‘ఇస్మార్ట్ శంకర్’ రిలీజ్ డిటేల్స్ ప్రకటించిన ఛార్మి
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ఇస్మార్ట్ శంకర్. శ్రీమతి లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్‌పై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయిన సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన చార్మి సినిమా ప్రోగ్రెస్ వెల్లడిస్తూ ఓ వీడియో విడుదల చేశారకు.

"ఇస్మార్ట్ శంకర్ షూటింగ్ గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో జరుగుతుంది. దాదాపు 30 రోజుల పాటు జరిగిన మాసివ్ షెడ్యూల్ ముగిసింది. యూనిట్ మొత్తం ఇపుడు గోవా వెళుతున్నాం. అక్కడ మరో భారీ షెడ్యూల్ షూట్ చేయబోతున్నాం. గోవాలో షూటింగ్ పూర్తవ్వగానే వారణాసి(కాశీ) వెళతాం. తర్వాత ఓ సాంగ్ షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది. గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాట్ షెడ్యూల్స్ పూర్తి చేస్తున్నాం. మేము చేస్తున్న మరో మూవీ 'రొమాంటిక్' షూటింగ్ కూడా గోవాలో 45 రోజులు ప్లాన్ చేస్తున్నాం. వరుసగా రెండు చిత్రాలు కంప్లిట్ చేయబోతున్నాం. 'ఇస్మార్ట్ శంకర్' చిత్రాన్ని మేలో విడుదల చేయడానికి సన్నహాలు చేస్తున్నాం. త్వరలోనే డేట్ అనౌన్స్ చేస్తాం'' అని చార్మి తెలిపారు.
ఇస్మార్ట్ శంకర్ సినిమాలో రామ్ సరికొత్త లుక్‌లో ప్రేక్షకులను అలరించబోతున్నాడు. డబుల్ ధమాకా దిమాక్ ' అనే క్యాప్షన్ తో సినిమా వస్తుండగా సరికొత్త హెయిర్ స్టైల్, గడ్డంతో రామ్ ఈ సినిమాలో కనిపించనున్నారు.
రామ్, నిధి అగర్వాల్, నభా నటేష్, పునీత్ ఇస్సార్, సత్యదేవ్, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, సుధాంశు పాండే తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్: రియల్ సతీష్, సాహిత్యం: భాస్కరభట్ల, ఎడిటర్: జునైద్ సిద్ధికీ, ఆర్ట్: జానీ షేక్, సినిమాటోగ్రఫీ: రాజ్ తోట, మ్యూజిక్: మణిశర్మ, నిర్మాతలు: పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్, దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











