Allu Arjun Review on Dhurandhar 2: ధురంధర్ 2పై అల్లు అర్జున్ రివ్యూ.. రణ్‌వీర్ మూవీకి బన్నీ రేటింగ్ ఇదే!
ఆదిత్య ధర్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన మూవీ ధురంధర్: ది రివెంజ్ (ధురంధర్ 2). గతేడాది వచ్చిన ధురంధర్‌కు సీక్వెల్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. ఉగాది, రంజాన్, గుడి పర్వా పండుగల కానుకగా మార్చి 19న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో ధురంధర్ 2 విడుదలైంది. అయితే మార్చి 18 సాయంత్రం 5 గంటల నుంచే దేశవ్యాప్తంగా ధురంధర్ 2కు ప్రీమియర్ షోలు పడ్డాయి. సామాన్యులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా పెయిడ్ ప్రీమియర్స్‌ను వీక్షించి సోషల్ మీడియాలో ధురంధర్ 2 గురించి తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ .. ధురంధర్ 2 ప్రీమియర్స్‌ను వీక్షించి తనదైన శైలిలో రివ్యూ ఇచ్చారు. ఈ వివరాల్లోకి వెళితే..
Ustaad Bhagat Singh Public Talk: ఉస్తాద్ భగత్ సింగ్ పబ్లిక్ టాక్.. పవన్ కళ్యాణ్ సినిమా ఎలా ఉందంటే?
జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్‌పై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండేలు సంయుక్తంగా ధురంధర్ 2 చిత్రాన్ని నిర్మించారు. రణ్‌వీర్ సింగ్, సారా అర్జున్‌లు హీరో హీరోయిన్‌లుగా నటించారు. అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్ మాధవన్, రాకేష్ బేడీ, సౌమ్య టాండన్, గౌరవ్ గెరా, మానవ్ గోహిల్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. వికాస్ నౌలఖ సినిమాటోగ్రాఫర్‌గా, శివకుమార్ వి పానికర్ ఎడిటర్‌గా సేవలందించారు. శాశ్వత్ సచ్‌దేవ్ సంగీత దర్శకత్వం వహించారు.

గతేడాది వచ్చిన ధురంధర్ 2ను కేవలం హిందీ వెర్షన్‌లో మాత్రమే విడుదల చేశారు. అయితే ఈసారి ఆ తప్పు చేయకుండా దక్షిణాది భాషల్లోనూ ధురంధర్ 2ను విడుదల చేశారు మేకర్స్. టీజర్, ట్రైలర్లకు తోడు ధురంధర్ ఘన విజయం నేపథ్యంలో దక్షిణాది ప్రేక్షకులు కూడా ఈసారి ధురంధర్ 2 కోసం ఎగబడ్డారు. నార్త్‌తో సమానంగా ఇక్కడా అడ్వాన్స్ బుకింగ్‌లో భారీ రెస్పాన్స్ అందుకున్నారు రణ్‌వీర్ సింగ్. మార్చి 18వ తేదీ సాయంత్రం 5 గంటలకు తెలుగు, తమిళ ప్రేక్షకులు ప్రీమియర్స్ కోసం వెయిట్ చేస్తుండగా చిత్ర యూనిట్ షాకిచ్చింది. సాంకేతిక కారణాలతో తెలుగు, తమిళ భాషల్లో ధురంధర్ 2 ప్రీమియర్స్‌ను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. రాత్రి 9 గంటలకు తెలుగు, తమిళంలో ప్రీమియర్స్‌ను ప్రదర్శిస్తామని వెల్లడించింది. దాంతో చాలామంది ప్రేక్షకులు నిరాశపడ్డారు. అయితే ధురంధర్ 2పై ఉన్న అంచనాల నేపథ్యంలో హిందీ వెర్షన్ అయినా సరే అందరికంటే ముందే సినిమా చూసేయాలని టికెట్స్ బుక్ చేసుకున్నారు అభిమానులు.
ఇకపోతే.. ధురంధర్ 2 అల్లు కుటుంబానికి ప్రత్యేకంగా నిలవనుంది. అల్లు అరవింద్ యాజమాన్యంలో ఇటీవల కోకాపేటలో అల్లు సినిమాస్ థియేటర్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. తెలంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిరోజుల క్రితం లాంఛనంగా ఈ భారీ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన డాల్బీ స్క్రీన్ ... ఆసియాలోనే అతిపెద్దది. తెలుగు రాష్ట్రాలలో నిర్మితమైన తొలి డాల్బీ థియేటర్ ఇదే.. అలాగే ధేశంలో మూడోది. ఏకంగా 75 అడుగుల డీసీఐ ఫ్లాట్ స్క్రీన్‌ను ఈ థియేటర్‌లో ఏర్పాటు చేశారు. ఈ స్క్రీన్‌లోని సీటింగ్ సామర్ధ్యం 644. రణ్‌వీర్ నటించిన ధురంధర్ 2 ద్వారా అల్లు సినిమాస్ ప్రారంభం అవుతుందని ముందే ప్రకటించారు
దాంతో తన కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి ధురంధర్ 2ని అల్లు సినిమాస్‌లో వీక్షించారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అనంతరం ఈ సినిమాపై బన్నీ రివ్యూ ఇస్తూ ట్వీట్ చేశారు. దేశభక్తి, స్వాగ్‌తో నిండిన ధురంధర్ 2ని ఇప్పుడే చూశాను. ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేసింది. ఈ మూవీలో చప్పట్లు కొట్టించే సీన్స్ ఎన్నో ఉన్నాయి. బ్రదర్ రణ్‌వీర్ సింగ్ లాంటి అద్భుతమైన నటుడు మనదేశంలో ఉండటం గర్వంగా ఉంది. ఫైర్ అనే పదానికి రణ్‌వీర్ నిర్వచనంలో నిలిచారు. మాధవన్‌తో పాటు మిగిలిన నటీనటులు బాగా నటించారు. ఆదిత్య ధర్ అద్భుతమైన ఫిలిం మేకర్.. మరోసారి ఆయన హిట్ కొట్టారు. అలాంటి దర్శకుడు మన దేశంలో ఉన్నందుకు గర్వంగా ఉంది. ధురంధర్ 2 అనేది ఇంటర్నేషనల్ స్వాగ్‌తో తీసిన భారతీయ కథ. జై హింద్ అంటూ అల్లు అర్జున్ ముగించారు. ప్రస్తుతం అల్లు అర్జున్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications
















