వరుణ్ తేజ్.. విజయ్ దేవరకొండ బాక్సింగ్ సినిమాలు.. రెండింటికి ఉన్న తేడా ఇదే!

అప్పుడప్పుడు సినిమాలకు సంబంధించిన కాన్సెప్ట్స్ అనుకోకుండా క్లాస్ అవుతుంటాయి. ఆ మధ్య నాని జెర్సీ, నాగ చైతన్య మజిలీ సినిమాలు రెండు కూడా క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ గా ఆడియెన్స్ ను టచ్ చేశాయి. దాదాపు రెండు సినిమాలు ఒకేసారి సందడి చేశాయి. ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ, వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యంలో సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాల టైటిల్స్ ను అదే తరహాలో రిలీజ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

Recommended Video

Vijay Devarakonda Liger Movie Craze In Hyderabad | Filmibeat Telugu
మొదట బాక్సర్ అన్నారు

మొదట బాక్సర్ అన్నారు

మెగా హీరో వరుణ్ తేజ్ లాక్ డౌన్ కంటే ముందే బాక్సింగ్ నేపథ్యంలో ఒక డిఫరెంట్ సినిమాను సెట్స్ పైకి తెచ్చిన విషయం తెలిసిందే. ఇక ఆ సినిమాకు సంబంధించిన టైటిల్ పై గతంలో బాక్సర్ అని అనేక రకాల రూమర్స్ వచ్చాయి. ఫైనల్ గా పుట్టినరోజు సందర్భంగా గని అని టైటిల్ మోషన్ పోస్టర్ ను రామ్ చరణ్ విడుదల చేశాడు.

విజయ్ ఫైటర్ అన్నారు

విజయ్ ఫైటర్ అన్నారు

ఇక విజయ్ దేవరకొండ కూడా లాక్ డౌన్ కంటే ముందే బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమాను మొదలు పెట్టాడు. దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక సినిమాకు మొదట ఫైటర్ అనే టైటిల్ అనుకున్న విషయం తెలిసిందే. ఇక ఫైనల్ గా లైగర్ అని ఫిక్స్ చేశారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం 120కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.

రెండు సినిమాలకు చాలా తేడా ఉంది..

రెండు సినిమాలకు చాలా తేడా ఉంది..

అయితే విజయ్, వరుణ్ ఇద్దరు కూడా బాక్సింగ్ నేపథ్యంలో కథలను సెలెక్ట్ చేసుకోవడం అది కూడా దాదాపు ఒకేసారి టైటిల్ ఎనౌన్స్మెంట్ ఇవ్వడం విశేషం. అయితే రెండు సినిమాలకు మాత్రం చాలా బేధాలు ఉన్నాయి. పూరి జగన్నాథ్ మేకింగ్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే గని దర్శకుడు కిరణ్ కొర్రపాటి కొత్తవాడు అయినప్పటికీ ఈ సినిమాను పూర్తిగా భిన్నంగా తెరకెక్కిస్తున్నాడు.

గని స్టోరీ

గని స్టోరీ

ఒలింపిక్ పతకాలు సాధించిన వారిలో అందరు క్రీడాకారులు తగిన గుర్తింపును అందుకోలేకతున్నారు. భారతదేశంలో పరిస్థితి మరింత ఘోరంగా ఉందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఛాంపియన్స్ ఎదుర్కొంటున్న ఈ నిర్లక్ష్యాన్ని తన చిత్రం హైలైట్ చేస్తుందని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కిరణ్ అన్నారు. ఇలాంటి స్పోర్ట్స్ డ్రామాలో నటించాలని వరుణ్ తేజ్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నట్లు వివరణ ఇచ్చాడు.

లైగర్ విషయానికి వస్తే..

లైగర్ విషయానికి వస్తే..

పులికి సింహానికి పుట్టిన క్రాస్ బ్రీడ్ లైగర్ పేరును తీసుకున్న పూరి జగన్నాథ్ టైటిల్ తోనే మంచి హైప్ క్రియేట్ చేశాడు. అయితే ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలోనే తెరకెక్కుతున్న రివెంజ్ డ్రామా అని తెలుస్తోంది. పూరి మార్క్ డైలాగులు, హేవి యాక్షన్ సీక్వెన్స్ పుష్కలంగా ఉంటాయట. పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకులకు ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X