ఆ ఇద్దరిని విలువైన గిప్టులుగా ఇచ్చావు.. పూరీకి జీవితాంతం రుణపడి ఉంటా.. రేణు భావోద్వేగం
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, రేణుదేశాయ్ కలిసి నటించిన బ్రది చిత్రానికి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ చిత్రంతో అనుబంధం ఉన్న ప్రతీ ఒక్కరు తన అనుభూతులను, అనుభవాలను గుర్తు చేసుకొన్నారు. ఈ చిత్రానికి 20 ఏళ్లు పూర్తవ్వడమే కాకుండా దర్శకుడు పూరీ జగన్నాథ్‌కి కూడా కెరీర్ పరంగా రెండు దశాబ్దాలను పూర్తి చేసుకొన్నారు. అయితే ఈ సినిమా వల్ల నాకు రెండు వెలకట్టలేని గిఫ్టులు లభించాయి అంటూ రేణుదేశాయ్ పేర్కొన్నారు. ఈ సినిమా గురించి అనుభూతుల్లోకి వెళితే..

పవన్, రేణుదేశాయ్ మధ్య
పవన్ కల్యాణ్, రేణుదేశాయ్ మధ్య పరిచయానికి కారణం బద్రినే. పరోక్షంగాను, ప్రత్యక్షంగాను పూరీ జగన్నాథ్ కారణమయ్యారు. వీరిద్దరూ నటింంచిన బద్రి చిత్రం ఏప్రిల్ 20వ తేదీ 2000న రిలీజై భారీ విజయాన్ని అందుకొన్నది. ఆ పరిచయమే వారిని ఒక్కటిగా చేసింది. ఏడడుగులు నడిచే విధంగా చేసింది.

పవన్, రేణు విడాకులు
అయితే అనుకొని పరిస్థితుల కారణంగా పవన్, రేణు ఇద్దరు విడిపోయారు. కానీ వారిద్దరికి పుట్టిన ఇద్దరు సంతానం ఆద్య, అఖిరాతో కలిసి రేణు ఉంటున్నది. వారినే సర్వస్వంగా భావిస్తున్నది. ఇదే విషయాన్ని మరోసారి చెప్పారు. బద్రి వేడుకను పురస్కరించుకొని రేణు భావొద్వేగానికి లోనయ్యారు.

బద్రీకి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా
బద్రీ రిలీజ్ అయి 20 ఏళ్లు అయిన సందర్భంగా నా గ్రాటిట్యూట్‌ను తెలియజేస్తున్నాను. నాలో ప్రతిభను గుర్తించి, నటిగా అవకాశం ఇచ్చినందుకు పూరీకి జీవితాంతం రుణపడి ఉంటాను. ఆడిషన్ లేకుండా నన్ను ఎంపిక చేసుకోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. బద్రి సినీ జీవితానికి తొలి అడుగు అని రేణుదేశాయ్ పేర్కొన్నారు.

పూరీపై ప్రశంసలు
18 ఏళ్ల వయసులో సినీ ప్రపంచం అంటే ఏమిటో తెలియదు. అలాంటి సమయంలో నన్ను బాగా చూసుకొని ప్రోత్సహించారు. నాలో నాపై ఆత్మ విశ్వాసం పెంచేలా చేశారు. అంతేకాకుండా ఎంతో ప్రతిభావంతులైన సహ నటులను పరిచయం చేసినందుకు పూరీకి సర్వదా రుణపడి ఉంటాను అని రేణు దేశాయ్ అన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ పేరును ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం.
Recommended Video

ఆద్య, అఖిరాలను విలువైన గిఫ్టులుగా
బద్రిలాంటి సినిమాను తన జీవితానికి ఇచ్చినందుకు రేణు దేశాయ్ పూరికి థ్యాంక్స్ చెప్పారు. అంతేకాకుండా నా జీవితంలో ఆద్య, అఖిరాలను వెలకట్టలేని బహుమతులుగా భావిస్తాను. వారిని ఇచ్చినందుకు పూరికి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు అని రేణు అన్నారు.


Click it and Unblock the Notifications











