ఇస్మార్ట్ శంకర్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Recommended Video

#ismartshankar : Ismart Shankar Movie Review And Rating || Filmibeat Telugu

Rating:
2.5/5
Star Cast: రామ్ పోతినేని, నభా నటేష్, నిధి అగర్వాల్, సత్యదేవ్ కంచరాన, గెటప్ శ్రీను
Director: పూరి జగన్నాధ్

టాలీవుడ్‌లో సరికొత్త కాంబినేషన్‌కు తెర తీసిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమాకు ముందు పూరీ జగన్నాథ్ చిత్రాలు ప్రేక్షకాదరణకు నోచుకోలేకపోయాయి. దాంతో హీరో రామ్‌తో కలిసి పోకిరి తరహాలో పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌కు అంకురార్పణ చేశాడు. మొదటి నుంచి తనదైన శైలిలో ప్రమోషన్‌కు తెర తీశాడు. టీజర్లు, ట్రైలర్లు రిలీజ్ తర్వాత పూరీ జగన్నాథ్ ట్రాక్ ఎక్కినట్టే కనిపించాడు. ఇలాంటి అంశాల నేపథ్యంలో ఇస్మార్ట్ శంకర్ చిత్రం జూలై 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం పూరీ జగన్నాథ్, రామ్ కాంబినేషన్‌కు జైకొట్టేలా ఉందా? పూరీ మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడా? మాస్ ఎలిమింట్స్ మధ్య రామ్ పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలకు ఇస్మార్ట్ శంకర్ ఎలా ఉందో తెలుసుకోవాల్సిందే.

ఇస్మార్ట్‌గా శంకర్ కథ

ఇస్మార్ట్‌గా శంకర్ కథ

హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఇస్మార్ట్ శంకర్ ( రామ్ పోతినేని) కిరాయి రౌడీ. కాశీనాథ్ (పూనిత్ ఇస్సార్) హత్యకేసులో శిక్ష అనుభవిస్తూ జైలు నుంచి తప్పించుకొంటాడు. తన ప్రేయసి చాందినీ (నభ నటేష్) మరణానికి కారణమైన, తనను జైలుకు పంపేందుకు కుట్ర చేసిన వ్యక్తి ఎవరనే విషయంపై వెంటాడుతుంటాడు. ఇదే హత్య కేసులో విచారణ జరుపుతున్న సీబీఐ అధికారి అరుణ్ (సత్యదేవ్) ఎన్‌కౌంటర్‌లో మరణిస్తాడు. అతని విచారణకు సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి మెమరీ ట్రాన్స్‌ఫర్ అనే వైద్య ప్రక్రియకు పూనుకొంటారు. దాంతో ఇస్మార్ట్ శంకర్ దేహాన్ని వాడుకొని, బ్రెయిన్‌లో చిప్ సెట్ చేస్తారు?

శంకర్ స్టోరీలో ఇస్మార్ట్ ట్విస్టులు

శంకర్ స్టోరీలో ఇస్మార్ట్ ట్విస్టులు

అరుణ్ మెమోరీస్ ‌ట్రాన్స్‌ఫర్ విషయంలో వైద్య చికిత్స సఫలమైందా? ఈ వైద్య చికిత్స వల్ల ఇస్మార్ట్ శంకర్‌కు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి?. ఈ కథలో సారా (నిధి అగర్వాల్) పాత్ర ఏమిటి? ఇస్మార్ట్ శంకర్ ప్రేయసి చాందినీ (నభ నటేష్) ఎలా మరణించింది? తన ప్రేయసి మరణానికి కారణమైన వ్యక్తి ఎవరు? తన జీవితాన్ని చిన్నాభిన్నం చేసిన కుట్రదారుడిని ఇస్మార్ట్ తెలుసుకొన్నాడా? అనే ప్రశ్నలకు సమాధానమే ఇస్మార్ట్ శంకర్ సినిమా కథ.

