Thandel Live Updates: తండేల్ మూవీ లైవ్ అప్‌డేట్స్.. సాయిపల్లవి, చైతూ ఫెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే?

యువ సామ్రాట్ నాగచైతన్య, టాలెంటెడ్ యాక్టర్ సాయిపల్లవి నటించిన తాజా చిత్రం తండేల్. టాలీవుడ్‌లో అగ్ర నిర్మాత అల్లు అరవింద్, బన్నీ వాసు నిర్మించిన చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా కథ ఏపీలోని ఉత్తరాంధ్రలోని జాలర్ల జీవితంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందించారు. ఈ సినిమాకు సంబంధించిన హైలెట్స్, ప్రీ రిలీజ్ రివ్యూ వివరాల్లోకి వెళితే..

తండేల్ అంటే.. సముద్రంలో చేపల వేటకు వెళ్లే జాలర్ల గ్రూపు లీడర్‌ను తండేల్ అంటారు. ఉత్తరాంధ్రకు చెందిన జాలర్ల బృందం సముద్రంపై వేటకు వెళ్లి.. పొరపాటున పాక్ సరిహద్దు జలాలను దాటడంతో వారిని బంధించి అక్కడి జైలులో బంధించారు. వారిని భారత ప్రభుత్వం ఏ విధంగా చర్చలు జరిపి వారిని విడిపించారు అనేది సినిమా కథ.

Thandel Movie Pre Release Review

LIVE Feed
  • Feb 7, 2025 2:02 PM

    విశాఖలో అక్కినేని ఫ్యాన్స్ హంగామా

    అక్కినేని నాగచైతన్య - సాయిపల్లవి జంటగా నటించిన తండేల్ సూపర్‌ హిట్ టాక్ తెచ్చుకోవడంతో అక్కినేని అభిమానులు పండగ చేసుకుంటున్నారు. చాలా రోజుల తర్వాత అక్కినేని ఫ్యామిలీ నుంచి ఓ హీరో హిట్ కొట్టడంతో విశాఖలో తండేల్ థియేటర్ల వద్ద సందడి నెలకొంది.

  • Feb 7, 2025 1:30 PM

    లవర్ బాయ్ ఈజ్ బ్యాక్

    తండేల్ సినిమాతో అక్కినేని నాగచైతన్య తిరిగి హిట్ ట్రాక్‌లోకి వచ్చినట్లేనని ఆయన అభిమానులు పొంగిపోతున్నారు. ఇక లవ్, రొమాంటిక్ మూవీస్‌తో ఒకప్పుడు దుమ్మురేపిన చైతూ తిరిగి లవర్ బాయ్‌గా తన వింటేజ్ లుక్‌లోకి వచ్చేశాడని అంటున్నారు. ఈ మేరకు అక్కినేని ఫ్యాన్స్ పెడుతున్న పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి.

  • Feb 7, 2025 1:15 PM

    తండేల్ మూవీ రివ్యూ

    తండేల్ చిత్రం ఫిబ్రవరి 7వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది. సాయిపల్లవి, నాగచైతన్య జంటగా నటించారు. ఈ సినిమా ఎక్స్‌క్లూజివ్ రివ్యూ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

  • Feb 7, 2025 12:50 PM

    తండేల్ ఓపెనింగ్స్‌పైనే అందరి దృష్టి

    నాగచైతన్య- సాయిపల్లవి నటించిన తండేల్‌ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వస్తుండటంతో బుకింగ్స్ కూడా జోరందుకున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తండేల్‌కు ఫస్ట్ డే ఎన్ని కోట్ల ఓపెనింగ్స్ వస్తాయి? నాగచైతన్య రికార్డుల దుమ్ముదులిపేస్తాడా? అంటూ అక్కినేని అభిమానులు చర్చించుకుంటున్నారు.

