ఫైటర్ ఓ బ్లాక్ బస్టర్ స్క్రిప్ట్.. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు.. క్లారిటీ ఇచ్చిన ఛార్మీ
పూరి జగన్నాద్ విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో ఫైటర్ అనే ప్యాన్ ఇండియా చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పూరి జగన్నాద్ స్పీడ్ ఏ రేంజ్‌లో ఉంటుందో అందరికీ తెలిసిందే. కేవలం 60, 70 రోజుల్లోనే ఎంత పెద్ద హీరోతోనైనా సినిమాను తీయగలడు. అలాంటి పూరి జగన్నాద్ వేగానికి కరోనా వైరస్ బ్రేకులు వేసింది. లాక్ డౌన్ కారణంగా పూరి జగన్నాద్ ఫైటర్ షూటింగ్ ఆగిపోయింది. అయితే తాజాగా ఈ చిత్రంపై ఎన్నో రూమర్స్ చక్కర్లు కొట్టాయి. వాటికి కాసేపటి క్రితమే నిర్మాత ఛార్మీ క్లారిటీ ఇచ్చింది

ముంబై షెడ్యూల్..
పూరి జగన్నాద్ మొదటిసారిగా ప్యాన్ ఇండియా సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ క్రమంలో కరణ్ జోహర్‌తో చేతులు కలిపాడు. విజయ్ దేవరకొండను భారీ ఎత్తున జాతీయ స్థాయిలో పరిచయం చేసేందుకు ప్లాన్ చేశాడు. ఈ క్రమంలో ముంబైలో అదిరిపోయే షెడ్యూల్‌ను పూర్తి చేశారు.

పూరి మార్క్ రొమాంటిక్..
పూరి జగన్నాద్ సినిమాలో యాక్షన్, రొమాన్స్ ఏ రేంజ్‌లో ఉంటుందో అందరికీ తెలిసిందే. పూరి మార్క్ రొమాన్స్‌కు ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో తెలిసిందే. అనన్య పాండే, విజయ్ దేవరకొండలు ముంబై వీధుల్లో అర్ధరాత్రి వేళల్లో బాగానే తిరిగినట్టున్నారు. ఈ మేరకు చిత్రీకరించిన సీన్స్, ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి.

లాక్ డౌన్‌తో అంతా తారుమారు..
లాక్ డౌన్ వల్ల ముందుగా అనుకున్న ప్రణాళికలన్నీ తారుమారు అయ్యాయి. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల వల్ల భారీ స్థాయి చిత్రాలు, అవుట్ డోర్ లొకేషన్లకు వెళ్లే ఛాన్స్ లేదు. కాబట్టి పూరి తన స్క్రిప్ట్‌లో భారీ మార్పులు చేశారని, లొకేషన్లీ హైద్రాబాద్‌కే షిఫ్ట్ అవుతున్నాయని రూమర్స్ వచ్చాయి.
Recommended Video

బ్లాక్ బస్టర్ స్క్రిప్ట్..
ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నలకు ఛార్మీ స్పందిస్తూ.. అన్నింటిపై ఓ క్లారిటీ ఇచ్చింది. ‘ఫైటర్ స్క్రిప్ట్‌లో ఎలాంటి మార్పులు చేయడం లేదు. ఇది బ్లాక్‌బస్టర్ స్క్రిప్ట్. ఈ మూవీ పట్ల మేమంతా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. త్వరలోనే టైటిల్ అనౌన్స్ చేస్తామ'ని స్పష్టతనిచ్చింది.


Click it and Unblock the Notifications











