Fact Check: తమిళ నేలపై జనసేన.. చక్రం తిప్పబోతున్న పవన్ కల్యాణ్.. నిజం ఏమిటంటే?

తెలుగు రాష్ట్రాల్లో సినిమా నుంచి రాజకీయాల్లోకి వచ్చిన రాజకీయ నాయకులు పలువురు కనిపిస్తారు. కాగా ఈ రాజకీయ నాయకుల్లో ప్రస్తుతం సక్సెస్ ఫుల్ హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని కూడా చెప్పవచ్చు. కాగా పవన్ కళ్యాణ్ ఏపీ అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో రెండు చోట్లా కూడా పార్టీని స్థాపించినప్పటికీ తన ఫుల్ ఫోకస్ మాత్రం ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంది.

కాగా పవన్ కళ్యాణ్ ఇక్కడ పదేళ్ల తర్వాత ఎమ్మెల్యేగా గెలిచి ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు. కాగా గత ఏడాది 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ కేవలం లోకల్ లీడర్ కాకుండా పాన్ ఇండియా లీడర్ అయ్యారు. ఇలా పలు పక్క రాష్ట్రాల్లో కూడా పవన్ కళ్యాణ్ వెళ్లి ప్రచారం చేయడం ఇంట్రెస్టింగ్ గా ఆ నార్త్ రాష్ట్రాల్లో పవన్ ప్రచారం చేసిన అన్ని చోట్లా అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందడం అనేది జరిగింది.

మెగాస్టార్ ను చూసి నాగార్జున వణికిపోయిన సందర్భం.. ఏఎన్ఆర్ చెప్పడంతో!

pawan kalyan

పైగా కొన్ని చోట్ల అయితే అప్పటికే ఎన్నో ఏళ్ళు పాతుకుపోయిన జెండా తీసి పవన్ ప్రచారం చేసిన పార్టీ జెండా పాతడం జరిగింది. పైగా దేశ ప్రధాని సైతం పవన్ ని ఒక తుఫాన్ గా పరిగణించడం వంటివి పవన్ ఇమేజ్ నేషనల్ పాలిటిక్స్ లో ఎలా ఉందో అర్ధం అయ్యింది. కాగా వీటితో పవన్ నేషనల్ పాలిటిక్స్ లో కూడా చక్రం తిప్పుతారు అని చాలా మంది అనుకున్నారు.

కానీ లేటెస్ట్ గా పవన్ విషయంలో ఒక షాకింగ్ టాక్ సోషల్ మీడియాలో ఇంకొన్ని డిజిటల్ మీడియా వర్గాల్లో కూడా చక్కర్లు కొడుతోంది. ఆ మధ్య సనాతన ధర్మం విషయంలో తమిళనాడు ప్రముఖ హీరో, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ కే తాను సవాలు విసిరారు. ఇక్కడ నుంచి తమిళనాట రాజకీయాల అంశంలో కొంచెం సీరియస్ గానే ఉన్న పవన్ ఇటీవల తమిళ టీవీకి ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది.

అయితే ఇక్కడ అసలు సమస్య స్టార్ట్ అయ్యింది. పవన్ కళ్యాణ్ తమిళనాడులో కూడా తన జనసేన పార్టీ విస్తరించనున్నారనే టాక్ ని పవన్ కి వ్యతిరేకంగా ఉండే కొన్ని అను'కుల' మీడియాలు వెంటనే ప్రచారం చేసేశాయి. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏమిటంటే అసలు పవన్ కళ్యాణ్ ఆ ఇంటర్వ్యూలో తాను తమిళనాట పార్టీ పెడతాను అని చెప్పిన మాటే లేదట.

దీనితో పవన్ కళ్యాణ్ విషయంలో ఇలాంటి విష ప్రచారాలు చేస్తున్నారని పవన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ అలా అన్నట్టు చూపించాలని ప్రూఫ్స్ పెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే జనసేన సోషల్ మీడియా వారు కూడా తనపై వస్తున్న ఆ వార్తలు ఫేక్ అని ఖండిస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ ఇలా తమిళనాట పార్టీ పెడుతున్నారు అనే మాటలో మాత్రం ఎలాంటి నిజం లేదని చెప్పవచ్చు. ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడు భారీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. వాటిలో హరిహర వీరమల్లు సినిమా ఈ మే 9న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతోంది.

Take a Poll

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X