Bhooth Bangla Twitter Review: భూత్ బంగ్లా ట్విట్టర్ రివ్యూ.. అక్షయ్ కుమార్ మూవీ ఎలా ఉందంటే?

Bhooth Bangla Twitter Review: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, సీనియర్ నటి టబు జంటగా నటించిన ఫ్యాంటసీ హారర్ కామెడీ మూవీ భూత్ బంగ్లా (Bhooth Bangla). ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వమికా గబ్బి, పరేష్ రావల్, రాజ్‌పాల్ యాదవ్, జిషు సేన్ గుప్తా, మనోజ్ జోషి, అస్రానీ, రాజేశ్ శర్మ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటించారు. బాలాజీ మోషన్ పిక్చర్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌లపై ఈ ఏక్తా కపూర్, శోభా కపూర్, అక్షయ్ కుమార్ కలిసి నిర్మించారు. ఫరా షేక్, వేదాంత్ బాలి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా స్టోరీ ఆకాష్ ఏ కౌశిక్ అందించారు, స్క్రీన్‌ప్లేను రోహన్ శంకర్, అభిలాష్ నాయర్, ప్రియదర్శన్ కలిసి రాశారు. డైలాగ్స్‌ను రోహన్ శంకర్ రూపొందించారు.

టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే, సినిమాటోగ్రఫీని దివాకర్ మణి, ఎడిటింగ్‌ను ఎంఎస్ అయ్యప్పన్ నాయర్ నిర్వహించారు, సంగీతాన్ని ప్రీతమ్ అందించారు. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే.. అక్షయ్ కుమార్ - ప్రియదర్శన్ కాంబినేషన్ దాదాపు 14 సంవత్సరాల తర్వాత మళ్లీ కలవడం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారింది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన కామెడీ సినిమాలు ఎంతటి విజయాన్ని అందుకున్నాయో తెలిసిందే. ఇప్పుడు అదే మేజిక్‌ను మళ్లీ రిపీట్ చేస్తారనే అంచనాలు అభిమానుల్లో భారీగా ఉన్నాయి. కామెడీ, హారర్, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో రూపొందించబడిన ఈ భూత్ బంగ్లా సినిమా ఏప్రిల్ 17న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానునది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్లు ఏప్రిల్ 16 తేదీ రాత్రి ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో నెటిజన్లు, క్రిటిక్స్, సినీ ప్రముఖుల అభిప్రాయాల్లోకి వెళితే..

Bhooth Bangla Movie Twitter Review in Telugu  Akshay Kumar-Priyadarshan Combo Hits the bulls eye

ఓ మూవీ లవర్ భూత్ బంగ్లా సినిమాకు 4 స్టార్ రేటింగ్ ఇస్తూ "అక్షయ్ కుమార్ మళ్లీ తన కామెడీ మ్యాజిక్ చూపించాడు" అని ప్రశంసించారు. "కామెడీ కింగ్ తిరిగి వచ్చాడు" అంటూ ఆయన నటనపై ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. ముఖ్యంగా "హారర్ + కామెడీ మిక్స్ చాలా ఫన్‌గా ఉంది", "ప్రియదర్శన్ సిగ్నేచర్ కయాస్ మళ్లీ కనిపించింది", "అక్షయ్ కుమార్ ఈజీ హ్యూమర్ సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లింది" అని కామెంట్ చేశారు. సినిమా మొత్తం కామెడీ, థ్రిల్, ఎంటర్టైన్మెంట్‌తో నిండిన ప్యాకేజ్‌గా ఉందని పేర్కొన్నారు.

'అర్జెంట్‌గా పెళ్లి చేసుకోవాలనిపిస్తోంది'.. సుడిగాలి సుధీర్‌కి స్టార్ యాంకర్ ప్రపోజల్‌!
మరో సినీ అభిమాని ఈ సినిమాకు 3.5 స్టార్ రేటింగ్ ఇస్తూ "MADCAP ఎంటర్టైనర్"గా అభివర్ణించాడు. ముఖ్యంగా ప్రియదర్శన్ స్టైల్ కామెడీ, అక్షయ్ కుమార్ టైమింగ్ కలిసి పాత రోజుల్ని గుర్తు చేసే నాస్టాల్జిక్ ఫీల్ ఇస్తాయని పేర్కొన్నాడు. రివ్యూ ప్రకారం.. సినిమా ఫస్ట్ హాఫ్ పూర్తిగా సిట్యుయేషనల్ కామెడీ, అపార్థాలు, గందరగోళ సన్నివేశాలతో ఆకట్టుకుంటుంది. ప్రియదర్శన్ ట్రేడ్‌మార్క్ కయాస్, హాస్యంతో మొదటి భాగం బాగా వర్కౌట్ అయ్యిందని, ఇంటర్వెల్ బ్లాక్ కూడా హైలైట్‌గా నిలిచిందని అభిప్రాయపడ్డాడు. అయితే సెకండ్ హాఫ్‌లో హారర్ ఎలిమెంట్స్ ఎక్కువగా ప్రాధాన్యం దక్కడంతో, సినిమా కొంత గ్రిప్ కోల్పోయిందని చెప్పాడు. ఇప్పటికే చూసిన హారర్ కామెడీ సినిమాలను గుర్తు చేసేలా "డేజావూ ఫీల్" వస్తుందని, ఎడిటింగ్ ఇంకాస్త టైట్‌గా ఉండాల్సిందని సూచించాడు. అయినప్పటికీ విజువల్స్ రిచ్‌గా ఉండటం, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సన్నివేశాలను బాగా ఎలివేట్ చేయడం ప్లస్ పాయింట్స్‌గా పేర్కొన్నాడు.

