Double Ismart X Review: డబుల్ ఇస్మార్ట్ ట్విట్టర్ రివ్యూ. రామ్ పోతినేని హిట్ కొట్టాడా? పూరీకి ఎలాంటి ఫలితమంటే?
ఉస్తాద్ రామ్ పోతినేని, న్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం డబుల్ ఇస్మార్ట్. గతంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌గా ఈ సినిమా రాబోతున్నది. పూరీ కనెక్ట్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్ సంయుక్తంగా రూపొందించిన ఈ చిత్రం ఆగస్టు 15వ తేదీన రిలీజ్ అయింది.
ఈ సినిమా గురించి నెటిజన్లు ఎలాంటి ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. ట్విట్టర్‌లో కామెంట్స్ ఎలా ఉన్నాయనే వివరాల్లోకి వెళితే..

డబుల్ ఇస్మార్ట్ సినిమా చూశాను. పూరీ కనెక్ట్, రామ్ పోతినేనికి ఇది కమ్ బ్యాక్ మూవీ. హీరో రామ్ ఇచ్చిపడేశాడు. సంజయదత్ యాక్టింగ్ బాగుంది. కామెడీ టైమింగ్, బీజీఎం సినిమాలో ఎక్సలెంట్ అనిపించాయి అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
శంకర్‌గా రామ్ పోతినేని మాస్ ఎలిమెంట్స్‌తో ఇరుగదీశాడు. ఎనర్జీ వేరే లెవెల్‌లో ఉంది. పూరీ సార్‌కు కమ్ బ్యాక్ మూవీ. మాస్ డైలాగ్స్, సూపర్బ్ సాంగ్స్ ఉన్నాయి. మణిశర్మ బీజీఎం బాగుంది. యాక్షన్ సీన్లు టాప్ లెవెల్‌లో ఉన్నాయి. వర్త్ వాచ్ మూవీ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
ఇస్మార్ట్ శంకర్‌ను స్టైల్‌లోనే ఉంది. కానీ పూరీ జగన్నాథ్ బాగా తీశాడు. మీకు పార్ట్ 1 ఇస్మార్ట్ శంకర్ నచ్చితే నచ్చితే.. మీకు డబుల్ ఇస్మార్ట్ కూడా నచ్చుతుంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
డబుల్ ఇస్మార్ట్ చెత్త మూవీ, ఈ దశాబ్దంలోనే చెత్త మూవీ. ఈ సినిమా చూడకుండా వదిలేస్తే.. మనసుకు శాంతి. నా రివ్యూను మీ ఫ్రెండ్స్, స్నేహితులకు షేర్ చేయండి.. వారికి డబ్బులైనా మిగులతాయి అని ఓ నెటిజన్ దారుణంగా కామెంట్ చేశాడు.
రామ్ పోతినేని అభిమానులు హైదరాబాద్‌లో హంగామా చేయడానికి రెడీ అయ్యారు. సుదర్శన్‌లో ఉదయం 7 గంటలకు ప్రదర్శించే సినిమా కోసం అన్ని రకాలుగా సంసిద్దమైనట్టు ట్విట్టర్‌లో పూలు, కాగితాలు ఫోటోలను పెట్టారు.
యూఎస్ఏలో డబుల్ ఇస్మార్ట్ సినిమా ప్రీమియర్‌కు రెడీ అయ్యాం. మనకు తెలిసింది ఒకటే.. సినిమా.. సినిమా.. సినిమా.. పూరి కనెక్ట్స్‌కు ఆల్ ది బెస్ట్. చిచ్చా రామ్ పోతినేనికి ఆల్ ది బెస్ట్ అంటూ అభిమానులు ట్వీట్ చేశారు.
ఇస్మార్ట్ శంకర్ కంటే డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. రామ్ పోతినేని మాస్ మ్యాడ్ నెస్ ప్రారంభం కాబోతున్నది. తెర మీద రియల్ మ్యాడ్ నెస్ కోసం ఎదురు చూస్తున్నాం అని పోస్టు చేశారు.
బిగ్ స్క్రీన్‌లో నెవ్వర్ బిఫోర్ అనే విధంగా మైండ్ బ్లోయింగ్ విజువల్స్ చూస్తాం. రామ్ పోతినేని మెంటల్ మాస్ జాతర కోసం ఎదురు చూస్తున్నాం. శంకరుడి మాస్ తాండవానికి పూనకాలు గ్యారెంటీ అని అభిమానులు ట్వీట్లతో హోరెత్తిస్తున్నారు.


Click it and Unblock the Notifications











