బికినీలో హార్ట్ బీట్ పెంచేస్తోంది.. మాల్దీవుల్లో ‘రౌడీ’ భామ రచ్చ

బాలీవుడ్ హీరోయిన్లంటే తెర మీదే కాదు సోషల్ మీడియాలో కళ్లు చెదిరేలా షాకులు ఇస్తుంటారు. బికినీలు అక్కడి హీరోయిన్లకు కామన్. తెరపై ఎంతలా అందాలను ఆరబోస్తుంటారో.. సోషల్ మీడియాలోనూ అంతకు మించి అనేలా చేస్తుంటారు. తాజాగా పూరి జగన్నాథ్ భామ, విజయ్ దేవరకొండ హీరోయిన్ అనన్య పాండే సోషల్ మీడియాలో రచ్చ చేసింది. అది కూడా మాల్దీవుల్లో. బికినీలో అందాలను ఆరబోసి నెటిజన్లకు కిక్కిచ్చింది.

 మాల్దీవుల్లో హీరోయిన్ల రచ్చ..

మాల్దీవుల్లో హీరోయిన్ల రచ్చ..

ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్ తారలు అని తేడా లేకుండా అందరూ కూడా మాల్దీవులకు చెక్కేస్తున్నారు. హీరోయిన్లు తమ స్నేహితులతోనో, ఫ్యామిలీతోనో మాల్దీవుల్లోనూ కనిపిస్తున్నారు. ఆ మధ్య వరుసబెట్టి అందరూ అక్కడికే చెక్కేశారు. అన్ లాక్ ప్రక్రియ మొదలయ్యాక టూరిజం డెవలప్ మెంట్ కోసం అన్నట్టుగా అందరూ అక్కడికే వెళ్లారు.

షూటింగ్ మొదలెట్టే ముందు..

షూటింగ్ మొదలెట్టే ముందు..

అనన్య పాండే త్వరలోనే ఫైటర్ సినిమా షూటింగ్ మొదలు కాబోతోంది. ఈ మేరకు విజయ్ దేవరకొండ కూడా వర్కవుట్లు ప్రారంభించాడు. జనవరి మొదటి వారంలోనే ఫైటర్ చిత్రీకరణ మొదలయ్యేలా కనిపిస్తోంది. అందుకోసమే అనన్య అంతకు మునుపే తన వెకేషన్‌ను పూర్తి చేసుకోబోతోందని తెలుస్తోంది.

 న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్...

న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్...

అనన్య పాండే నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా మాల్దీవులకు వెళ్లినట్టు తెలుస్తోంది. అక్కడే ఇంకో రెండు మూడు రోజులు ఎంజాయ్ చేసేలా కనిపిస్తోంది. అయితే తాజాగా ఆమె షేర్ చేసిన బికినీ ఫోటోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. రౌడీ భామ చేస్తోన్న అందాల ఆరబోతకు నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

మరో వైపు విజయ్ అలా..

మరో వైపు విజయ్ అలా..

అనన్య మాల్దీవుల్లో రచ్చ చేస్తుండగా.. విజయ్ దేవరకొండ మాత్రం గోవాకు బయల్దేరాడు. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్‌లో భాగంగా విజయ్ గోవాకు చెక్కేశాడు. ఈ మేరకు ఎయిర్ పోర్ట్‌లో దర్శనమిచ్చిన విజయ్ తనదైన ముద్రలో రెడీ అయ్యాడు. వెరైటీ డిజైనర్ షర్ట్‌ను ధరించిన విజయ్ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X