Saindhav OTT: నెల తిరక్కముందే ఓటీటీలోకి వచ్చేస్తున్న సైంధవ్, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
విక్టర్ వెంకటేష్ హీరోగా తాజాగా వచ్చిన సినిమా సైంధవ్ గురించి అందరికీ తెలిసిందే. అద్బుతమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13వ తేదీన విడుదల అయింది. అయితే భారీ అంచనాల మధ్య విడుదల అయిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టుకోలేకపోతుంది. ముఖ్యంగా మిక్స్డ్ టాక్ రావడం.. హనుమాన్, గుంటూరు కారం వంటి సినిమాలకు పాజిటివ్ టాక్ రావడంతో అంతా ఆ సినిమాలనే చూస్తున్నారు. దీంతో నెల తిరక్కముందే ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయాలని చూస్తున్నారట. పూర్తి వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.
హిట్ ఫ్రాంచైజీ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ నటించిన చిత్రమే 'సైంధవ్'. ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయినపల్లి దీన్ని నిర్మించగా... బాలీవుడ్ స్టార్ నవాజుద్దీన్ సిద్దిఖీ కీలక పాత్రను పోషించారు. అలాగే వెంకీ మామ సనరసన శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా చేయగా.. ఆండ్రియా జెర్మియా, రుహానీ శర్మ, ఆర్య, జయప్రకాశ్, బేబీ సారాలు కీలక పాత్రల్లో కనిపించారు. అలాగే సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం అందించారు.

క్రేజీ కాంబినేషన్‌లో ఎవరూ టచ్ చేయని పాయింట్ తో వచ్చిన ఈ సినిమాకు మొదటి నుంచి మంచి బజ్ యే వచ్చింది. అయితే ఎంతో హైప్ నడుమ తెలుగుతో పాటు కన్నడ, మలయాళ, హిందీ, తమిళ భాషల్లో విడుదల అయింది. అయితే ఈ 'సైంధవ్' మూవీకి ప్రీమియర్స్ నుంచే మిక్స్డ్ టాక్ రావడంతో ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టుకోలేకపోతుంది. ముఖ్యంగా హనుమాన్ కు విపరీతమైన హైప్ రావడం, గుంటూరు కారం, నా సామి రంగా వంటి సినిమాలకు కూడా మరింత మంది వెళ్తుండడంతో ఈ సినిమాకు వచ్చే వారి సంఖ్య తగ్గింది.

అయితే జనవరి 13వ విడుదల అయిన ఈ సినిమా నెల రోజులు కూడా కాకముందే ఓటీటీలోకి రాబోతుంది. ఇప్పటికే సలార్ నెల రోజులు తిరక్కముందే ఓటీటీలోకి వచ్చి సందడి చేయగా.. ఇప్పుడ సైంధవ్ కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే 15 కోట్ల రూపాయలకు ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. అయితే ఫిబ్రవరి 2వ తేదీ నుంచి లేదంటే ఫిబ్రవరి 9వ తేదీ నుంచి ఈ సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోందట. చూడాలి మరి ఎప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చి ఓటీటీ ప్రియులను అలరిస్తుందో.


Click it and Unblock the Notifications