  • Feb 7, 2025 12:19 PM

    సాయిపల్లవి - నాగచైతన్య జోడీకి జనం ఫిదా

    సాయిపల్లవి- నాగచైతన్య జోడీ తమ మెస్మరైజింగ్ యాక్టింగ్‌తో మెప్పించింది. సినిమాను చూసిన వారంతా ఈ జోడీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దీంతో వీరిద్దరి హిట్ పెయిర్‌గా టాలీవుడ్ జనాలు ముద్ర వేస్తున్నారు. ముఖ్యంగా లవ్, సెంటిమెంట్ , పతాక సన్నివేశాల్లో వీరిద్దరూ పోటీపడి నటించినట్లుగా అక్కినేని ఫ్యాన్స్ పోస్ట్‌లు పెడుతున్నారు

  • Feb 7, 2025 11:48 AM

    తండేల్‌పై పైరసీ పంజా

    విడుదలై గంటలు గడవకముందే తండేల్‌పై పైరసీ మహమ్మారి పంజా విసిరింది. కొన్ని వైబ్‌సైట్స్‌లో ఈ సినిమా ప్రింట్ ప్రత్యక్షమైనట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ పైరసీ వెనుక ఉన్న వారిపై తండేల్ నిర్మాతలు చర్యలు తీసుకోవాల్సిందిగా అక్కినేని అభిమానులు కోరుతున్నారు.

  • Feb 7, 2025 11:29 AM

    తండేల్‌ మోత మోగుతోందిగా

    తండేల్ సినిమాకు సోషల్ మీడియాలో పాజిటివ్ టాక్ వస్తుండటంతో టికెట్స్ బుకింగ్స్ పెరుగుతున్నాయి. బుక్ మై షోలో ఒక గంటలోనే 11.42k టికెట్స్ అమ్ముడైనట్లుగా ఫ్యాన్స్ స్క్రీన్ షాట్లు షేర్ చేస్తున్నారు. అలాగే ఈ సినిమాపై 179.2k మంది ఆసక్తి చూపుతున్నట్లుగా అక్కినేని అభిమానులు పోస్టులు పెడుతున్నారు.

  • Feb 7, 2025 11:05 AM

    తండేల్‌కు అదిరిపోయే బుకింగ్స్

    అక్కినేని నాగచైతన్య - సాయిపల్లవిల తండేల్ చిత్రానికి అన్ని ఏరియాల నుంచి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. హీరో హీరోయిన్లు అద్భుతంగా చేశారని అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఇదే సమయంలో తండేల్‌ బుకింగ్స్ కూడా పెరుగుతున్నట్లుగా సామాజిక మాధ్యమాల్లో కథనాలు వస్తున్నాయి.

  • Feb 7, 2025 10:42 AM

    డీఎస్పీ మ్యూజిక్‌కి ఫ్యాన్స్ ఫిదా

    అక్కినేని నాగచైతన్య - సాయిపల్లవిల తండేల్ చిత్రానికి సంబంధించి అన్ని ఏరియాలలో మార్నింగ్ షో ముగిసినట్లుగా రిపోర్ట్‌లు వస్తున్నాయి. సినిమా చాలా బాగుందని ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రధానంగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతానికి ఎక్కువ మార్కులు పడుతున్నాయి.

  • Feb 7, 2025 10:25 AM

    థియేటర్‌లలో మోత మోగిస్తోన్న అక్కినేని ఫ్యాన్స్

    తండేల్ సినిమా బాగుందని సోషల్ మీడియాలో అక్కినేని ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. నాగచైతన్య కుమ్మేశాడని, ఈసారి రికార్డులు ఖాయమని అంటూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. అక్కినేని ఫ్యాన్స్ థియేటర్‌లకు వెళ్లేటప్పుడు ఓ బస్తా పేపర్లు ఎక్కువ తీసుకెళ్లండి అంటూ కొందరు యూజర్లు పోస్ట్‌లు పెడుతున్నారు

  • Feb 7, 2025 9:57 AM

    ఆ హీరోల లిస్ట్‌లోకి అక్కినేని నాగచైతన్య

    తండేల్ సినిమా చాలా బాగుందని అక్కినేని అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. నాగచైతన్య నటన అదిరిపోయిందని కెరీర్‌లోనే ది బెస్ట్ ఇచ్చాడని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాతో టైర్ 1 హీరోల లిస్ట్‌లోకి వెళ్లే అవకాశాలు చైతూకి పుష్కళంగా ఉన్నాయని ఓ యూజర్ పోస్ట్ పెట్టాడు.

  • Feb 7, 2025 9:37 AM

    దుమ్మురేపిన అండర్ వాటర్ ఎపిసోడ్

    తండేల్‌ చిత్ర యూనిట్ సినిమా విడుదలకు ముందు అండర్ వాటర్ ఎపిసోడ్‌ గురించి బాగా ఎలివేట్ చేసింది. ఇంటర్వ్యూలు, ఇతర ప్రమోషన్స్ కార్యక్రమాల్లోనే ఈ సీన్ గురించి చెప్పడంతో ఆడియన్స్ ఉత్కంఠగా ఎదురుచూశారు. అయితే వారిని ఏమాత్రం నిరాశపరచకుండా అండర్ వాటర్ ఎపిసోడ్ అదిరిపోయినట్లుగా రిపోర్టులు వస్తున్నా

  • Feb 7, 2025 8:24 AM

    ప్రీమియర్స్‌కు సూపర్ రెస్పాన్స్

    నాగచైతన్య - సాయిపల్లవి నటించిన తండేల్‌కు ఓవర్సీస్‌లో ప్రీమియర్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తోందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. నార్త్ అమెరికా సహా ఇతర ఓవర్సీస్ మార్కెట్‌లో ప్రీమియర్స్‌‌కు మంచి రెస్పాన్స్ వస్తున్నట్లు కొందరు నెటిజన్లు ఎక్స్‌లో కామెంట్స్ పెడుతున్నారు.

  • Feb 7, 2025 8:12 AM

    నాగచైతన్యపై నెగిటివిటీ ఎందుకు?

    నాగచైతన్య నటనపరంగా ఈ సినిమాతో మరో మెట్టు పైకెక్కాడని , ఆయనపై నెగిటివిటీ ఎందుకో తెలియడం లేదని ఓ యూజర్ కామెంట్ చేశాడు. సాయిపల్లవి ఎప్పటిలా మెస్మరైజరింగ్ చేసిందని , దేవిశ్రీప్రసాద్ సంగీతం ఈ చిత్రానికి సోల్‌లా నిలిచిందని కాంప్లిమెంట్ ఇచ్చాడు.

  • Feb 7, 2025 7:38 AM

    నాగచైతన్య కెరీర్ బెస్ట్

    సానుకూలంగా ఓ మంచి అంచనాతో సినిమాకు వెళ్తే తండేల్ మూవీని ఎంజాయ్ చేయవచ్చు. నాగచైతన్య కెరీర్ బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఎప్పటిలానే సాయిపల్లవి తన పెర్ఫార్మెన్స్‌తో ఇరుగదీశారు. డీఎస్పీ మ్యూజిక్ బాగుంది. సెకండాఫ్‌లో ఎమోషన్స్ బాగా వర్కవుట్ అయ్యాయి అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

  • Feb 7, 2025 7:18 AM

    యూఎస్‌లో ఓపెనింగ్స్

    తండేల్ సినిమా యూఎస్ ప్రీమియర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ప్రీమియర్ల ద్వారా 200K డాలర్లు వసూలు చేసిందని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. చైతూ కెరీర్‌లో మంచి ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా ఘనతను సాధించింది పేర్కొన్నారు.

  • Feb 7, 2025 7:01 AM

    తండేల్‌ బాక్సాఫీస్ జోరు

    తండేల్ మూవీ అడ్వాన్స్ బుకింగ్‌కు మంచి రెస్పాన్స్ వస్తున్నది. ఓవర్సీస్, తెలుగు రాష్ట్రాల్లో భారీగా వసూళ్లు నమోదు అవుతున్నాయి. ఈ సినిమా నాగచైతన్యకు బెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చే సినిమా అవుతుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

  • Feb 7, 2025 6:53 AM

    యూకేలో అక్కినేని ఫ్యాన్స్ సంబరాలు

    తండేల్ సందర్భంగా యూకేలో అక్కినేని అభిమానులు సంబరాలు జరుపుకొన్నారు. తండేల్ పేరుతో కేక్ తయారుచేయించి.. దానిని కట్ చేసి సినిమా ప్రీమియర్‌ను ఎంజాయ్ చేశారు. వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి.

