TFI Fans Cricket League అల్లు అర్జున్ ఫ్యాన్స్ ధాటికి కుప్పకూలిన మహేష్ అభిమానులు.. ఐకాన్ స్టార్స్ ఘన విజయం!
తెలుగు సినీ హీరోల అభిమానులు క్రికెట్ టోర్ని టీఎఫ్ఐ ఫ్యాన్స్ క్రికెట్ టోర్ని లీగ్ (TFI Fans Cricket League) రసవత్తరంగా జరుగుతున్నది. స్టార్ హీరోల ఫ్యాన్స్ క్రికెట్ జట్టుగా ఏర్పడి నిర్వహిస్తున్న ఈ టోర్ని ప్రొఫెషనల్‌గా సాగుతున్నది. గత మూడు రోజులుగా సాగుతున్న ఈ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్ దశకు చేరుకొన్నది. ఈ క్రమంలో అల్లు అర్జున్ అభిమానులు జట్టు ఐకాన్ స్టార్స్, మహేష్ బాబు ఫ్యాన్స్ జట్టు గ్లోబ్ ట్రాటెర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్‌లోని ఏఎం క్రికెట్ గ్రౌండ్‌లో గ్లోబ్ ట్రాటెర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఐకాన్ స్టార్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొన్నది. గౌరీ శంకర్, పాండు ఇద్దరు ఇన్నింగ్స్ ఆరంభించి.. తొలి వికెట్‌కు 101 పరుగులు జోడించారు. 35 బంతుల్లో 11 ఫోర్లు 2 సిక్సర్ల సహాయంతో 70 పరుగులు చేసి అవుటయ్యాడు. దాంతో జట్టు భారీ స్కోర్ చేయడానికి దోహదపడింది.

ఐకాన్ స్టార్ జట్టులో పాండు 35 పరుగులు, కే గిరి 28 పరుగులు, విలయమ్ 16, బాబీ 23 పరుగులు, అజయ్ 11, నవీన్ 12 పరుగులు చేశారు. దాంతో ఈ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసింది. గ్లోబ్ ట్రాటెర్స్ జట్టులో గణేష్ 3 వికెట్ుల, జిట్టు 2 వికెట్లు, రాజ్ 2 వికెట్లు పడగొట్టారు. అంజి రెడ్డి, దీక్షిత్ చెరో వికెట్ సాధించారు.
ఐకాన్ స్టార్స్ విసిరిన 218 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన మహేష్ బాబు అభిమానుల జట్టు 38 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. జిట్టూ 31 పరుగులతో జట్టును ఆదుకొనేందుకు ప్రయత్నించారు. కానీ బ్యాట్స్‌మెన్లందరూ తక్కువ స్కోర్లకే అవుట్ కావడం జట్టు లక్ష్యం ముందు చతికిలపడింది.

గ్లోబ్ ట్రాటెర్స్ జట్టు నిర్ణీత ఓవర్ల కంటే ముందే 13.1 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది. దాంతో ఐకాన్ స్టార్స్ జట్టు 110 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. గిరి, అజయ్ రెండేసి వికెట్లు, సూరజ్, బాబీ, చక్రవర్తి, పాండు తలో వికెట్ పడగొట్టారు.


Click it and Unblock the Notifications