ఫస్టాఫ్ అనాలిసిస్

ఫస్టాఫ్ అనాలిసిస్

ఇస్మార్ట్ శంకర్ జైలు నుంచి తప్పించుకోవడం, ఆ తర్వాత ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లి కథ చెప్పడం పూరీ మార్క్ స్లయిల్‌లో చకచకా జరిగిపోతాయి. రామ్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ మెంట్, నభ నటేష్ ఎంట్రీ, వారి మధ్య సన్నివేశాలు రొటీన్‌గా ఉన్నప్పటికీ. డైలాగ్స్‌ కారణంగా ఆకట్టుకొంటాయి. తొలిభాగం చూస్తే కేవలం రామ్ క్యారెక్టర్‌తోనే పూరి మరో సాహసం చేశాడా అనిపిస్తుంది. రెండు పాటలు, మూడు ఫైట్లతో ఫస్టాఫ్‌లో గడిచిపోతుంది. ఈ సినిమా కథనం విషయంలో ఎప్పుడూ ఉండే మార్కును వదులుకోకుండా ఆ స్టయిల్‌లోనే కథను ముందుకు నడిపించాడనిచెప్పవచ్చు. ఇక నిధి అగర్వాల్ పాత్ర తొలిభాగంలో వచ్చిపోవడం తప్ప పెద్దగా ప్రాధాన్యం లేదంటనే ఫీలింగ్ కలుగుతుంది. నభ నటేష్, రామ్ కెమిస్ట్రీ సినిమాకు పాజిటివ్‌గా కనిపిస్తాయి.

సెకండాఫ్ అనాలిసిస్

సెకండాఫ్ అనాలిసిస్

ఇక సెకండాఫ్‌లో ఇస్మార్ట్ శంకర్ డబుల్ సిమ్ క్యారెక్టర్ కొంత ఆసక్తిగా ఉంటుంది. కాకపోతే రెగ్యులర్, రొటీన్ ఫార్మాట్‌లోనే సాగడం కొంత ఇబ్బందిగా ఉంటుంది. కేవలం స్క్రీన్ ప్లే, డైలాగ్స్, కెమెరా, ఎడిటింగ్ పనితీరు వల్ల సినిమా సానుకూలమైన ఫీలింగ్ కలుగుతుంది. సెకండాఫ్‌లో ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండ్ టైటిల్ వరకు కథలో కొత్తదనం ఉండదు. మితిమీరిన యాక్షన్ పాయింట్స్, మాస్ మసాలా అంశాలతో నెట్టుకొచ్చే ప్రయత్నం చేశారు. కథలో థ్రిల్ కలిగించే అంశాలు ఏమిలేకపోవడం మైనస్‌గా కనిపిస్తుంది. బలమైన విలనిజం లేకపోవడం సినిమాకు మరో మైనస్. ఓవరాల్‌గా మాస్ ప్రేక్షకులకు పైసా వసూల్ అనే విధంగా అనిపిస్తుంది.

పూరీ జగన్నాథ్ గురించి

పూరీ జగన్నాథ్ గురించి

ఇటీవల ఎదురవుతున్న పరిస్థితుల దృష్ట్యా ఇస్మార్ట్ శంకర్ విషయంలో దర్శకుడు పూరీ జగన్నాథ్ నేల విడిచి సాము చేసే ప్రయత్నం చేయలేదని గట్టిగా చెప్పవచ్చు. తెలుగు ప్రేక్షకులకు ఏం కావాలో అది వడ్డించే ప్రయత్నం చేశారు. తన మార్కు డైలాగులు, క్యారెక్టరైజన్స్ మీదే కాన్సంట్రేషన్ చేశాడా అనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమా విషయంలో రామ్ క్యారెక్టర్ డిజైన్ చేసిన తీరులో సక్సెస్ అయ్యాడని బలంగా చెప్పవచ్చు. కాకపోతే మిగితా క్యారెక్టర్లను పట్టించుకోలేదనే ఫీలింగ్ కలుగుతుంది. రామ్ క్యారెక్టర్ చుట్టు అన్ని క్యారెక్టర్లు కేవలం ప్యాండింగ్‌ మాదిరిగానే కనిపిస్తాయి. ఏ క్యారెక్టర్‌లో బలమైన మార్క్ కనిపించదు.