నటీనటుల విషయానికి వస్తే, అక్షయ్ కుమార్ తన కామెడీ టైమింగ్‌తో సినిమాను భుజాలపై మోసినట్లు ఈ అభిమాని అభిప్రాయపడ్డాడు. ఎమోషనల్ సీన్స్‌లో కూడా తన వెర్సటిలిటీ చూపించాడని ప్రశంసించాడు. పరేశ్ రావల్ ఎప్పటిలాగే తన పాత్రలో నమ్మకంగా మెరిసాడని, ఆశ్రానీ నటన సినిమాకు నాస్టాల్జిక్ టచ్ ఇచ్చిందని పేర్కొన్నాడు. ఇక రాజ్ పాల్ యాదవ్ కామెడీ సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలిచిందని, అతని డైలాగ్స్, టైమింగ్ ప్రేక్షకులను నవ్విస్తాయని చెప్పాడు.టాబు స్క్రీన్ టైమ్ తక్కువైనా ఆసక్తిని పెంచేలా ఉందని, వామికా గబ్బి ట్రాక్ కొంత బలహీనంగా అనిపించిందని అభిప్రాయపడ్డాడు. మిథిలా పాల్కర్, జిషు సేన్‌గుప్తా, రాజేశ్ శర్మ, మనోజ్ జోషి వంటి సహాయ నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారని పేర్కొన్నాడు. ఈ సినిమా "డీసెంట్ ఎంటర్టైనర్"గా నిలుస్తుందని, నాస్టాల్జిక్ ఫన్ కోరుకునే వారికి తప్పక నచ్చుతుందని పేర్కొన్నాడు.

భూత్ బంగ్లా నిజంగా నాస్టాల్జిక్ ఫీల్‌ను మళ్లీ గుర్తు చేస్తున్నాదని ఓ నెటిజన్ అభిప్రాయపడ్డారు. హారర్, కామెడీ ఎలిమెంట్స్‌ను మిక్స్డ్ మూవీగా తెరకెక్కిందనీ, ఈ సినిమా కామెడీ, హర్రర్ ఎంటర్టైనర్ గా ముందుకు సాగుతుందని తెలిపారు. ముఖ్యంగా పాత తరహా ఎంటర్టైన్మెంట్‌ను మిస్ అవుతున్న ప్రేక్షకులకు ఇది మంచి ఫ్యాన్ రైడ్‌గా అనిపిస్తుందని అభిప్రాయపడ్డారు. మొత్తానికి స్పూకీ టచ్‌తో పాటు సిల్లీ కామెడీ కలిపిన ఈ సినిమా పూర్తి స్థాయి ఎంటర్టైనర్‌గా నిలుస్తోందని, ఈ సినిమాకు 3.5/5 రేటింగ్‌ అందించారు.

మరో సినీ అభిమాని ఈ సినిమాపై తన రివ్య్వూ ఇస్తూ. దర్శకుడు ప్రియదర్శన్ తన రూట్స్‌కు తిరిగి వచ్చి భూత్ బంగ్లా ను హారర్-కామెడీ మ్యాజిక్ చూపించినట్లు ఉంది. సుమారు 165 నిమిషాల పాటు సాగిన ఈ మూవీ కామెడీతో పాటు డార్క్, స్పూకీ ఎలిమెంట్స్ ఎంటర్టైన్ చేసింది. ఫస్ట్ హాఫ్ పూర్తిగా లాఫ్టర్ రైడ్‌లా సాగుతుండగా, సెకండ్ హాఫ్‌లో మరింత స్ట్రాంగ్ స్టోరీతో కొనసాగింది. అక్షయ్ కుమార్ తన కామెడీ టైమింగ్‌తో మరోసారి ఆకట్టుకోగా, పరేష్ రావల్, రాజ్‌పాల్ యాదవ్ తమ కామెడి టైమింగ్ సినిమాకు అదనపు బలం అని పేర్కొన్నారు.

అలాగే.. విజువల్స్, VFX క్వాలిటీ బాగా ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా హైలైట్‌గా నిలిచింది. 'రామ్జీ ఆకే భలా కరేంగే' పాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అయితే సినిమా రన్‌టైమ్ కొంచెం ఎక్కువగా ఉండటం మైనస్‌గా మారింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో కథనం కాస్త క్లిష్టంగా అనిపించడం, అలాగే టబు, వామికా గబ్బి, మిథిలా పాల్కర్ పాత్రలను పూర్తిగా ఉపయోగించకపోవడం నిరాశ కలిగిస్తుంది. మొత్తానికి, కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి, నాస్టాల్జిక్ ఫీల్‌తో పాటు హారర్-కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఇష్టపడేవారికి భూత్ బంగ్లా ఒక మంచి ఫన్ రైడ్‌గా నిలుస్తుంది. ఈ సినిమాకు తాను 3 రెటింగ్ ఇస్తున్నట్టు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X