్చిన ఈ మూవీ అక్టోబర్ 21న విడుదలై బాక్సాఫీస్ వద్ద రూ. 210 కోట్ల భారీ కలెక్షన్‌తో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కంటెంట్‌కు విశేష ప్రశంసలు రావడంతో ఓటీటీ రిలీజ్‌పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో 'థామా' డిసెంబర్ 2 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంటల్ మోడ్‌లో అందుబాటులోకి వచ్చింది. అయితే ఇది కొంతమందికే వీక్షణ అవకాశాన్ని ఇచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. ఇక అన్ని సబ్‌స్క్రైబర్ల కోసం ఫ్రీ ఓటీటీ స్ట్రీమింగ్ డిసెంబర్ 16 నుంచి ప్రారంభం కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X