Pekamedalu Review: పేకమేడలు సినిమా రివ్యూ అండ్ రేటింగ్
Rating: 2.75/5
నటీనటులు: వినోద్ కిషన్, అనూష కృష్ణ, రితిక శ్రీనివాస్, జగన్ యోగి రాజ్, అనూష నూతల, గణేష్ తిప్పరాజు, నరేన్ యాదవ్ తదితరులు
రచన, దర్శకత్వం: నీలగిరి మామిళ్ల
బ్యానర్: క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్
నిర్మాత: రాకేష్ వర్రే
డీవోపీ: హరిచరణ్ కే
ఎడిటర్: సృజన అడుసుమిల్లి, హంజా అలీ
మ్యూజిక్: స్మరణ్ సాయి
లైన్ ప్రొడ్యూసర్: అనూషా బోరా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కేతన్ కుమార్
రిలీజ్ డేట్: 2024-07-19
బీటెక్ చదువుకొన్న లక్ష్మణ్ (వినోద్ కిషన్) కష్టపడకుండా, ఉద్యోగం చేయకుండా ఉన్నపళంగా కోటీశ్వరుడు కావాలని కలలు కంటుంటాడు. భార్య వరలక్ష్మీ (అనూష కృష్ణ) సంపాదనతో ఆన్‌లైన్‌లో పేకాట అడుతూ.. రియల్ ఎస్టేట్‌లో కోట్లు సంపాదించాలని తాపత్రయపడుతుంటాడు. దాంతో భార్య, భర్తల మధ్య గొడవలు జరుగుతుంటాయి. ఈ క్రమంలో లక్ష్మణ్ జీవితంలోకి ఎన్నారై మహిళ శ్వేత (రేతిక శ్రీనివాస్) వస్తుంది. తన అబద్దపు మాటలతో శ్వేతను ట్రాప్ చేయాలని ప్రయత్నిస్తుంటాడు. ఈ విషయం తెలిసి భార్య లక్ష్మీ వదిలేసి వెళ్తుంది.

ఉన్నత చదువు చదివినా లక్ష్మణ్ కష్టపడకుండా సోమరిగా మారడానికి కారణం ఏమిటి? భార్య సంపాదన వల్ల బతడం వల్ల లక్ష్మణ్ ఎలాంటి అవమానాలను ఫేస్ చేశాడు. బస్తీ జీవితంలో లక్ష్మీ ఎలాంటి కష్టాలు పడింది? భర్త చేసే పనుల వల్ల లక్ష్మీ ఎలాంటి కస్టాలు పడింది? తన భర్త జీవితంలోకి మరో మహిళ రావడంతో లక్ష్మీ పరిస్థితి ఏమిటి? ఎన్నారై మహిళతో రిలేషన్ ఫలితం ఏమిటి? భర్త చేసే పనులను భరించలేక పుట్టింటికి వెళ్లిన లక్ష్మీ ఎలాంటి నిర్ణయం తీసుకొన్నది? లక్ష్మీ, లక్ష్మణ్ కాపురం చివరకు ఏమైంది? ఎన్నారై మహిళతో లక్ష్మణ్ రిలేషన్ ఎంత వరకు వచ్చింది? అనే ప్రశ్నలకు సమాధానమే పేకమేడలు సినిమా కథ.
పేకమేడలు సినిమా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే.. మహిళా చైతన్యం అనే ప్రధానమైన పాయింట్ చుట్టూ అల్లుకొన్న ఆర్థిక సమస్యలతో సతమతమయ్యే బస్తీ జీవితం. ఇలాంటి కథలు చాలానే వచ్చాయి? కానీ దర్శకుడు నీలగిరి రాసుకొన్న సీన్లు, వాటిలో ఎమోషన్స్ ఆడియెన్స్ కనెక్ట్ అయ్యేలా ఉండటమే ఓ సక్సెస్. ఇంకా కథ, క్లైమాక్స్‌పై మరింత దృష్టిపెట్టి ఉంటే డెఫినెట్‌గా తెలుగులో మంచి నేటివిటీ సీన్లు అయి ఉండేవి. బస్తీ జీవితం, అక్కడ ఉండే వ్యక్తుల హావభావాలు, మనస్తత్వాలను బాగా తన పాత్రల్లో చూపించే ప్రయత్నం చేశారు.

పేకమేడలు మూవీ ఫస్టాఫ్ చాలా సాఫీగా సాగినట్టు అనిపిస్తుంది. ఇక సెకండాఫ్‌లో మాత్రం కొంత సాగదీసినట్టు అనిపిస్తుంది. కానీ ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండ్ టైటిల్ వరకు ఉండే సీన్లు, కొన్ని ఎపిసోడ్స్ ఈ సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లాయని చెప్పవచ్చు. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు తలవొగ్గకుండా మహిళ తన సొంతకాళ్ల మీద ఎలా ఆర్థికంగా ఎదుగవచ్చని.. సింపుల్‌గా సూటిగా చెప్పిన విధానం బాగుంది. సినిమా చూసిన తర్వాత చిన్న సినిమాల్లో మంచి పయత్నం అనే ఫీలింగ్ కలుగుతుంది.
ఇక నటీనటుల విషయానికి వస్తే.. ప్రధాన పాత్రలు పోషించిన వినోద్ కిషన్, అనూష కృష్ణ, రేతిక శ్రీనివాస్ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని ముఖాలు. ఇంకా ఈ సినిమాలో నటించిన వారంతా కొత్తవారే. కానీ వారందరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేస్తూ ప్రేక్షకుల మనసులను గెలుచుకొనే ప్రయత్నం చేశారు. వినోద్ కిషన్ సింపులుగా క్యారెక్టర్ దూరిపోయి బిహేవ్ చేశాడు. అనూష కృష్ణ అత్యంత సహజసిద్దంగా పేదరికంతో బాధపడే మహిళగా నటించింది.

శ్రీదేవి డ్రామాలో జగనన్న జగనన్న పెరేడి ట్రెండింగ్? YS జగన్, రోజాపై హైపర్ ఆది మాస్ ర్యాగింగ్!
హంగులు, ఆర్బాటాలు లేకుండా కేవలం కంటెంట్ ప్రధానంగా సాగే నేటివిటి సినిమా పేకమేడలు. దిగువ మధ్య తరగతి కుటుంబాల్లో ఉండే సమస్యలు, కాపురంలో మహిళలకు ఎదురయ్యే సమస్యలను చెప్పే ఎమోషనల్ కథ ఇది. ఈ సినిమాలోని పాత్రలు, కథలో నిజాయితీ కనిపిస్తుంది. తొలి చిత్ర దర్శకుడు నీలగిరి ప్రయత్నం బాగుంది. నిర్మాతగా రాకేశ్ వర్రే అటెంప్ట్‌ను ప్రశంసించాలి. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే డెఫినెట్‌గా మంచి అనుభూతిని పంచుతుంది. వీకెండ్‌లో ఓసారి ట్రై చేయండి...


Click it and Unblock the Notifications











