గోవాలో పార్టీ చేసుకున్న ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీ టీమ్
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. శ్రీమతి లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్‌పై పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
కొంతకాలంగా గోవాలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం... ఆదివారం రాత్రితో తాజా షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని చార్మి ట్విట్టర్ ద్వారా తెలియస్తూ... గోవా షెడ్యూల్ పూర్తయిన వెంటనే అంతా కలిసి పార్టీ చేసుకున్నాం. డాన్స్ చేసి ఎంజాయ్ చేశాం. రామ్ తన స్మార్ట్ బీట్స్ వేస్తూ అదరగొట్టాడు అంటూ ట్వీట్ చేశారు.
'ఇస్మార్ట్ శంకర్' నెక్ట్స్ షెడ్యూల్ వారణాసి(కాశీ)లో జరుగబోతోంది. వారణాసి షెడ్యూల్ అనంతరం సాంగ్ చిత్రీకరణ కోసం చిత్ర బృందం ఫారిన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు సమాంతరంగా పూరి తనయుడు ఆకాష్ నటిస్తున్న 'రొమాంటిక్' షూటింగ్ కూడా గోవాలో జరుగుతున్న సంగతి తెలిసిందే.

'ఇస్మార్ట్ శంకర్' మే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. రామ్, నిధి అగర్వాల్, నభా నటేష్, పునీత్ ఇస్సార్, సత్యదేవ్, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, సుధాంశు పాండే తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్: రియల్ సతీష్, సాహిత్యం: భాస్కరభట్ల, ఎడిటర్: జునైద్ సిద్ధికీ, ఆర్ట్: జానీ షేక్, సినిమాటోగ్రఫీ: రాజ్ తోట, మ్యూజిక్: మణిశర్మ, నిర్మాతలు: పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్, దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











