Jana Nayagan First Review: జన నాయగన్ మూవీ ఫస్ట్ రివ్యూ
తమిళ సూపర్ స్టార్, దళపతి విజయ్, అందాల తార పూజా హెగ్డే జంటగా నటించిన తాజా పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ జన నాయగన్. ఈ సినిమాను కన్నడ భారీ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ, జగదీష్ పళనిస్వామి, లోహిత్ ఎన్‌కే నిర్మించారు.
ఈ చిత్రంలో మమితా బైజు కీలక పాత్రను పోషించారు. బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవన్ మీనన్, ప్రకాశ్ రాజ్, ప్రియమణి, సునీల్, రెబా మోనికా జాన్, బాబా భాస్కర్, రేవతి తదితరులు నటించారు. ఈ సిినమాకు సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫి, ప్రదీప్ ఈ రాఘవ్ ఎడిటింగ్, అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రం 7 నెలలపాటు సెన్సార్‌తో పోరాటం చేసిన తర్వాత జూలై 23వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతున్నది. ఈ సినిమాకు సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) ఇచ్చిన సర్టిఫికెట్ ఏమిటి? ఈ మూవీకి రన్ టైమ్ ఎంత? సెన్సార్ తర్వాత ఈ సినిమాకు వచ్చిన ఫీడ్ బ్యాక్ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..

తెలుగులో విజయవంతమైన భగవంత్ కేసరి సినిమా ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాను తమిళ సినీ అభిమానులు, విజయ్ ఫ్యాన్స్ అభిరుచికి తగినట్టుగా మార్పులు చేర్పులు చేశారు. వెట్రీ కొండన్ (విజయ్) పోలీస్ ఆఫీసర్. ఆయన ప్రియురాలు కాయల్ (పూజా హెగ్డే). తాను పెంచి పోషించిన విజయలక్ష్మీ అలియాస్ విజ్జి (మమితా బైజు)కు మాఫియా డాన్ (బాబీ డియోల్) నుంచి ముప్పు ఏర్పడుతుంది. అయితే మాఫియా ఎత్తుగడలను విజ్జితోపాటు వెట్రీ ఎలా చిత్తు చేశాడనేది ఈ సినిమా కథ.
జన నాయగన్ సినిమాలో పొలిటికల్ సన్నివేశాలు, డైలాగ్స్ భారీగా ఉండటం, అలాగే తమిళ రాజకీయాలపై సెటైర్లు, అంతేకాకుండా ఓ పొలిటికల్ పార్టీపై విమర్శలు, ఆరోపణలు ఉండటం కారణంగా సెన్సార్ బోర్డు అభ్యంతరాలు తెలిపారు. అంతేకాకుండా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు కూడా రావడంతో ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి అభ్యంతరం తెలిపారు. దాంతో ఈ సినిమా అనేక వివాదాల్లో కూరుకుపోయి విడుదల ఆగిపోయింది. దాంతో ఈ సినిమాను రివ్యూ కమిటీకి అప్పగించారు. ఆ తర్వాత రివ్యూ చేసి ఈ సినిమా విడుదలకు సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
పొలిటికల్ ఫ్లేవర్, మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ఏ (A) సర్టిఫికెట్ జారీ చేసింది. అంటే ఈ సినిమాను 18 ఏళ్లు దాటిన వారు ఎలాంటి అభ్యంతరం లేకుండా చూడొచ్చు అని సెన్సార్ సర్టిఫికెట్‌లో స్పష్టం చేశారు. అంతకంటే తక్కువ వయసు ఉన్న వారు తల్లిదండ్రుల అనుమతితో చూడాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ సినిమా నిడివిని 3 గంటల 3 నిమిషాలు అంటే.. 183 నిమిషాల రన్ టైమ్‌ను ఫిక్స్ చేశారు అని చిత్ర యూనిట్ తెలిపింది.
విజయ్ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్‌లా ఉండేలా ఈ సినిమాను రూపొందించారు. పొలిటికల్ డైలాగ్స్, మాస్ సన్నివేశాలు విజిల్స్ వేసేలా ఉంటాయి. పూజా హెగ్డే గ్లామర్, మమితా బైజు యాక్టింగ్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఉంటాయి. డైరెక్టర్ వినోద్ టేకింగ్ కొత్తగా ఉంటుంది అనే ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఈ సినిమాకు అదనంగా 41 సెకన్ల విజయ్ స్పెషల్ ఎంట్రీని యాడ్ చేశారనే వార్త ఫ్యాన్స్‌కు పండుగలా మారింది. ఈ సినిమా కోసం ఇటీవల రీ సెన్సారింగ్ కూడా పూర్తి చేశారు. ఈ సినిమా గురించిన ఎక్స్‌క్లూజివ్ రివ్యూ కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications


