Ram Pothineni: సిక్స్ ప్యాక్‌తో కేక పెట్టిస్తున్న రామ్ పోతినేని.. డబుల్ ఇస్మార్ట్ లుక్ లీక్!

హీరో రామ్ పోతినేని క్రేజ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. టీనేజ్ లోనే ఇండస్ట్రీకి వచ్చి.. సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు రామ్. ఇక తాజాగా స్కంద సినిమాతో భారీ ఫ్లాప్ చవి చూసిన రామ్.. మళ్లీ హిట్టు కొట్టేందుకు తనకు బ్లాక్ బస్టర్ హిట్టు ఇచ్చిన పూరీ జగన్నాథ్ తో కలిసి డబుల్ ఇస్మార్ట్ గా రాబోతున్నాడు. ఇక స్కంద కోసం బరువు పెరిగన రామ్... ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ కోసం 6 ప్యాక్ లుక్ లో కనిపించాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ లుక్ రిలీజ్ అయి.. సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అదేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

హీరో రామ్ పోతినేని మళ్లీ పాత లుక్ లోకి మారిపోయాడు. ఆయన ఇటీవల బోయపాటి శ్రీను దర్శకత్వంలో స్కంద అనే చిత్రంలో నటించారు. ఇక ఈ సినిమా కోసం రామ్ ఏకంగా 10 కిలోల బరువు పెరిగారు. ఇక బొద్దుగా కనిపించాడు. అయితే ఈ సినిమా కోసం అంత కష్టపడినా.. రామ్ కు మాత్రం ఫలితం దక్కలేదు. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఆ ఫలితాన్ని మరిచిపోయి.. మళ్లీ కొత్త ప్రాజెక్టు కోసం కసరత్తులు మొదలు పెట్టాడు రామ్.

Hero Ram Pothineni 6 pack Look Leak From Puri Jagannadh Double Ismart Movie

ఇక రామ్ తాజాగా పూరీ జగన్నాథ్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ మూవీకి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ సినిమాలో నటిస్తున్నారు రామ్. పాన్ ఇండియా లెవెల్ లో ఈ 'డబుల్ ఇస్మార్ట్' తెరకెక్కుతుంది. ఇక ఈ షూటింగ్‌లో రామ్ పాల్గొంటున్నారు. ప్రస్తుతం ముంబైలో 'డబుల్ ఇస్మార్ట్' చిత్రీకరణ కొనసాగుతోందని తెలుస్తోంది. బోయపాటి శ్రీను కోసం 10 కేజీలు పెరిగిన రామ్.. ఇప్పుడు పూరీ డబుల్ ఇస్మార్ట్ కోసం.. కెలరీలు కరిగించినట్లు లేటెస్ట్ లుక్ చూస్తే అర్ధం అవుతుంది.

Hero Ram Pothineni 6 pack Look Leak From Puri Jagannadh Double Ismart Movie

రామ్ పోతినేని 6 ప్యాక్ లుక్ సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఇక బాడీ చూస్తే.. కండలు తిరిగి ఉంది. ఆ ఫోటోల మాత్రం రామ్ మొహం పూర్తిగా కనిపించకుండా.. కేవలం బ్లాక్ అండ్ వైట్ లో తన బాడీని మాత్రమే చూపించాడు. ఇక డబుల్ ఇస్మార్ట లుక్ రిలీజ్ కావడంతో ఫ్యాన్స్ మళ్లీ బ్లాక్ బస్టర్ లోడింగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. రామ్ సిక్స్ ప్యాక్ చేయడం ఇదే తొలిసారి కాదు... గతంలో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలోనే వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమా కోసం కూడా రామ్ సిక్స్ ప్యాక్ చేసిన సంగతి తెలిసిందే.

అప్పడు కూడా ఇస్మార్ట్ మూవీ ఫోటోలను రామ్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. మళ్లీ ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ కోసం 6 ప్యాక్ బాడీ ఫోటోలను రిలీజ్ చేశాడు రామ్. 2019లో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాకు ఈ 'డబుల్ ఇస్మార్ట్' సీక్వెల్ గా తెరకెక్కుతుంది. లైగర్ తో దెబ్బతిన్న పూరీ... అయినప్పటికీ ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్, ఛార్మి కౌర్ ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహారిస్తున్నారు.

ఇక డబుల్ ఇస్మార్ట్ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 8న మహా శివరాత్రి సందర్భంగా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 'డబుల్ ఇస్మార్ట్' రిలీజ్ కానుంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ రోల్ లో నటిస్తున్నారు. ఇప్పటికే ఆయన షూట్‌లో కూడా పాల్గొనగా... ముంబైలో ఇప్పటికే ఈ మూవీ ఒక షెడ్యూల్ పూర్తిచేసుకుంది. ఇప్పుడు కొత్త షెడ్యూల్‌ను మళ్లీ ముంబైలో స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X