చాక్లెట్ బాయ్ నుంచి మాస్ హీరోగా

చాక్లెట్ బాయ్ నుంచి మాస్ హీరోగా

ఇస్మార్ట్ శంకర్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయగానే చాక్లెట్ బాయ్‌ లాంటి రామ్‌తో మాస్ ఎంటర్‌టైనరా? అనే మాటలు వినిపించాయి. అయితే తాను క్లాస్, మాస్ రెండింటిని మెప్పించగలనని హీరో రామ్ ఇస్మార్ట్ శంకర్‌తో సమాధానం చెప్పారు. ఈ సినిమా కోసం లుక్‌ నుంచి మాట, నడక, నడత మార్చుకోవడం హీరోలో తపన కనిపిస్తుంది. టీజర్లు, ట్రైలర్లతో ఏర్పడిన క్రేజ్‌కు రామ్‌ మాత్రం ఎక్కడా డిజాపాయింట్‌ చేయదు. శంకర్ పాత్రలో ఒదిగిపోయాడు. హైదరాబాదీ భాషను ఒడిసిపట్టుకొన్న విధానం, దానిని డెలివరీ చేసిన విధానానికి హ్యాట్సాఫ్. ఇక మాస్ హీరోల రేసులో రామ్ చేరిపోయాడనే చెప్పవచ్చు. పాటలు, ఫైట్లతోనే కాకుండా రొమాంటిక్ సన్నివేశాల్లో కొత్తగా కనిపించాడు. బలమైన విలన్ పాత్ర ఉండి ఉంటే రామ్ క్యారెక్టర్ మరింత ఎలివేట్ అవ్వడానికి అవకాశం ఉండేది.

గ్లామర్ బొమ్మలుగా నిధి, నభ

గ్లామర్ బొమ్మలుగా నిధి, నభ

ఇక నభా నటేష్, నిధి అగర్వాల్ పాత్రలు ఈ సినిమాకు షుగర్ కొటేడ్ లాంటివి. నభ నటేష్ గ్లామర్ విషయంలో ఒకే అనిపిస్తుంది. కానీ మాట్లాడిన టపోరీ భాషకు, బాడీ లాంగ్వేజ్ సరిగా కుదరల్లేదనే చెప్పవచ్చు. ఇక డైలాగ్స్ బట్టీ పట్టినట్టు చెప్పించినట్టు డబ్బింగ్ లోపాలు కనిపిస్తాయి. ఇక నిధి అగర్వాల్ పాత్ర కూడా ఓకేలా ఉంటుంది. గ్లామర్, రొమాంటిక్ సీన్లలో ఆకట్టుకొన్నది. కథ మొత్తం హీరోపైన ఉండటం మూలానా వారి పాత్రలు పరిమితంగా ఉంటాయి. దాంతో వారు పూర్తిస్థాయిలో తమ ప్రతిభను చూపెట్టుకోవడానికి అవకాశం దక్కలేదే అనే ఫీలింగ్ కలుగుతుంది.

మిగితా పాత్రల్లో

మిగితా పాత్రల్లో

మిగితా పాత్రల్లో సత్యదేవ్ గెస్ట్ పాత్రే. కనిపించిన కొన్ని సీన్లకు న్యాయం చేశాడు. సత్యదేవ్ లుక్ పరంగా ఆకట్టుకొన్నాడు. మరికొన్ని సీన్లు ఉంటే మరింత గుర్తింపు లభించే అవకాశం ఉండేది. మిగితా క్యారెక్టర్ల గురించి గొప్పగా చెప్పుకొనే వీలు కూడా కనిపించదు. తులసి, పునీత్ ఇస్సార్, ఆశీష్ విద్యార్థి లాంటి పాత్రలు నామమాత్రంగానే ఉంటాయి. గెటప్ శ్రీను పాత్ర కూడా పెద్దగా ఆకట్టుకొనేలా లేదు.

