Double Ismart Review: డబుల్ ఇస్మార్ట్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating: 2.75/5

నటీనటులు: రామ్ పోతినేని, సంజయ్ దత్, కావ్య థాపర్, అలీ, గెటప్ శ్రీను తదితరులు.
రచన, దర్శకత్వం: పూరి జగన్నాధ్
నిర్మాతలు: పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్
బ్యానర్: పూరి కనెక్ట్స్
వరల్డ్ వైడ్ రిలీజ్: ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ (నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి)
సీఈఓ: విషు రెడ్డి
సంగీతం: మణి శర్మ
సినిమాటోగ్రఫీ: సామ్ కె నాయుడు, జియాని జియాన్నెలి
స్టంట్ డైరెక్టర్: కేచ, రియల్ సతీష్
రిలీజ్ డేట్: 2024-08-15

ఇంటర్నేషనల్ గ్యాంగ్‌స్టర్ బిగ్ బుల్ (సంజయ్ దత్) ఇండియాతోపాటు ఇతర దేశాల్లో డ్రగ్స్, ఇతర మాఫియా వ్యవహారాలను లండన్ నుంచి కంట్రోల్ చేస్తుంటాడు. అయితే అనూహ్యంగా ఆయనకు బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి సోకడంతో 3 నెలల్లో చనిపోతావని చెప్పడంతో తన చావు ఉండకూడదని నిర్ణయించుకొంటాడు. ఆ క్రమంలో వైద్యులను సంప్రదిస్తే..మెమొరీ ట్రాన్స్‌ఫర్ వల్ల సాధ్యమని చెబుతారు. దాంతో తన పర్సనాలిటికి తగిన వ్యక్తి వెతికే క్రమంలో హైదరాబాద్‌లోని ఇస్మార్ట్ శంకర్‌ను గుర్తిస్తారు. చివరిరకి ఇస్మార్ట్ శంకర్‌కు బిగ్ బుల్‌ మెమొరీ ట్రాన్స్ ఫర్ చేస్తారు.

Double Ismart Review in Telugu  Ram Pothineni s double Mass Entertainer

ఇస్మార్ట్ శంకర్‌ను బిగ్ బుల్ గ్యాంగ్ ఎందుకు టార్గెట్ చేశారు. మెమొరీ ట్రాన్స్‌ఫర్‌ను ఏ పరిస్థితుల్లో శంకర్ ఒప్పుకొన్నాడు? మెమొరీ ట్రాన్స్‌ఫర్ తర్వాత శంకర్‌కు ఏం జరిగింది? శంకర్ పన్నిన ప్లాన్‌లో బిగ్ బుల్ ఎలా ఇరుక్కొన్నాడు? దేశాన్ని దక్షిణాది, ఉత్దరాది ప్రాంతాలుగా విడగొట్టాలని బిగ్ బుల్ చేసిన ప్లాన్స్ ఏమిటి? శంకర్, బిగ్ బుల్ మెమొరీని ఎలా మెనేజ్ ఎలా మేనేజ్ చేశాడు? రా ఏజెన్సీ ఎందుకు ఇస్మార్ట్ కోసం గాలించింది? జెన్నత్ (కావ్య థాపర్)తో లవ్ ట్రాక్ ఎలా సాగింది? మెమొరీ ట్రాన్స్‌ఫర్ తర్వాత శంకర్‌ను కాపాడుకొనేందుకు జెన్నత్ ఎలా ప్రయత్నించింది? అసలు జెన్నత్ ఎవరు? ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు జెన్నత్ ఎందుకు వచ్చింది? అనే ప్రశ్నలకు సమాధానమే డబుల్ ఇస్మార్ట్ సినిమా కథ.

పోశమ్మ (ఝాన్సీ), శంకర్ తల్లి కొడుకుల సెంటిమెంట్‌తో కథను ఎమోషనల్‌గా మొదలు పెట్టిన పూరీ జగన్నాథ్.. వెంటనే సంజయ్ దత్ బిగ్ బుల్ పాత్రను ఎంట్రీ చేసి.. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్లడం వరకు బాగుంది. ఒకసారి ఇస్మార్ శంకర్, జెన్నత్ క్యారెక్టర్ల పరిచయం చేసి ఆ క్యారెక్టర్ల మధ్య కెమిస్ట్రీని బాగానే పండించాడు. కథ సరైన ట్రాక్‌లో వెళ్తుందని భావిస్తున్న తరుణంలో బొక్క (ఆలీ) క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేసి అప్పటి వరకు గ్రిప్పింగ్‌గా సాగుతున్న స్టోరీని స్పాయిల్ చేశారనే ఫీలింగ్‌ను కలిగించాడు. శంకర్, బిగ్ బుల్ ఎపిసోడ్స్ బాగానే ఉన్నాయనిపించినా.. మధ్య మధ్యలో ఆలీ వచ్చి సినిమా ఫ్లేవర్‌ను నాశనం చేశాడనిపిస్తుంది.

