Happy Ending Review న్యూ ఏజ్ రొమాంటిక్ లవ్ స్టోరి.. హ్యాపీ ఎండింగ్ మూవీ ఎలా ఉందంటే?

నటీనటులు: యష్ పూరి, అపూర్వ రావ్, అజయ్ ఘోష్, ఝాన్సీ, విష్ణు ఏఐ తదితరులు
కథ, దర్శకత్వం: కౌశిక్ భీమిడి
నిర్మాతలు: సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల, యోగేష్ కుమార్
మ్యూజిక్: రవి నిడమర్తి
సినిమాటోగ్రఫి: అశోక్ సీపల్లి
ఎడిటర్: ప్రదీప్ ఆర్ మోరమ్
బ్యానర్స్: హ్యామ్స్ టెక్, సిల్లిమాంక్స్ స్టూడియోస్
రిలీజ్ డేట్: 2024-02-02

బాల్యంలో దొంగ చాటుగా అడల్ట్ కంటెంట్‌ మూవీని చూడటానికి వెళ్లిన హర్ష్ (యష్ పూరి) థియేటర్‌లో రథేశ్వర్ స్వామి (అజయ్ ఘోష్) ఆగ్రహానికి గురి అవుతాడు. తనను అవహేళన చేసినందుకు హర్ష్‌ను స్వామీజీ శపిస్తాడు. జీవితంలో ఏ అమ్మాయినైనా శృంగారపరంగా, రొమాంటిక్‌గా ఊహించుకొంటే చనిపోతారు. నీవు జీవితాంతం నిగ్రహ శక్తితోనే బతకాలి అని స్వామిజీ శపిస్తాడు.

Happy Ending Movie Review

స్వామిజీ శాపంతో హర్ష్ ఎలాంటి అభద్రతా భావానికి గురయ్యాడు. శాపం తర్వాత యష్ జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకొన్నాయి. అడల్డ్ కంటెంట్ మూవీని ఎందుకు చూడాల్సి వచ్చింది? అడల్ట్ కంటెంట్ మూవీని చూడటానికి స్వామిజీ ఎందుకు వచ్చాడు? యష్ జీవితంలోకి అవని (అపూర్వ రావు) ప్రవేశించిన తర్వాత ఏం జరిగింది? అవనితో యష్ రొమాంటిక్ లైఫ్ ఎలా సాగింది? అవనితో పెళ్లి తర్వాత ఏం జరిగింది? యష్‌కు శాప విమోచనం జరిగిందా? అవని, యష్ వైవాహిక జీవితం ఎలా సాగింది అనే ప్రశ్నలకు సమాధానమే హ్యాపీ ఎండింగ్ (Happy Ending).

TFI Fans Cricket League ఉత్కంఠ భరిత పోరులో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ గెలుపు.. చేజారిన చిరు ఫ్యాన్స్ విజయం

హ్యపీ ఎండింగ్ ట్రైలర్ చూసిన తర్వాత అడల్డ్, బోల్డ్ కంటెంట్ ఉంటుందనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఈ సినిమా మాత్రం పక్కాగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. క్లీన్ అండ్ ఎమోషనల్ లవ్ స్టోరి. అయితే డైలాగ్ డ్రామా ఎక్కువ కావడం, బలమైన సన్నివేశాలు లేకపోవడం వల్ల చాలా స్లోగా, మొదటి ఫ్రేమ్ నుంచి క్లైమాక్స్ వరకు సింగిల్ పాయింట్ ఎజెండాతో సాగడం వల్ల కొన్నిసార్లు ప్రేక్షకుల సహనానికి పరీక్షలా ఉంటుంది. కానీ ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సీన్ వరకు కథలో కొంత వేగం పుంజుకొన్నట్టు అనిపిస్తుంది. కానీ అప్పటికే సినిమా జరిగిన డామేజ్ జరిగిపోయిందనిపిస్తుంది.

Happy Ending Review

దర్శకుడు కౌశిక్ ఎంచుకొన్న పాయింట్ బాగుంది. కానీ స్టోరీలో ఎమోషన్స్, రొమాన్స్ నింపడంలో తడబాటు స్పష్టంగా కనిపించింది. డైలాగ్స్ డ్రామా కాకుండా విజువల్ డ్రామాతోపాటు ఫన్, సెన్సిబుల్ రొమాన్స్‌తో సీన్లను డిజైన్ చేసి ఉంటే.. న్యూ ఏజ్ సినిమా అయి ఉండేదనే ఫీలింగ్ అనిపిస్తుంది. సినిమాను క్లీన్‌గా, హై స్టాండర్ట్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో అనిల్, సంజయ్ రెడ్డి, యోగేష్ నిర్మించారు.

ఇక నటీనటులు విషయానికి వస్తే.. కొత్తవారైనా యష్, అపూర్వ రావ్ మెచ్యురిటీతో ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు. డిఫరెంట్ ఎమోషన్స్, వేరియేషన్స్‌తో యష్ ఆకట్టుకొన్నాడు. సన్నివేశాల్లో స్కోప్, కంటెంట్ లేకపోవడం యష్ తన ప్రతిభను చాటుకోలేక పోయాడనిపిస్తుంది.

ఇక అపూర్వ రావు పక్కింటి అమ్మాయిలా తన పాత్రలో ఒదిగిపోయింది. ఎమోషనల్ సీన్లలో ఆకట్టుకొన్నది. పర్‌ఫెక్ట్ రోల్ పడితే.. టాలెంట్‌ను ప్రూవ్ చేసుకొనే సత్తా ఉందని అవని పాత్ర ద్వారా చూపించింది. గ్లామర్, నటన పరంగా తన పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించింది. మిగితా పాత్రల్లో నటించిన వారు ఒకే అనిపించుకొన్నారు.

Happy Ending Review and Rating

యూత్‌ఫుల్ పాయింట్‌తో న్యూ ఏజ్ సినిమాగా, కొత్త రకం స్క్రీన్ ప్లేతో రూపొందించిన చిత్రం హ్యాపీ ఎండింగ్. కానీ సన్నివేశాలు సాగదీసినట్టుగా నిదానంగా సాగినట్టుగా ఉంటాయి. కథలో వేరియేషన్ లేకపోవడం వల్ల సింగిల్ పాయింట్‌పై రన్ కావడం వల్ల అంతకు మించి చెప్పలేకపోయారనే ఫిలింగ్ కలుగుతుంది. స్లోగా, సెన్సిబుల్ రొమాంటిక్ సినిమాలు చూసే వారికి ఈ సినిమా నచ్చడానికి అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X