CCL 2025: క్రికెట్‌కు ఆది సాయికుమార్ ఎందుకు గుడ్‌బై చెప్పారంటే? సాయికుమార్ ఎమోషనల్ (Video)

సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (CCL 2025) రసవత్తరంగా కొనసాగుతున్నది. ప్రొఫెషనల్ క్రికెటర్లకు మించి సినీ తారలు తమ ప్రతిభను చాటుతున్నారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీలింగ్‌ విభాగాల్లో తమకు తామే సాటి అని ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్‌ల సందర్భంగా డైలాగ్ కింగ్ సాయికుమార్ తెలుగు వారియర్స్, కన్నడ బుల్డోజర్స్ జట్ల ఆటగాళ్లను ప్రోత్సాహించేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఫిల్మీబీట్ తెలుగుతో తన అభిప్రాయలను పంచుకొన్నారు. సాయికుమార్ చెప్పిన విషయాల్లోకి వెళితే..

CCL 2025 : నాగార్జున వస్తే అదే జరుగుతుంది .. తెలుగు వారియర్స్ ఓనర్ సచిన్ జోషి
సీసీఎల్ మ్యాచ్‌లు చూడటమంటే నాకు చాలా ఇష్టం. ఇంటర్నేషనల్ క్రికెటర్లకు ఏ మాత్రం తీసిపోకుండా అన్ని జట్ల యాక్టర్లందరూ ప్రొఫెషనలిజాన్ని ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా భారీగా హాజరైన ప్రేక్షకుల మధ్య, వారి ఉత్సాహం, కేరింతల మధ్య మ్యాచ్ చూడటం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. హీరో శ్రీకాంత్ అబ్బాయి రోషన్ బ్యాటింగ్ చాలా అద్బుతంగా ఉంది. కష్టాల్లో జట్టు ఉన్నప్పుడు సిక్సులు, ఫోర్లతో బ్యాటింగ్ చేసి జట్టును ఆదుకొన్నారు అని సాయికుమార్ అన్నారు.

Actor Sai Kumar praises Roshan Adi Saikumar Karanataka Buldozers team performance in CCL 2025

నాకు, హీరో శ్రీకాంత్‌కు క్రికెట్ అంటే ప్రాణం. మేము ఆడకపోయినా మా అబ్బాయిలు రోషన్, ఆది సాయికుమార్ ఆడుతుంటే చాలా ముచ్చటేస్తున్నది. క్రికెట్ అంటే నాకు పిచ్చి. ఉప్పల్‌లో ఏ మ్యాచ్ జరిగిన మిస్ కాకుండా చూస్తాను. తెలుగు వారియర్స్ జట్టులో ఉన్న ఆటగాళ్లందరూ కూడా నా పిల్లల్లాంటి వారు. వారు ఆడుతుంటే నేను చూడకుండా ఉంటానా? అని సాయికుమార్ చెప్పారు.

రోషన్ ఆటతీరు బాగుంది. కాలికి గాయం కారణంగా ఆడలేకపోతున్నాడని శ్రీకాంత్ చెప్పాడు. రోషన్ బ్యాటింగ్‌కు వెళ్తుంటే? ముందే ఆది నాతో మాట్లాడుతూ బ్యాటింగ్‌తో చితక్కొట్టేస్తాడు అంటూ ముందే చెప్పాడు. ఆది చెప్పినట్టే రోషన్ బ్యాటింగ్‌తో మెరుపులు మెరిపించాడు. ఆయన ఆడి తీరు చూస్తే అన్ని మంచి షాట్సే కొట్టాడు అని సాయికుమార్ తెలిపారు.

నిన్నటి మ్యాచ్‌లో ఆది సాయికుమార్ అద్బుతంగా బౌలింగ్ చేశాడు. భోజ్‌పురి కెప్టెన్ మనోజ్ తివారీ వికెట్ తీశాడు. కీలక సమయంలో ఆది బౌలింగ్ చేస్తుంటే.. ఫస్ట్ టైమ్ టెన్షన్‌కు గురయ్యాను. సీసీఎల్ ఫార్మాట్ బౌలర్లకు అనుకూలం కాదు. బ్యాట్స్‌మెన్స్ ప్రతీ బాల్‌ను సిక్సర్ కొట్టాలనే చూస్తాడు. అలాంటి పరిస్థితుల్లో బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. ఆది బౌలింగ్ చేసిన తీరు అందర్నీ ఆకట్టుకొన్నది అని అన్నారు.

మా అబ్బాయి ఆది సాయికుమార్ మంచి క్రికెటర్. హైదరాబాద్ తరఫున అండర్ 19 టోర్నమెంట్‌ను శ్రీలంకలో ఆడారు. రాయుడు, ఓజా లాంటి క్రికెటర్లతో కలిసి ఆడిన అనుభం ఉంది. సినిమాపై ఇంట్రెస్ట్ కారణంగా క్రికెట్‌ను వదిలేశాడు. లేకపోతే మంచి క్రికెటర్ అయి ఉండే వాడు. ప్రస్తుతం తెలుగు వారియర్స్ జట్టుకు కీలకమైన ఆటగాడిగా సేవలు అందించడం చాలా హ్యాపీగా ఉంది అని సాయికుమార్ అన్నారు.

Actor Sai Kumar praises Roshan Adi Saikumar Karanataka Buldozers team performance in CCL 2025

కిచ్చ సుదీప్ నేతృత్వంలోని కర్ణాటక బుల్డోజర్స్ జట్టుపై సాయికుమార్ ప్రశంసలు గుప్పించారు. జై కర్ణాటక. కిచ్చ సుదీప్ వెరీ వెరీ ఎనర్జిటిక్ లీడర్. ఆ జట్టు అద్బుతంగా ఆడుతున్నది. ఇప్పటికే మూడు మ్యాచ్‌లు గెలిచి సెమిఫైనల్‌కు వెళ్లారు. ఇదే జోష్ కొనసాగిస్తే కర్ణాటక కప్ గెలవడం ఖాయమని సాయికుమార్ అభిప్రాయపడ్డారు.

More from Filmibeat

Read more about: sai kumar adi saikumar ccl 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X