ఇక ఇస్మార్ట్ శంకర్‌గా రామ్ పోతినేని మరోసారి క్యారెక్టర్‌లోకి చక్కగా ఒదిగిపోయి డబుల్ మాస్‌ను అందించారు. బాడీ లాంగ్వేజ్, క్యారెక్టర్ యాటిట్యూడ్‌ను పర్‌ఫెక్ట్‌గా కొనసాగించాడు. కొన్ని సన్నివేశాల్లో ఊరమాస్ ఎలిమెంట్స్‌తో చెలరేగిపోయాడనే చెప్పాలి. ఎలాంటి క్యారెక్టర్‌లోనే ఫుల్లుగా ఇన్వాల్వ్ అవుతానని మరోసారి రామ్ నిరూపించుకొన్నాడు. ఇక కావ్య థాపర్ కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా ఫెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలో మెప్పించింది. ఇక బిగ్ బుల్‌గా సంజయ్ దత్ ఎప్పటిలానే తన ఫెర్ఫార్మెన్స్‌తో ఫైర్ అయ్యాడు. ఇంకా బెటర్‌గా ఆయన క్యారెక్టర్‌ను డిజైన్ చేసి ఉంటే బాగుండనిపిస్తుంది. ఆలీ బొక్క క్యారెక్టర్ గెటప్‌లో బాగా చేశాడు. లుక్, బాడీ లాంగ్వేజ్ బాగుంది. కానీ ఈ సినిమాకు ఆయన పాత్ర ఎలాంటి పరిస్థితుల్లోను సరిపోదనిపిస్తుంది. మిగితా పాత్రల్లో నటించిన వారంతా ఫర్వాలేదనిపించారు.

Double Ismart Review in Telugu  Ram Pothineni s double Mass Entertainer

ఇక సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. ఎప్పటిలానే మణిశర్మ తన మాస్ బీట్స్‌తో అల్లాడించాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. కానీ సన్నివేశాలే రొటీన్‌గా ఉన్నప్పటికీ.. వాటిని పూర్తిగా ఎలివేట్ చేసే ప్రయత్నంలో సఫలమయ్యాడు. శ్యామ్ కే నాయుడు, జియానీ సినిమాటోగ్రఫి బాగుంది. రియల్ సతీఫ్ కంపోజ్ చేసిన ఫైట్స్ బాగున్నాయి. ఎడిటింగ్ డిపార్ట్‌మెంట్‌కు ఇంకా స్కోప్ ఉంది. పూరి కనెక్ట్ బ్యానర్ తగినట్టుగా ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి.

తెలుగు సినిమా పరిశ్రమలో పాపులర్ క్యారెక్టర్లలో ఇస్మార్ట్ శంకర్ ఒకటి. ఆ క్యారెక్టర్‌కు చాలా మంది అభిమానులు ఉన్నారు. అలాంటి పాత్రతో రామ్ మరోసారి ఆకట్టుకొన్నాడు. కానీ కథలో దమ్ము లేదు. పూరీ జగన్నాథ్ టేకింగ్ పోకిరి, లోఫర్ వద్దే ఆగిపోయింది. నేటి జనరేషన్‌కు తగినట్టు తన పంథాను మార్చుకోకపోతే ఆయన మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాకు అలీ ట్రాక్ బ్యాడ్. ఆ విషయంలో కొంత ఎడిట్ చేస్తే సినిమా ఫ్లేవర్ మారే అవకాశం ఉంది. మాస్, పూరీ, రామ్ ఫ్యాన్స్‌కు ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. లాంగ్ వీకెండ్‌లో మాస్ సినిమా చూడాలంటే.. థియేటర్‌లో డబుల్ ఇస్మార్ట్ ఓ ఛాయిస్‌గా తీసుకోవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X