 టెక్నికల్‌గా

టెక్నికల్‌గా

ఇస్మార్ట్ శంకర్ సినిమాకు ప్రధాన బలం మణిశర్మ మ్యూజిక్, రాజు తోట సినిమాటోగ్రఫి. కొన్ని సన్నివేశాల్లో పసలేకున్నా.. తన రీరికార్డింగ్‌తో వాటిని హైలెట్ చేయడంలో తన మార్క్‌ను చూపించాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లిందని చెప్పవచ్చు. టైటిల్ సాంగ్, ఉండిపో, బొనాలు లాంటి పాటలు సినిమాలో జోష్‌ను పెంచాయి. పాటల చిత్రీకరణ, ప్రతీ ఫ్రేమ్‌ను ఫీల్‌గుడ్‌గా అందించడంలో రాజ్ తోట మరోసారి తన ప్రతిభను నిరూపించుకొన్నాడు. మాస్ సినిమాకు కావాల్సిన మ్యాజిక్‌ను మణిశర్మ అందిస్తే, సినిమాను రిచ్‌గా చూపించడంలో ఇద్దరు సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ఇక సినిమాకు జునైద్ సిద్ధిఖీ ఎడిటింగ్ మరో ప్లస్ పాయింట్.

ప్రొడక్షన్ వ్యాల్యూస్

ప్రొడక్షన్ వ్యాల్యూస్

దర్శకుడు పూరీ జగన్నాథ్, సీనియర్ హీరోయిన్ ఛార్మీ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ఇస్మార్ట్ శంకర్. హీరో, హీరోయిన్లను మినహాయిస్తే, నాసిరకం నటులతో సినిమాను చుట్టేసినట్టుగా కనిపిస్తుంది. కాకపోతే సాంకేతిక విభాగాల ఎంపిక విషయం వారి అభిరుచికి అద్దం పట్టింది. కథపై మరికాస్త జాగ్రత్త వహిస్తే మరో పోకిరి లాంటి చిత్రం వచ్చి ఉండేదేమో అనిపిస్తుంది. సినిమాను చాలా రిచ్‌గా అందించడంలో తమ టేస్ట్ తెర మీద కనిపిస్తుంది.

 ఫైనల్‌గా

ఫైనల్‌గా

పూరీ జగన్నాథ్ సినిమాల తరహాలో రెగ్యులర్ మాస్ ఎలిమెంట్స్ రూపొందిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. పూరీ స్క్రీన్ ప్లే, డైలాగ్స్‌ సినిమాకు బలం. కథలో బలం లేకపోవడం, థ్రిల్లింగ్ అంశాలు లేకపోవడం వల్ల సాదాసీదాగా అనిపిస్తుంది. రెండు గంటలపాటు మాస్ ప్రేక్షకులు ఆనందించే విధంగా ఉందనిచెప్పవచ్చు. బీ, సీ సెంటర్లతోపాటు ఆంధ్రా ప్రేక్షకుల ఆదరణకు గురైతే సినిమా కమర్షియల్‌గా మరో మెట్టు ఎక్కవచ్చు. రానున్న రెండు రోజుల్లో ఈ సినిమా కమర్షియల్ స్టామినా ఏంటో స్పష్టమవ్వడం ఖాయం. ఎలాంటి అంచనాలు లేకుండా, పూరీ సినిమాలను ఇష్టపడే వారికి, రామ్ కొత్త తరహా యాక్షన్, లుక్‌ను చూడటానికి, ఈ సినిమాకు వెళ్తే సంతృప్తి దక్కుతుంది..

 బలం, బలహీనత

బలం, బలహీనత

ప్లస్ పాయింట్స్

  • హీరో రామ్ ఫెర్ఫార్మెన్స్
  • పూరీ జగన్నాథ్ స్క్రీన్ ప్లే
  • డైలాగ్స్
  • సినిమాటోగ్రఫి, మ్యూజిక్
  • మైనస్ పాయింట్

    • కథ
    • రొటీన్ అంశాలు
    • యాక్షన్ పార్ట్ ఎక్కువైపోవడం
    • తెర ముందు, తెర వెనుక

      తెర ముందు, తెర వెనుక

      నటీనటులు: రామ్ పోతినేని, నిధి అగర్వాల్, నభ నటేష్, సత్యదేవ్, గెటప్ శ్రీను, ఆశీష్ విద్యార్థి, తులసి, పునీత్ ఇస్సార్
      కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరీ జగన్నాథ్
      మ్యూజిక్: మణి శర్మ
      సినిమాటోగ్రఫి: రాజ్ తోట
      ఎడిటింగ్: జునైద్ సిద్ధిఖీ
      బ్యానర్: పూరీ కనెక్ట్స్, పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్
      రిలీజ్ డేట్: 2019-07-18

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X