  • Feb 7, 2025 6:36 AM

    నాగచైతన్య కెరీర్‌లో హయ్యెస్ట్‌గా

    తండేల్ సినిమా నాగచైతన్య కెరీర్‌లో రికార్డులు క్రియేట్ చేసే సినిమాగా ఉంటుంది. అక్కినేని ఫ్యామిలీలో హయ్యెస్ట్ కలెక్షన్లు సాధించే సినిమాగా అవుతుంది. అక్కినేని ఫ్యామిలీ హైప్ క్రియేట్ చేయడం మొదలుపెట్టింది అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

  • Feb 7, 2025 6:29 AM

    తండేల్‌కు పాజిటివ్ రిపోర్టులు

    తండేల్ మూవీ ప్రీమియర్స్ ప్రపంచవ్యాప్తంగా ముగిశాయి. ఈ సినిమాకు అన్ని చోట్ల నుంచి పాజిటివ్ రిపోర్టులు వస్తున్నాయి. ఈ మూవీలో సాయిపల్లవి, నాగచైతన్య ఫెర్ఫార్మెన్స్ పీక్స్‌లో ఉంది. చందూ మొండేటి డైరెక్షన్ బాగుంది. సెకండాఫ్‌లో పాకిస్థాన్ ఎపిసోడ్స్ చాలా ఎమోషనల్‌గా ఉన్నాయి అని కామెంట్ వస్తున్నాయి.

  • Feb 7, 2025 12:38 AM

    యూఎస్ఏలో షోలకు భారీ క్రేజ్

    నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ఈ సినిమా ప్రీమియర్లు మొదటగా అమెరికాలో మొదలయ్యాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ప్రీమియర్లు ప్రారంభమయ్యాయి. ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్‌కు మంచి రెస్సాన్స్ లభించింది.

  • Feb 7, 2025 12:38 AM

    తండేల్ పాటలకు ఫుల్ క్రేజ్

    తండేల్ సినిమా కోసం దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. శ్రీమణి సాహిత్యం అందించారు. బుజ్జి తల్లి, నమో నమ శివాయ, హైలెస్సా హైలెస్సా పాటలు పాపులారిటీని సాధించాయి. తాజాగా విడుదలైన ఆజాదీ పాటకు మంచి రెస్పాన్స్ వస్తున్నది.

  • Feb 7, 2025 12:37 AM

    4 కోట్లతో శివతాండం సాంగ్

    తండేల్ సినిమా కోసం భారీ సెట్స్ వేయడం స్పెషల్ ఎట్రాక్షన్. పాకిస్థాన్ జైలు సెట్‌ను అద్బుతంగా వేయడం ద్వారా భారీగా ఖర్చు చేశారు. ఈ సినిమాలోని శివ పాట కోసం ఏకంగా 4 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. సుమారుగా 900 మంది ట్రైనీ డ్యాన్సర్లతో ఈ సాంగ్‌ను చిత్రీకరించారు.

  • Feb 7, 2025 12:37 AM

    75 కోట్ల బడ్జెట్‌తో

    తండేల్ సినిమాను సుమారుగా 75 కోట్ల రూపాయలతో నిర్మించారనేది ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరిగింది. ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్ అమ్మడం ద్వారా సుమారుగా 40 కోట్ల రూపాయలు రాబట్టారు. ఇక ఈ సినిమాపై ఉన్న నమ్మకంతో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఏరియాల్లో ఈ మూవీని గీతా ఆర్ట్స్ సొంతంగా రిలీజ్ చేసుకొంటున్నారు.

  • Feb 7, 2025 12:36 AM

    రాజు, సత్య ప్రేమ కథ

    తండేల్ సినిమాలో కీలక పాత్రలు రాజు, సత్య. రాజుగా నాగచైతన్య, సత్యగా సాయిపల్లవి నటించారు. ముఖ్యంగా ఈ సినిమా సత్య, రాజుల ప్రేమ కథ. వారిద్దరి మధ్య జరిగిన బలమైన ప్రేమ కథ ఈ సినిమాకు పునాది. పాకిస్థాన్ జైలు, ఇతర ఎమోషనల్ అంశాలు వీరి పాత్రల చుట్టూ అల్లుకొన్నారని మూవీ ప్రమోషన్స్‌లో వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X